అప్పుడే గూగుల్, ఆపిల్ కంపెనీలకు నోకియా సవాల్

Written By:

రానున్న కాలంలో నోకియా కంపెనీ గూగుల్, ఆపిల్, మైక్రోసాఫ్ట్ కంపెనీలకు సవాల్ విసిరేందుకు రెడీ అయినట్లు తెలుస్తోంది. ఇటీవలే నోకియా 6 స్మార్ట్‌ఫోన్ ను విడుదల చేసి మంచి ఖుషీ మీదున్న నోకియా అదే ఊపులో స్మార్ట్ అప్లికేషన్లతో వినియోగదారులను ఆకట్టుకునేందుకు కసరత్తు చేస్తోంది. దిగ్గజాలకు పోటీగా వికి అనే కొత్త వాయిస్ అసిస్టెంట్ అప్లికేషన్‌తో అతి త్వరలో మన ముందుకు రానుందని సమాచారం.

సరైన అవకాశం..ఐఫోన్లపై ఫ్లిప్‌కార్ట్‌లో భారీ డిస్కౌంట్లు

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

వికి పేరుతో వాయిస్ అసిస్టెంట్ అప్లికేషన్

మైక్రోసాఫ్ట్, ఆపిల్, గూగుల్, అమెజాన్ వంటి టెక్ దిగ్గజాలతో పోటీగా వికి పేరుతో వాయిస్ అసిస్టెంట్ అప్లికేషన్ను నోకియా అభివృద్ధి చేస్తోందట. దీనికి సంబంధించిన ట్రేడ్మార్క్ రిజిస్ట్రేషన్ కోసం యూరోపియన్ యూనియన్లో దరఖాస్తు చేసుకుంది.

ఈ ఏడాదిలోనే మరో ఆరేడు ఫోన్లను

దీంతో పాటు నోకియాతో కలిసి 'నోకియా 6' స్మార్ట్ఫోన్ను విడుదల చేసిన ఫిన్లాండ్ కంపెనీ హెచ్ఎండీ ఈ ఏడాదిలోనే మరో ఆరేడు ఫోన్లను తీసుకురానుందని సమాచారం. వాటిలో నోకియా 'వికి' అప్లికేషన్ ఉండే అవకాశం ఉందని సమాచారం.

నోటితో అడిగే ప్రశ్నలకు

ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్ సాంకేతికతతో పనిచేసే ఈ వికి అప్లికేషన్ నోటితో అడిగే ప్రశ్నలకు ఠక్కున సమాధానాలు చెప్పేస్తుంది.

దిగ్గజాలకు సవాల్

2011 లో ఆపిల్ తొలిసారిగా తీసుకొచ్చిన వాయిస్ అసిస్టెంట్ యాప్ 'సిరి' గ్యాడ్జెట్ ప్రియులను విశేషంగా ఆకట్టుకుంది. ఆ తర్వాత మైక్రోసాఫ్ట్ 'కార్టానా', అమెజాన్ 'అలెక్సా', గూగుల్ 'అసిస్టెంట్' యాప్లూ వచ్చాయి. త్వరలో శాంసంగ్ కూడా సొంతంగా వాయిస్ అసిస్టెంట్ యాప్ను తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తోంది.

ఇప్పుడిప్పుడే స్మార్ట్ఫోన్ మార్కెట్లోకి

ఇప్పుడు ఈ ప్రముఖ సంస్థలతో ఇప్పుడిప్పుడే స్మార్ట్ఫోన్ మార్కెట్లోకి ఎంట్రీ ఇస్తున్న నోకియా పోటీపడేందుకు సిద్ధమైంది. మరి ఏ మేరకు పోటీనిస్తుందో మరి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Nokia's Challenge To Microsoft, Google and Apple read more at gizbot telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot