Nokia 5310: అతి తక్కువ ధరలో గొప్ప ఫీచర్లతో సరైన ఎంపిక ఇదే...

|

ప్రముఖ హెచ్‌ఎండి గ్లోబల్ సంస్థ ఇండియాలో ఇప్పుడు తన సరికొత్త ఫీచర్ ఫోన్‌గా నోకియా 5310 ను విడుదల చేసారు. ఈ కొత్త ఫీచర్ ఫోన్ ఆగస్టు 2007 లో విడుదల అయిన నోకియా 5310 ఎక్స్‌ప్రెస్ మ్యూజిక్ యొక్క రిఫ్రెష్ వెర్షన్ గా అందుబాటులోకి రానున్నది.

నోకియా 5310 ఫీచర్ ఫోన్‌

నోకియా 5310 ఫీచర్ ఫోన్‌

నోకియా 5310 ఫీచర్ ఫోన్‌ డ్యూయల్ సిమ్ మద్దతుతో మరియు ఒక ఛార్జీ మీద 22 రోజుల బ్యాటరీ లైఫ్ ను అందించే బ్యాటరీతో ప్యాక్ చేయబడి వస్తుంది. నోకియా 5310 ఫీచర్ ఫోన్‌లో MP3 ప్లేయర్ మరియు వైర్‌లెస్ FMరేడియో ముందే ప్రీలోడ్ చేయబడి ఉంటుంది. ఇంకా ఈ కొత్త నోకియా ఫోన్‌ గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి. Also Read:Redmi Note 9 Pro Sale ఎయిర్‌టెల్ ఆఫర్లతో పాటు మరిన్ని ఆఫర్స్!!!

నోకియా 5310 ఫీచర్ ఫోన్ ధర మరియు లభ్యత వివరాలు

నోకియా 5310 ఫీచర్ ఫోన్ ధర మరియు లభ్యత వివరాలు

ఇండియాలో సరికొత్త ఫీచర్ ఫోన్‌ నోకియా 5310ను బ్లాక్ / రెడ్ మరియు వైట్ / రెడ్ వంటి కలర్ ఆప్షన్లలో రూ.3,399 ధర వద్ద విడుదల చేసారు. ఈ ఫోన్ అమెజాన్ ఇండియా మరియు నోకియా యొక్క ఆన్‌లైన్ స్టోర్ ద్వారా జూన్ 23 నుండి దేశంలో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంటుంది. అలాగే ఇది ఇప్పుడు నోకియా ఇండియా ఆన్‌లైన్ స్టోర్‌లో ప్రీ-బుకింగ్ కోసం అందుబాటులో ఉంది. జూలై 22 నుండి ఆఫ్‌లైన్ రిటైలర్ల ద్వారా కూడా దీని యొక్క అమ్మకం జరగనున్నది. Also Read:Rs.30,000 పైన ధర గల స్మార్ట్‌ఫోన్‌లలో బెస్ట్ ఇవే...

నోకియా 5310 స్పెసిఫికేషన్స్

నోకియా 5310 స్పెసిఫికేషన్స్

డ్యూయల్ సిమ్ మినీ స్లాట్ గల నోకియా 5310 సిరీస్ ఫోన్లు మీడియాటెక్ MT6260A SoC మరియు 30+ ఆపరేటింగ్ సిస్టమ్‌ ద్వారా రన్ అవుతున్నది. ఇది 240x320 పిక్సెల్స్ పరిమాణంలో 2.4-అంగుళాల QVGA డిస్ప్లేని కలిగి ఉంది. నోకియా యొక్క ఈ ఫీచర్ ఫోన్‌ 8MB ర్యామ్‌తో మరియు 16MB ఇంటర్నల్ స్టోరేజ్ తో జతచేయబడి వస్తుంది. ఇందులో గల మైక్రో SD కార్డ్ స్లాట్ ద్వారా మెమొరీని 32GB వరకు విస్తరించవచ్చు. ఈ నోకియా 5310 ఫీచర్ ఫోన్ వెనుక భాగంలో VGA కెమెరాను కలిగి ఉండి ఇది LED ఫ్లాష్‌తో జత చేయబడి వస్తుంది.

నోకియా 5310  ఫీచర్స్

నోకియా 5310 ఫీచర్స్

హెచ్‌ఎండి గ్లోబల్ సంస్థ ఈ నోకియా 5310 ఫీచర్ ఫోన్ లో బ్లూటూత్ V3.0, మైక్రో- USBపోర్ట్ మరియు 3.5mm హెడ్‌ఫోన్ జాక్‌ వంటి కనెక్టివిటీ ఎంపికలను కలిగి ఉంది. అలాగే ఈ నోకియా 5310 ఫోన్ లో వైర్‌లెస్ FM రేడియో సపోర్ట్ మరియు తొలగించగల బ్యాటరీని కలిగి ఉంది. ఇది ఒక ఛార్జీ మీద 20 గంటల టాక్ టైం మరియు 22 రోజుల స్టాండ్ బై సమయంను అందిస్తుంది. ఈ ఫోన్ 123.7x52.4x13.1mm కొలతలతో 88.2 గ్రాముల బరువును కలిగి ఉంటుంది.

నోకియా 5310 డిజైన్

నోకియా 5310 డిజైన్

నోకియా 5310 ఫీచర్ ఫోన్ డ్యూయల్ ఫ్రంట్ ఫేసింగ్ స్పీకర్లను కలిగి ఉంది. నోకియా యొక్క పాత 5130 మాదిరిగానే నోకియా 5310 ఫోన్ కూడా ఫోన్ అన్ని వైపుల అంకితమైన మ్యూజిక్ బటన్లతో వస్తుంది. అంటే మీరు ఈ బటన్లతో వాల్యూమ్‌ను సర్దుబాటు చేయవచ్చు మరియు ట్రాక్‌ల ద్వారా సులభంగా షఫుల్ కూడా చేయవచ్చు. కుడి వైపున ఉన్న ట్రాక్‌లకు నియంత్రణలు మరియు ఎడమవైపున అంకితమైన వాల్యూమ్ బటన్లు ఉన్నాయి.

ఇండియాలో 2G మొబైల్ మార్కెట్

ఇండియాలో 2G మొబైల్ మార్కెట్

ప్రస్తుతం ఇండియాలోని మొబైల్ మార్కెట్లో ఫీచర్ ఫోన్లు ముఖ్య పాత్రను పోషిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా సుమారు 400 మిలియన్ల మంది వినియోగదారులు ఇప్పటికీ తమ అవసరాలకు 2G ఫోన్‌ను కొనుగోలు చేస్తున్నారు. ఇటువంటి వారు విశ్వసనీయతను మరియు మన్నిక కాలంను అధికంగా అందించే వాటిని ఎక్కువగా కోరుకుంటారు. అటువంటి వారి కోసం నోకియా 5310 ఫీచర్ ఫోన్ సరైన ఎంపిక.

Best Mobiles in India

English summary
Nokia 5310 Xpress Music Feature Phone Launched in India: Price, Specs, Sales Date and More

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X