స్మార్ట్‌ఫోన్ మార్కెట్లోకి నోకియా రీఎంట్రీ...?

Posted By:

నోకియా స్మార్ట్‌ఫోన్‌లు త్వరలో మార్కెట్లోకి రాబోతున్నాయి. అవును, తాజాగా విడుదలైన ఓ రిపోర్ట్ ప్రకారం 2016లో నోకియా బ్రాండ్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లోకి రిఎంట్రీ ఇవ్వబోతోంది. ఈ క్రమంలో వర్చువల్ రియాల్టీ టెక్నాలజీతో సహా అనేక కొత్త టెక్నాలజీల పై నోకియా దృష్టిసారిస్తున్నట్లు సమాచారం. మైక్రోసాఫ్ట్‌తో కుదర్చుకున్న డీల్ ప్రకారం నోకియా 2016 నాల్గవ క్వార్టర్ వరకు స్మార్ట్‌ఫోన్‌లు, మరో 10 సంవత్సరాల పాటు ఫీచర్ ఫోన్‌లను సొంతగా మార్కెట్ చేయకూడదు.(వాట్సాప్ రూల్స్! )

స్మార్ట్‌ఫోన్ మార్కెట్లోకి నోకియా  రీఎంట్రీ...?

గతేడాది ఫాక్స్‌కాన్ కంపెనీతో కుదుర్చుకున్న బ్రాండ్ లైసెన్సింగ్ అగ్రిమెంట్‌లో భాగంగా నోకియా ఇటీవల ఎన్1 టాబ్లెట్‌ను అంతర్జాతీయ మార్కెట్లో ఆవిష్కరించింది. ఇదే తరహా బ్రాండ్ లైసెన్సింగ్ అగ్రిమెంట్‌తో స్మార్ట్‌ఫోన్‌ల వ్యాపారంలోకి అడుగుపెట్టేందుక నోకియా ఆలోచన చేస్తున్నట్లు Re/code అనే రిపోర్ట్ పేర్కొంది.

స్మార్ట్‌ఫోన్ మార్కెట్లోకి నోకియా  రీఎంట్రీ...?

మైక్రోసాఫ్ట్‌తో కుదుర్చుకున్న డీల్ తరువాత నోకియా మూడు కంపెనీలుగా విడిపోయింది. అవి నోకియా నెట్‌వర్క్స్, హియర్ మ్యాప్స్, నోకియా టెక్నాలజీస్‌గా ఉన్నాయి. వీటిలో దాదాపు 10,000 పేటెంట్ హక్కులకు ఇన్‌ఛార్జ్‌గా వ్యవహరిస్తున్న నోకియా టెక్నాలజీస్ స్మార్ట్‌ఫోన్‌ల తయారీ పై దృష్టిసారిస్తున్నట్లు సదరు నివేదిక ద్వారా తెలుస్తోంది. ఏదేమైనప్పటికి నోకియా రీ-ఎంట్రీ అదిరిపోవాలని పలువురు ఆకాంక్షిస్తున్నారు.

English summary
Nokia to Re-Enter Smartphone Market in 2016. Report says. Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot