Nokia 55-inch SmartTV: స్మార్ట్ టీవీ విభాగంలోకి నోకియా గ్రాండ్ ఎంట్రీ

|

ఇండియాలో స్మార్ట్ ఫోన్ మరియు స్మార్ట్ టీవీ మార్కెట్ విభాగం రోజు రోజుకు బాగా అభివృద్ధి చెందుతున్నందున దాదాపు అన్ని కంపెనీల బ్రాండ్లు తమ సొంత స్మార్ట్ టీవీలను మార్కెట్లోకి తీసుకురావాలని చూస్తున్నాయి. ఇప్పటికే చాలా రకాల కంపెనీలు ఈ విభాగంలోకి ప్రవేశించాయి. ఇప్పుడు కొత్తగా నోకియా కూడా ఇందులో అడుగుపెట్టబోతున్నది.

నోకియా-బ్రాండెడ్ స్మార్ట్ టీవీ

నోకియా-బ్రాండెడ్ స్మార్ట్ టీవీలను ఇండియాలో ప్రారంభించటానికి ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ తో భాగస్వామ్యం కుదుర్చుకున్నట్లు గత వారం ప్రకటించింది. నోకియా స్మార్ట్ టీవీ జెబిఎల్ ఆడియోతో వస్తుందని మాత్రమే ధృవీకరించింది. అంతకు మించి ఫ్లిప్‌కార్ట్ సంస్థ రాబోయే టెలివిజన్ గురించి ఎటువంటి విషయాలను వెల్లడించలేదు.

 

గ్లోబల్ 2019 స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో ఈసారి లాభపడింది ఎవరు? నష్టపోయింది ఎవరు?గ్లోబల్ 2019 స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో ఈసారి లాభపడింది ఎవరు? నష్టపోయింది ఎవరు?

55-అంగుళాల 4K డిస్‌ప్లే

నోకియా నుండి రాబోతున్న కొత్త టీవీ 55-అంగుళాల 4K డిస్‌ప్లేను కలిగి ఉంటుందని ఒక కొత్త నివేదిక పేర్కొంది. ఇది (BIS) బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ ధృవీకరణ ద్వారా నిర్ధారించబడింది. నోకియా సంస్థ తన కొత్త స్మార్ట్ టీవీను ఇండియాలో ఎప్పుడు రిలీజ్ చేస్తారో అన్న దాని మీద ఎటువంటి సమాచారం లేదు.

 

Airtel Digital TV లాంగ్ టర్మ్ ప్యాక్‌లపై అదిరిపోయే డిస్కౌంట్లుAirtel Digital TV లాంగ్ టర్మ్ ప్యాక్‌లపై అదిరిపోయే డిస్కౌంట్లు

స్మార్ట్ టీవీ

ప్రస్తుతం నోకియా స్మార్ట్ టీవీలు ఇండియాలోనే తయారుచేస్తున్నారు. ఇవి మొదటిగా ఇండియా మార్కెట్ లోనే రిలీజ్ చేయాలని చూస్తున్నారు. వీటిని ప్రపంచం మొత్తం మీద రిలీజ్ చేస్తారో లేదో అన్న దాని మీద ఎటువంటి సమాచారం లేదు. టైమ్స్ అఫ్ ఇండియా యొక్క నివేదిక ప్రకారం నోకియా టీవీలు ఆండ్రాయిడ్ పై ఆధారంగా రన్ అవుతాయి. అంతేకాకుండా ఇది గూగుల్ ప్లే స్టోర్‌కు కూడా మద్దతు ఇస్తుంది. దీని అర్థం ఈ ఆండ్రాయిడ్ టీవీ మీకు ప్రముఖ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్‌లతో సహా ప్లే స్టోర్‌లోని అనేక యాప్ లకు కూడా యాక్సిస్ ను ఇస్తుంది.

ఆన్‌లైన్‌ పేమెంట్ రంగంలోకి ఫేస్‌బుక్ గ్రాండ్ ఎంట్రీఆన్‌లైన్‌ పేమెంట్ రంగంలోకి ఫేస్‌బుక్ గ్రాండ్ ఎంట్రీ

డిమ్మింగ్ టెక్నాలజీ

నోకియా టివి ఇంటెలిజెంట్ డిమ్మింగ్ టెక్నాలజీతో రాబోతుందని సమాచారం ఉంది. ఇది మంచి కాంట్రాస్ట్ మరియు మెరుగైన డిస్ప్లే నాణ్యతను అందిస్తుంది. నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో వంటి మరిన్ని వీడియో స్ట్రీమింగ్ యాప్ లను ముందే ప్రీలోడ్ చేయబడి ఉన్న నోకియా-బ్రాండెడ్ స్మార్ట్ టీవీను మీరు ఆశించవచ్చు.

 

మీ ఆండ్రాయిడ్ ఫోన్‌లో ఈ యాప్ లు ఉంటే వెంటనే డెలిట్ చేయండిమీ ఆండ్రాయిడ్ ఫోన్‌లో ఈ యాప్ లు ఉంటే వెంటనే డెలిట్ చేయండి

రిలీజ్

నోకియా టీవీ రిలీజ్ తేదీ తెలియకపోయినప్పటికి ఇది డిసెంబర్ ఆరంభంలోనే రిలీజ్ అవుతుందని భావిస్తున్నారు. షియోమి యొక్క Mi టివి, వన్‌ప్లస్ టివి మరియు మోటరోలా టివిలకు పోటీగా ఇండియాలో నోకియా టివి పోటీ ధర ట్యాగ్‌తో విడుదల కానుంది. టీవీ విభాగంలో తన ఉనికిని బలోపేతం చేయడానికి మొదటగా పెద్ద పెద్ద నగరాలను లక్ష్యంగా చేసుకుంటున్నట్లు ఫ్లిప్‌కార్ట్ తెలిపింది.

Best Mobiles in India

English summary
Nokia 55-inch Smart TV Might Arrive India Very Soon

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X