అమెరికా షాక్..యుద్ధానికి తొడగొట్టిన పేద దేశం

|

అదొక నిరుపేద దేశం.. పైగా అంతర్జాతీయంగా ఏకాకి... ఆ నిరుపేద దేశం అగ్రరాజ్యంపై తొడగొట్టింది. అగ్రరాజ్యాన్ని తొడగొట్టి సవాల్ చేసింది. అంతర్జాతీయంగా ఏకాకి అయిన ఆ దేశం ప్రపంచాన్ని గుప్పెట్లో పెట్టుకోవాలని చూస్తున్న పెద్దన్నపై ఇప్పుడు దండయాత్రకు సిద్ధమైంది. అమెరికా కాచుకో.. నీవు తలపెట్టే ఏ యుద్దానికైనా మేము రెడీ అంటూ కయ్యానికి కాలు దువ్వింది...ఇక తమ దేశ సైన్యానికి సైతం అమెరికాపై యుద్ధానికి సిద్ధంగా ఉండాలని ఆదేశాలు జారీ చేసింది..ఆ దేశమే... ఎక్కడో పశ్చిమాసియాలో మూలన ఉన్న ఉత్తరకొరియా...ఇప్పుడు అమెరికాతో యుద్ధానికి సై అంటోంది.చేతిలో ఎటువంటి ఆయుధాలు లేకపోయినా అధునాతయ ఆయుధాలు కలిగిన పెద్దన్నను ఎందుకు సవాల్ చేస్తోంది. ఏ ధైర్యం ముందుకు నడిపిస్తోంది. అసలు నార్త్ కొరియా స్వేచ్ఛా వాయువులు ఎప్పుడు పీల్చుకుంది.. దాని బలం ఏమిటీ..ఇక చదవండి.

 

డేగ, డ్రాగన్‌ల మధ్య యుద్ధం..పెంకులు పగిలాయి

డెమాక్రటిక్ పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ కొరియా

రెండవ ప్రపంచ యుద్ధంలో జపాన్ ఓడిన తరువాత అప్పటిదాకా ఆ దేశం అధీనంలో ఉన్న కొరియా ద్వీపకల్పం అంతర్జాతీయ రాజకీయాలకు వేదిక అయింది. సోవియెట్ రష్యా మద్దతుతో కొరియా ఉత్తర భాగం పైన్గాంగ్ రాజధానిగా డెమాక్రటిక్ పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ కొరియా (దీపీఆర్‌కే)గా అవతరించింది. ఇదే ఉత్తర కొరియా.

అమెరికా అండగా రిపబ్లిక్ ఆఫ్ కొరియా

మిగిలినది సియోల్ కేంద్రంగా దక్షిణ కొరియా పేరుతో, అమెరికా అండగా రిపబ్లిక్ ఆఫ్ కొరియా (ఆర్‌ఓకే) ఏర్పడింది. ఆగర్భ శత్రువులైనట్టు దాయాదుల మధ్య భీకర యుద్ధం (1950-53)కూడా జరిగింది. కానీ తూర్పు ఐరోపా, సోవియెట్ రష్యా పరిణామాలు ఉభయ కొరియాలను ఏకీకరణ దిశగా ఆలోచించేటట్టు చేశాయి.

ఉత్తర కొరియాది ఇప్పుడు అదే దశ!
 

ఉత్తర కొరియాది ఇప్పుడు అదే దశ!

ఒక దేశ ప్రస్థానం గతి తప్పుతున్నప్పుడు మిగిలిన రాజ్యాలు చేరదీసి చేయూతనందించడానికి బదులు- మరింత మూలకు నెట్టే ప్రయత్నం చేస్తే అది విచక్షణ కోల్పోయే ప్రమాదం ఉంది. ఉత్తర కొరియాది ఇప్పుడు అదే దశ! అమెరికా దక్షిణ కొరియాతో సాగిస్తున్న మైత్రి ఇప్పుడు ఉత్తర కొరియాను అగ్గిమీద గుగ్గిలం అయ్యేలా చేస్తోంది.

అమెరికా తలపెట్టే ఎలాంటి యుద్ధానికైనా సిద్ధమంటూ ..

