మూడు రోజులకే నార్త్ కొరియా ఫేస్ బుక్కయింది

By Hazarath
|

నార్త్ కొరియా ఏం చేసినా అది ప్రపంచానికి చాలా కొత్తగా అనిపిస్తుంది. ఆ దేశాధ్యక్షుడు అంటే ప్రపంచ దేశాలకు ఓ శత్రువులాగా కనిపిస్తుంటాడు. దానికి కూడా ఆ దేశాధ్యక్షుడు ఏం తీసిపోనన్నట్లు రకరకాల ప్రయోగాలతో చేస్తూ వార్తల్లో నిలుస్తున్నాడు ఇప్పుడు కూడా సొంతంగా ఫేస్‌బుక్ తయారు చేసి మళ్లీ వారల్లోకెక్కాడు. అది అలా తయారుచేశారో లేదో దాన్ని అప్పుడే హ్యాక్ చేశారు. చిత్ర విచిత్రంగా మారిన నార్త్ కొరియా ఫేస్‌బుక్ కథ ఓ సారి చూడండి.

Read more: ఉత్తర కొరియాకు మరోసారి పరాభవం

మూడు రోజులకే నార్త్ కొరియా ఫేస్ బుక్కయింది

మూడు రోజులకే నార్త్ కొరియా ఫేస్ బుక్కయింది

ప్రపంచమంతా ఇప్పుడు మార్క్ జూకర్ బర్గ్ డెవలప్ చేసిన ప్రాజెక్ట్ వర్క్ అయిన ఫేస్‌బుక్‌ను యూజ్ చేస్తోంది. అయితే ఉత్తర కొరియా మాత్రం తమకు ప్రత్యేక ఫేస్‌బుక్ కావాలని తయారుచేసుకుంది.

మూడు రోజులకే నార్త్ కొరియా ఫేస్ బుక్కయింది

మూడు రోజులకే నార్త్ కొరియా ఫేస్ బుక్కయింది

మూడు రోజుల కిందట తమ దేశ ఫేస్‌బుక్ ను విజయవంతంగా ప్రారంభించారు.వీరు తయారు చేసిన ఫేస్‌బుక్ ప్రపంచంలో ఎవరైనా యాక్సెస్‌ చేసేలా తయారుచేశారు. 'పీహెచ్‌పీ డాల్ఫిన్' అనే సాఫ్ట్‌వేర్‌ టూల్ సాయంతో 'బెస్ట్ కొరియా' అనే ఈ సోషల్ నెట్‌వర్కింగ్ సైట్‌ను రూపొందించారు.

మూడు రోజులకే నార్త్ కొరియా ఫేస్ బుక్కయింది

మూడు రోజులకే నార్త్ కొరియా ఫేస్ బుక్కయింది

దాన్ని ఎవరైనా కొనుక్కుని, తమ సొంత ఫేస్‌బుక్ లాంటి నెట్‌వర్క్ ఏర్పాటు చేసుకోవచ్చు. కానీ, కొరియన్లు రూపొందించిన సొంత ఫేస్‌బుక్‌కు డీఫాల్ట్ పాస్‌వర్డ్ ఉండటంతో హ్యాకర్లకు పని చాలా సులభమైంది.

మూడు రోజులకే నార్త్ కొరియా ఫేస్ బుక్కయింది

మూడు రోజులకే నార్త్ కొరియా ఫేస్ బుక్కయింది

అయితే ఆ ఫేస్‌బుక్ అడ్మిన్ అకౌంట్ కొన్ని గంటలపాటు హ్యాక్ అయింది. స్కాట్లాండ్ కు చెందిన ఓ టీనేజర్ ఈ సంచలనం చేసి కొన్ని గంటలు చుక్కలు చూపించాడు. ఆండ్రూ మెక్ కీన్ అనే యువకుడు అడ్మిన్ పేజీ యూజర్ నేమ్, పాస్ వర్డ్ ను సక్సెస్ ఫుల్ గా కనిపెట్టాడు.

మూడు రోజులకే నార్త్ కొరియా ఫేస్ బుక్కయింది

మూడు రోజులకే నార్త్ కొరియా ఫేస్ బుక్కయింది

స్కాటిష్ విద్యార్థి దాన్ని హ్యాక్ చేసి, అందులోని ప్రకటనల స్లాట్లన్నింటిలో తన సొంత మెసేజ్ ఒకటి పెట్టేశాడు. ''నేను ఈ సైట్‌ను తయారుచేయలేదు, కేవలం లాగిన్ వివరాలు కనుక్కున్నాను' అనే సందేశం పెట్టి, దాన్ని తన సొంత ట్విట్టర్ అకౌంటుకు లింక్ చేశాడు.

మూడు రోజులకే నార్త్ కొరియా ఫేస్ బుక్కయింది

మూడు రోజులకే నార్త్ కొరియా ఫేస్ బుక్కయింది

దాంతో కొరియన్ల సొంత ఫేస్‌బుక్ కాస్తా బుక్కైపోయింది.ఈ సైట్‌ను ఉత్తర కొరియా సర్వర్‌లో రిజిస్టర్ చేసినా, దాన్ని సరిగ్గా ఎక్కడి నుంచి చేశారు, దాని వెనక ఎవరున్నారన్న విషయాలు మాత్రం తెలియలేదు. 

మూడు రోజులకే నార్త్ కొరియా ఫేస్ బుక్కయింది

మూడు రోజులకే నార్త్ కొరియా ఫేస్ బుక్కయింది

గతేడాది ఫేస్ బుక్, ట్విట్టర్, యూట్యూబ్ వెబ్ సైట్స్ ను ఉత్తర కొరియాలో నిషేధించిన విషయం తెలిసిందే.

మూడు రోజులకే నార్త్ కొరియా ఫేస్ బుక్కయింది

మూడు రోజులకే నార్త్ కొరియా ఫేస్ బుక్కయింది

అసలు ఉత్తర కొరియాకు సొంత ఫేస్‌బుక్ ఎందుకు సృష్టించాలనుకున్నారో కూడా తెలియరాలేదు. ఆ దేశంలో కేవలం కొన్నివేల మందికి మాత్రమే ఇంటర్‌నెట్ యాక్సెస్ ఉంది. అందులో కూడా ఫేస్‌బుక్ లాంటి పాశ్చాత్య సైట్లు చూసేందుకు వీల్లేదు. చాలా పరిమితులున్నాయి.

మూడు రోజులకే నార్త్ కొరియా ఫేస్ బుక్కయింది

మూడు రోజులకే నార్త్ కొరియా ఫేస్ బుక్కయింది

గత సంవత్సరం దాదాపు పీహెచ్‌పీ డాల్ఫిన్ లాంటి టూల్‌తోనే ఐఎస్ఐఎస్ మద్దతుదారులు తమ సొంత ఫేస్‌బుక్ వ్యవస్థను ఏర్పాటుచేసుకున్నారు. కానీ దాన్ని కూడా హ్యాకర్లు వదిలిపెట్టలేదు. దాంతో కొద్ది రోజులకే అది పడుకుంది.

Best Mobiles in India

English summary
Here Write North Korean Facebook set up and immediately hacked by Scottish teenager

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X