Nokia 5.4 మిడ్-రేంజ్ స్మార్ట్‌ఫోన్ మొదటి సేల్ ప్రారంభం అయ్యాయి!! త్వరపడండి..
ప్రముఖ HMD గ్లోబల్ సంస్థ ఇండియాలో ఫిబ్రవరి 11, 2021 న నోకియా 3.4 బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌తో పాటుగా నోకియా 5.4 ను విడుదల చేసారు. ఈ తాజా మిడ్-రేంజ్ స్మార్ట్‌ఫోన్ యొక్క మొదటి అమ్మకాలు నేడు ఇండియాలో మొదలయ్యాయి. వృత్తాకార రియర్ కెమెరా మాడ్యూల్‌ను కలిగి ఉండి 64GB ఆన్‌బోర్డ్ స్టోరేజ్, 4GB ర్యామ్ వేరియంట్‌లతో రూ.13,999 ప్రారంభ ధర వద్ద లభించే ఈ ఫోన్ యొక్క ఇతర వివరాల గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

నోకియా 5.4 ధరలు & సేల్ ఆఫర్స్ వివరాలు
నోకియా 5.4 కొత్త స్మార్ట్‌ఫోన్‌ను రెండు వేరు వేరు ర్యామ్ కాన్ఫిగరేషన్లలో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది. ఇందులో 4GB ర్యామ్ + 64GB స్టోరేజ్ వేరియంట్ యొక్క ధర రూ.13,999 కాగా, 6GB ర్యామ్ + 64GB స్టోరేజ్ వేరియంట్ యొక్క ధర రూ.15,499. ఇది డస్క్ మరియు పోలార్ నైట్ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. ఫ్లిప్‌కార్ట్ మరియు నోకియా ఇండియా వెబ్‌సైట్ లో వీటి అమ్మకాలు ఇప్పటికే మొదలయ్యాయి. ఈ అమ్మకంలో ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ మరియు డెబిట్ కార్డుల కొనుగోలు మీద 5% వరకు క్యాష్ బ్యాక్ లభిస్తుంది.

నోకియా 5.4 స్నాప్‌డ్రాగన్ 662 SoC స్పెసిఫికేషన్స్
నోకియా 5.4 ఫోన్ యొక్క స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే ఇది డ్యూయల్ సిమ్ (నానో) స్లాట్ కలిగి ఉండి ఆండ్రాయిడ్ 10తో రన్ అవుతూ త్వరలోనే ఆండ్రాయిడ్ 11 అప్ డేట్ స్వీకరించడానికి సిద్ధంగా ఉంది. ఈ ఫోన్ 6.39-అంగుళాల HD + డిస్ప్లేని 720x1,560 పిక్సెల్స్, 19.5: 9 కారక నిష్పత్తి మరియు 400 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ తో కలిగి ఉంది. ఇది క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 662 SoC చేత శక్తిని పొందుతూ 64GB ఇంటర్నల్ స్టోరేజ్, 6GB వరకు ర్యామ్‌తో జతచేయబడి వస్తుంది. ఇందులో గల మైక్రో SD కార్డ్ స్లాట్ దారా మెమొరీని 512GB వరకు విస్తరించడానికి అనుమతిని ఇస్తుంది.

నోకియా 5.4 ఫోన్ యొక్క ఆప్టిక్స్ విషయానికి వస్తే వెనుక భాగంలో క్వాడ్ రియర్ కెమెరా సెటప్‌తో ప్యాక్ చేయబడి వస్తుంది. ఇందులో 48 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్, అల్ట్రా-వైడ్-యాంగిల్ లెన్స్‌తో 5 మెగాపిక్సెల్ సెన్సార్, 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ మరియు 2 మెగాపిక్సెల్ మాక్రో షూటర్ కెమెరాలు ఉన్నాయి. ముందు భాగంలో పంచ్-హోల్ కటౌట్‌లో 16 మెగాపిక్సెల్ సెన్సార్ సెల్ఫీ కెమెరాను కలిగి ఉన్నాయి. కనెక్టివిటీ ఎంపికలలో వై-ఫై, బ్లూటూత్ 4.2, జిపిఎస్ / ఎ-జిపిఎస్, 3.5mm హెడ్‌ఫోన్ జాక్ మరియు ఛార్జింగ్ కోసం యుఎస్‌బి టైప్-సి పోర్ట్ ఉన్నాయి. ఆన్‌బోర్డ్‌లోని సెన్సార్లలో యామియంట్ లైట్ సెన్సార్, సామీప్య సెన్సార్, యాక్సిలెరోమీటర్ మరియు గైరోస్కోప్ ఉన్నాయి. ఇది 10W ఛార్జింగ్కు మద్దతుతో 4000mAh బ్యాటరీతో ప్యాక్ చేయబడి వస్తుంది.


Click it and Unblock the Notifications