అందుకే అమెరికా తలపెట్టే ఎలాంటి యుద్ధానికైనా సిద్ధమంటూ అంతర్జాతీయంగా ఏకాకి అయిన ఉత్తర కొరియా ప్రకటించింది. ఉత్తర కొరియా అధికార వర్కర్స్ పార్టీ 70వ వార్షికోత్సవం సందర్భంగా రాజధాని ప్యాంగ్యాంగ్లో భారీస్థాయిలో సైనిక కవాత్తును నిర్వహించింది. ఈ సందర్భంగా దేశ అధినేత కిమ్ జాంగ్ ఉన్ 'అమెరికా సామ్రాజ్యవాదులు ఎలాంటి యుద్ధాన్ని తలపెట్టినా దాని ఎదుర్కొనేందుకు పార్టీ రెవెల్యూషనరీ దళాలు సిద్ధంగా ఉన్నాయి అన్నారు.

1945లో తొందరపాటుతో జరిగిన కొరియా విభజన

దీని గురించి తెలుసుకోవాలంటే ముందు కొరియా విభజన గురించి తెలుసుకోవాలి. 1945లో తొందరపాటుతో జరిగిన కొరియా విభజన ఆధునిక ప్రపంచ చరిత్రకే పెద్ద పాఠం. వెయ్యేళ్లు కలసి జీవించి, ప్రపంచ రాజకీయాల నేపథ్యంలో విడిపోయిన దక్షిణ, ఉత్తర కొరియాలను ఐక్యం చేయడానికి 1990లో ప్రారంభమైన ప్రయత్నం ఇప్పటికి కూడా ఊపందుకోలేదు.

బద్ధ శత్రువులుగా..

దీంతో నిరుపేద దేశమైన ఉత్తర కొరియా, ధనిక ప్రజాస్వామిక దేశమైన దక్షిణ కొరియా బద్ధ శత్రువులుగా కొనసాగుతున్నాయి. వీటి మధ్య 1950-53లో జరిగిన యుద్ధం ముగిసినా సంధి ఒప్పందం కుదరలేదు. దీంతో భారీస్థాయిలో అణ్వాయుధాలు, రాకెట్లు పోగుచేసుకుంది ఉత్తర కొరియా.

అమెరికా-దక్షిణకొరియాలు సంయుక్తంగా సైనిక విన్యాసాలు

అప్పుడు అమెరికా-దక్షిణకొరియాలు సంయుక్తంగా సైనిక విన్యాసాలు నిర్వహించడంపై నార్త్‌ కొరియా తీవ్రస్థాయిలో ఆగ్రహంతో అట్టుడికి పోయింది. దానికి తోడు మళ్లీ స్పీకర్లు ఆన్‌ కావడంతో వివాదం మరింత ముదిరింది. సరిహద్దుల్లో కాల్పులు మొదలయ్యాయి. ఉత్తరకొరియా తమపై దాడి చేసిందంటూ దక్షిణకొరియా రాకెట్‌ లాంచర్లు ప్రయోగించింది.

సరిహద్దుల్లో యుద్ధానికి సన్నద్ధమై ఉండాలంటూ నార్త్‌కొరియా..

దీనికి పొరుగుదేశం కూడా ధీటుగా స్పందించింది.సరిహద్దుల్లో యుద్ధానికి సన్నద్ధమై ఉండాలంటూ నార్త్‌కొరియా సుప్రీమ్‌ కిమ్‌జోంగ్‌ ఉన్‌ తన సైన్యానికి ఆదేశాలు జారీ చేశారు కూడా. తమపై దుష్ప్రచారం వెంటనే ఆపకపోతే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని దక్షిణ కొరియాను హెచ్చరించారు.

అణ్వస్త్ర దేశంగా గుర్తించబోమని ఖరాఖండీగా .

యుద్ధానికి నార్త్ కొరియా అణ్వస్త్రాలను సైతం సమకూర్చుకోవడంతో ఈ దేశాన్ని అణ్వస్త్ర దేశంగా గుర్తించబోమని ఖరాఖండీగా చెప్పడంతో అందుకు ప్రతిగా ఉత్తర కొరియా తిరిగి తన యాంగ్‌బియాన్‌ అణు రియాక్టర్‌ను తెరిచింది. దాంతో అమెరికా ఉత్తర కొరియాను ఉగ్రవాద దేశాల జాబితా నుంచి తొలగించేందుకు సిద్ధమైంది. ఉత్తర కొరియా మిత్ర దేశాలయినా చైనా, రష్యాల తో సహా వివిధదేశాలు వారిస్తున్నా యుద్ధానికే మొగ్గు చూపింది.

