Nokia 5G కొత్త ఫోన్ యొక్క ఫీచర్స్ ఏ రేంజ్ లో ఉన్నాయో ఓ లుక్ వేయండి!!!

|

ఇండియాలో ఫోన్‌ల వినియోగం మొదలైన కొత్తలో అందరికి తెలిసిన మరియు బాగా పాపులర్ అయిన బ్రాండ్ నోకియా ఫోన్. హెచ్‌ఎండి గ్లోబల్ సంస్థ తయారుచేసే నోకియా బ్రాండ్ ఫోన్లకు ఇండియాలోనే కాకుండా ప్రపంచం మొత్తం మీద మంచి డిమాండ్ ఉంది.

నోకియా 5G ఫోన్‌

నోకియా 5G ఫోన్‌

స్మార్ట్ ఫోన్లు వినియోగంలోకి వచ్చిన తరువాత కూడా ఈ నోకియా ఫోన్లకు డిమాండ్ పెరిగింది. ఇప్పుడు 5G నోకియా ఫోన్‌ను త్వరలో విడుదల చేయనున్నట్లు హెచ్‌ఎండి గ్లోబల్ సంస్థ ధృవీకరించింది. క్వాల్‌కామ్‌ సంస్థకు చెందిన సరికొత్త స్నాప్‌డ్రాగన్ 690 చిప్‌సెట్ ను ఉపయోగించి దీనిని తయారుచేస్తున్నారు. క్వాల్‌కామ్‌ యొక్క కొత్త చిప్‌సెట్‌ను నోకియా 5G ఫోన్ లో వినియోగించడం మరొక పెద్ద విషయం. Also Read: OnePlus 8 5G Series Sale : రూ.3,000 తగ్గింపుతో గొప్ప అవకాశం!!! త్వరపడండి...

హెచ్‌ఎండి గ్లోబల్ ట్వీట్

హెచ్‌ఎండి గ్లోబల్ సంస్థ‌కు చెందిన జుహో సర్వికాస్ నోకియా యొక్క 5G ఫోన్ గురించి ట్విట్టర్ ద్వారా ట్వీట్ చేసాడు. "రోజు రోజుకి పరివర్తన చెందుతున్న కాలానికి అనుగుణంగా అప్ డేట్ ప్లాట్‌ఫామ్‌తో మరియు అద్భుతమైన స్పెసిఫికేషన్స్ లతో సరసమైన ధర వద్ద ఫ్యూచర్ ప్రూఫ్ 5G అనుభవంతో నోకియా ఫోన్‌లను తీసుకురావడానికి మేము సంతోషిస్తున్నాము!" అని తెలిపాడు.

నోకియా 5G స్మార్ట్‌ఫోన్ ఫీచర్స్

నోకియా 5G స్మార్ట్‌ఫోన్ ఫీచర్స్

నోకియా 5G స్మార్ట్‌ఫోన్ ట్రూలీ గ్లోబల్ 5G ఫీచర్స్ మరియు క్వాల్‌కామ్‌ యొక్క కొత్త చిప్‌సెట్‌ స్నాప్‌డ్రాగన్ 690 ప్రాసెసర్‌తో లాంచ్ చేయనున్నట్లు జుహో తెలిపారు. ఇందులో మరొక గొప్ప విషయం ఏమిటంటే ఇది నోకియా 8.3 స్మార్ట్‌ఫోన్ కన్నా చౌక ధరలో లాంచ్ కావడం.

నోకియా 5G స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్స్

నోకియా 5G స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్స్

నోకియా సంస్థ తన మొదటి 5G స్మార్ట్‌ఫోన్‌ను ఈ ఏడాది ప్రారంభంలో విడుదల చేసింది. అయితే కరోనావైరస్ కారణం వలన ఈ స్మార్ట్‌ఫోన్ ఇంకా మార్కెట్‌లోకి రాలేదు. ఇవి వినియోగదారులకు అందుబాటులోకి రావడానికి మరికొంత ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. కొత్త స్మార్ట్‌ఫోన్ నోకియా 6.3 లేదా నోకియా 7.3 పేరుతో ఉండవచ్చు. ఇది కొత్త చిప్‌సెట్‌కు మద్దతును ఇస్తుంది. నోకియా సంస్థ నుంచి రాబోయే 5G సపోర్ట్ ఫోన్‌ అత్యంత సరసమైన ధరలో విడుదల అవుతున్న కారణంగా నోకియా సంస్థ మళ్ళి తన పూర్వ వైభవాన్ని పొందనున్నది.

నోకియా 5G చిప్‌సెట్‌

నోకియా 5G చిప్‌సెట్‌

నోకియా 5G స్మార్ట్‌ఫోన్ లో వినియోగిస్తున్న చిప్‌సెట్ స్నాప్‌డ్రాగన్ 690 ప్రాసెసర్ ముందుతరం స్నాప్‌డ్రాగన్ 675 కన్నా 20 శాతం మెరుగ్గా పెనిచేస్తుంది. దీనితో పాటుగా GPU పనితీరు కూడా 60 శాతం మెరుగ్గా ఉంది. ఇది స్నాప్‌డ్రాగన్ X51 ప్రాసెసర్‌తో వస్తుంది. అలాగే ఇది సబ్ -6 GHz నెట్‌వర్క్‌కు మద్దతునివ్వడంతో పాటుగా ఇది వైఫై 6 కి కూడా సపోర్ట్ ఇస్తుంది.

క్వాల్‌కామ్‌ స్నాప్‌డ్రాగన్ 690 చిప్‌సెట్ ఫీచర్స్

క్వాల్‌కామ్‌ స్నాప్‌డ్రాగన్ 690 చిప్‌సెట్ ఫీచర్స్

క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 690 చిప్‌సెట్‌లో ఫాస్ట్‌కనెక్ట్ 6200 మద్దతును కలిగి ఉంది. ఈ చిప్‌సెట్‌లో అదనంగా ARCSOFT అనే కొత్త AI ఇంజిన్ కూడా ఉంది. ఇది షడ్భుజి ఆకారంలో టెన్సర్ యాక్సిలరేటర్‌తో వస్తుంది. ఈ చిప్‌సెట్ ఫుల్ హెచ్‌డి ప్లస్ డిస్ప్లేకు మద్దతును ఇవ్వడంతో పాటుగా ఇది 120HZ రిఫ్రెష్ రేట్ మరియు 4K వీడియో రికార్డింగ్‌కు కూడా మద్దతును ఇస్తుంది. క్వాల్‌కామ్ సంస్థ కొత్త వీడియో ఎన్‌కోడింగ్ మెరుగుదలను కూడా కలిగి ఉందని తెలిపారు. చివరిగా ఇది 4 ప్లస్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో వస్తుంది.

Best Mobiles in India

English summary
Nokia New 5G SmartPhone Comes With Snapdragon 690 SoC

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X