అమెరికాతో ఇరాన్ తరహా అణు చర్చలపై ఆసక్తి లేదంటోంది ఉత్తర కొరియా

ఈ దశలో అమెరికాతో ఇరాన్ తరహా అణు చర్చలపై ఆసక్తి లేదంటోంది ఉత్తర కొరియా. తమ అణు ప్రయోజనాలను ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకునేది లేదని తెగేసి చెప్పింది ఆ దేశ విదేశాంగ శాఖ. ఎల్లప్పుడు తమ దేశంపై అమెరికా శత్రు వైఖరితో కవ్వింపు చర్యలకు పాల్పడుతోందని, అణు దాడి ముప్పు పొంచి ఉందని అందుకే సిద్ధంగా లేమని చెబుతోంది.

బారక్ ఒబామాను ఉత్తర అమెరికా ఆఫ్రికా కోతిగా..

ఆ టైంలోనే అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు బారక్ ఒబామాను ఉత్తర అమెరికా ఆఫ్రికా కోతిగా అభివర్ణించింది. ఇందుకు కారణం లేకపోలేదు. సోని పిక్చర్స్ నిర్మించిన ది ఇంటర్వ్యూ సినిమాలో ఉత్తర కొరియా రాజు కిమ్ జోంగ్ యున్‌ను చంపే పథకాన్ని హాస్యంగా చిత్రీకరించారు.

సహజంగానే ఇది ఆ దేశ పాలకులకు ఆగ్రహాన్ని..

సహజంగానే ఇది ఆ దేశ పాలకులకు ఆగ్రహాన్ని తెప్పించింది. ఒబామా మద్దతుతోనే ఈ సినిమాను విడుదల చేసినట్టు భావించిన ఉత్తర కొరియా అక్కడ ఈ సినిమా ప్రదర్శనను ఆపేసింది. అక్కడి పోలీసులు ఉత్తర కొరియా వ్యాప్తంగా సైబర్ దాడులు ముమ్మరం చేసి నెట్‌లో కూడా సినిమాను చూడకుండా అడ్డుకుంటున్నారు.

ఉత్తర కొరియా సొంత కాలమానాన్ని ఏర్పాటు చేసుకుంది

ఉత్తర కొరియా సొంత కాలమానాన్ని ఏర్పాటు చేసుకుంది. తమ గడియారాన్ని అరగంట వెనక్కు తిప్పుకుంది. తమ పొరుగు దేశాల కంటే 30 నిమిషాల వెనక్కి జరుపుకుంది. ఈ కొత్త కాలమానానికి వాళ్లు పెట్టిన పేరు ‘ప్యోంగ్ యాంగ్ జోన్'

ఇప్పుడు నార్త్ కొరియా చేతిలో అధునాతన ఆయుధాలు

ఇప్పుడు నార్త్ కొరియా చేతిలో అధునాతన ఆయుధాలు ఉన్నాయి. ముసుడాన్ క్షిపణిని ఉత్తర కొరియా ఇప్పటివరకు ఎప్పుడూ పరీక్షించలేదు కానీ, సుమారు 3 వేల కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించగల సామర్థ్యం దానికి ఉందని, అవసరమైతే తక్కువ పేలోడ్‌తో నాలుగు వేల కిలోమీటర్ల దాకా దాని టార్గెట్‌ను పెంచవచ్చని నిపుణులు అంటున్నారు. అంటే దక్షిణ కొరియా, జపాన్‌లోని ఏ లక్ష్యాన్నైనా అది చేరుకోగలదు.

అమెరికా సైనిక స్థావరాలను కూడా అది చేరగలదని..

అంతేకాదు పసిఫిక్ సముద్రంలోని గ్వామ్ దీవిలో ఉన్న అమెరికా సైనిక స్థావరాలను కూడా అది చేరగలదని అంటున్నారు. కాగా, మొబైల్ లాంచర్లను ఉత్తర కొరియా ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన అండర్‌గ్రౌండ్ స్థావరంలో దాచి ఉంచినట్లు కూడా ఆ అధికారి యోన్‌హాప్ ఓ వార్తాసంస్థకు తెలిపారు.

గతంలో జరిగిన అనేక ప్రయత్నాలు అర్ధాంతరంగా నిలిచిపోయాయి

కొరియా ద్వీపకల్పంలో అణ్వాయుధాల సమస్య అమెరికా, ఉత్తర కొరియాల ముఖాముఖి సంప్రతింపులతోనే ఒక కొలిక్కి వస్తుంది' అని ప్యాంగ్‌యాంగ్‌ నాయకత్వం మొదటినుంచీ చెబుతోంది. ఉత్తర కొరియాతో నేరుగా సంప్రతింపులకు వాషింగ్టన్‌ పెద్దలు ఏమాత్రం ఇష్టపడకపోవడంవల్లే- ఆరు దేశాల చర్చల ప్రక్రియ పేరిట గతంలో జరిగిన అనేక ప్రయత్నాలు అర్ధాంతరంగా నిలిచిపోయాయి.

అణ్వస్త్ర సముపార్జన దిశగా ..

ఇక దేశీయంగా దిగజారుతున్న పరిస్థితులను ఆసరాగా తీసుకుని అమెరికా నాయకత్వం ఎలాంటి దుందుడుకు చర్యలకు దిగుతుందోనన్న భయమే ప్యాంగ్‌యాంగ్‌ సర్కారును అణ్వస్త్ర సముపార్జన దిశగా ఉరకలెత్తిస్తోంది. ఇరాక్‌, ఇరాన్‌లతోపాటు ఉత్తర కొరియానూ 'దుష్టరాజ్య' జాబితాలో చేర్చి జార్జి బుష్‌ సర్కారు అవమానించింది మొదలు- వాషింగ్టన్‌, ప్యాంగ్‌యాంగ్‌ల సంబంధాలు సరిదిద్దుకోలేని స్థాయికి దిగజారడం ప్రారంభమైంది.

భవిష్యత్తు కావాలో, అణుబాంబులు కావాలో తేల్చుకోవాలని..

భవిష్యత్తు కావాలో, అణుబాంబులు కావాలో తేల్చుకోవాలని అమెరికా కచ్చితమైన హెచ్చరికలు జారీచేసిన నేపథ్యంలోనే- 'అణ్వస్త్రంతోనే భవిష్యత్తు' అన్న పంథాను ఉత్తర కొరియా అందిపుచ్చుకొంది. అంతర్జాతీయ సమాజంలో పెద్ద దేశంగా బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన అమెరికా స్వయంగా అనేక ఉల్లంఘనలకు పాల్పడటమే సమస్యలను రాజేస్తోంది.

అమెరికన్‌ నాయకులది కౌబాయ్‌ తరహా..

అమెరికన్‌ నాయకులవి కౌబాయ్‌ తరహా రాజకీయాలు. తాము తప్పు చేశామన్న విషయం బయటపడిపోతుందనుకుంటే- వారి చేతులు వెంటనే జేబుల్లోని తుపాకుల మీదకు పోతాయి-' అగ్రరాజ్యం ఏకపక్ష పోకడలను అధిక్షేపిస్తూ ఇరాన్‌ అధ్యక్షుడు అహ్మదీ నెజాద్‌ చేసిన వ్యాఖ్యలివి.

అయిదువేలకుపైగా అణ్వాయుధాలు

ప్రపంచంలోని ఏ దేశాన్నయినా స్వల్ప వ్యవధిలో చేరుకొని భస్మీపటలం చేయగల అయిదువేలకుపైగా అణ్వాయుధాలు అమెరికా వద్ద ఇప్పుడు సిద్ధంగా ఉన్నాయి. అవసరమైతే వాటిని ప్రయోగించడానికి తాము ఏమాత్రం వెనకాడబోమనీ వాషింగ్టన్‌ నేతలు వివిధ సందర్భాల్లో సెలవిచ్చారు. కాని అమెరికా మాత్రం ఇతర దేశాలను అణ్వాయుధాలను తయారుచేయవద్దని చెబుతోంది.

అహ్మదీ నెజాద్‌ వేసిన సూటి ప్రశ్నలకు జవాబు చెప్పుకోలేక ..

రెండున్నరేళ్లక్రితం న్యూయార్క్‌లో అణ్వస్త్ర నిరాయుధీకరణ సమీక్ష సమావేశంలో అహ్మదీ నెజాద్‌ వేసిన సూటి ప్రశ్నలకు జవాబు చెప్పుకోలేక అమెరికా సహా మరో 23 వందిమాగధ దేశాలు చరచరా బయటకు వెళ్ళిపోయాయి.అణ్వాయుధరహిత ప్రపంచం కోసమంటూ అమెరికా ప్రవచిస్తున్న నీతిసూత్రాల్లోని డొల్లతనాన్ని బయటపెట్టిన ఘటన అది.

1970లో అణు నిరాయుధీకరణ ఒప్పందం

1970లో అణు నిరాయుధీకరణ ఒప్పందం(ఎన్‌పీటీ) ఆడంబరంగా అమల్లోకి వచ్చింది. అణ్వస్త్ర విజ్ఞానాన్ని మరెవరికీ సరఫరా చేయరాదన్న అణ్వాయుధ దేశాల నిబద్ధత, అణ్వస్త్రాలను సముపార్జించబోమని అణ్వస్త్ర రహిత దేశాలు పూనిన ప్రతిన ప్రాతిపదికగా ఎన్‌పీటీ ప్రాణం పోసుకుంది. కానీ నాటినుంచీ ప్రతి దశలోనూ ఎన్‌పీటీ లక్ష్యాలను అణ్వస్త్ర దేశాలు నీరుగారుస్తూనే వచ్చాయి.

ఎన్‌పీటీ స్ఫూర్తిని ఏనాడో నీరుగార్చాయి

అణుపరిజ్ఞానాన్ని చైనా రహస్యంగా పాకిస్థాన్‌కు సరఫరా చేయడం, ఇజ్రాయెల్‌ రెండు వందలకు పైగా అణ్వాయుధాలను సమకూర్చుకోవడానికి అమెరికా మద్దతును ఇవ్వడం వంటివి ఎన్‌పీటీ స్ఫూర్తిని ఏనాడో నీరుగార్చాయి.

అణ్వాయుధ పరిరక్షణ వ్యయంకోసం అయిదు వందల కోట్ల డాలర్లను..

ఇజ్రాయెల్‌ గురించి మాట మాత్రమైనా ప్రస్తావించకుండా- ఇరాన్‌ వంటి దేశాలపై ఆంక్షల కొరడా ఝళిపించడాన్ని మిగిలిన ప్రపంచం జీర్ణించుకోలేకపోతోంది. అమెరికా చరిత్రలోనే మునుపెన్నడూ లేని రీతిలో 2010లో అణ్వాయుధ పరిరక్షణ వ్యయంకోసం అయిదు వందల కోట్ల డాలర్లను కేటాయించారు. అంతర్జాతీయ సమాజాన్ని నివ్వెరపరచిన ఘటన అది.

43ఏళ్లుగా అనుసరిస్తోంది రెండునాల్కల పంథానే

అమెరికాతోపాటు అణు సంపన్న దేశాలన్నీ 43ఏళ్లుగా అనుసరిస్తోంది రెండునాల్కల పంథానే. అణ్వస్త్ర భయంలేని ప్రపంచం ఆవిర్భవించాలంటే తొలుత జరగాల్సింది అమెరికా నేతృత్వంలో సాగుతున్న అణు వంచక రాజకీయాలకు తెరపడటం. అది జరగని పక్షంలో ఎన్‌పీటీ వంటివి పెద్దదేశాల రహస్య అజెండాల అమలుకు అక్కరకు వచ్చే ఆయుధాలుగా మాత్రమే మిగిలిపోతాయి.

గిజ్‌బాట్ పేజీని లైక్ చేయండి

https://www.facebook.com/GizBotTelugu

Most Read Articles
Best Mobiles in India

English summary
Here write North Korea ready to fight 'any war' with US, Kim Jong-un tells major military parade in Pyongyang
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Gizbot sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Gizbot website. However, you can change your cookie settings at any time. Learn more