బుక్ చేసిన 4 గంటల్లోనే వస్తువు మీ ఇంటికి

Written By:

మీరు స్నాప్‌డీల్‌లో ఏదైనా కొనాలనుకుంటున్నారా..అయితే ఇంతకుముందు మీరు బుక్ చేసిన రెండు రోజులకో లేకుంటే మూడు రోజులకో మీకు కోరుకున్న వసువు వచ్చేది. అయితే ఇప్పుడు స్నాప్‌డీల్‌ సరికొత్త ప్రయోగానికి తెరలేపింది. మీరు కోరుకున్న వస్తువు నాలుగంటల్లోనే మీ ముందు ఉండేలా స్నాప్‌డీల్‌ సరికొత్త వ్యూహాలకు పదునుపెడుతోంది. అదెలాగో చూద్దాం.

Read more: పంచ్ పడింది : పీకేకి షాకిచ్చిన స్నాప్‌డీల్ !

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

1

స్నాప్‌డీల్‌లో ఏదైనా మొబైల్ ఫోన్ కొంటే, నాలుగు గంటల్లో మన చేతిలోకి వచ్చేస్తుంది. దీంతో మొబైల్ కొనుగోలులో స్నాప్ డీల్ కు ఫుల్ క్రేజ్ పెరిగింది. ఈ విధంగా అన్ని వస్తువులను నాలుగు గంటల్లోనే వినియోగదారుల ముందుంచాలని స్నాప్ డీల్ నిర్ణయించింది.

2

డెలివరీ టైమ్ ను గతేడాది కంటే 70శాతం పెంచుకున్నామని, ఫోన్లకే పరిమితమైన ఈ నాలుగు గంటల డెలివరీని మరిన్ని వస్తువులకు అందజేయనున్నట్టు కంపెనీ సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఆశిష్ చిత్రవంశీ తెలిపారు.

3

దాదాపు వినియోగదారులు కొనుకునే 99 శాతం ఉత్పత్తులను అదే రోజు అందిస్తున్నామని పేర్కొన్నారు. ఇప్పుడు ఆ ఉత్పత్తులను నాలుగు గంటలోనే అందించేలా ప్రణాళికలు చేస్తున్నామని చెప్పారు.

4

భారత ఈ-కామర్స్ వ్యాపారంలో అగ్రగామిగా ఉన్న గూర్గావ్ కు చెందిన ఈ సంస్థ, దాదాపు రూ.1,300 కోట్లు పెట్టుబడులతో 2 మిలియన్ల చదరపు అడుగుల గిడ్డంగి సామర్థ్యంతో 2015లో మార్కెట్లోకి ప్రవేశించింది.

5

2015లో 7 శాతం ఉత్పత్తులను మాత్రమే తన గిడ్డంగి నుంచి అందజేసిన ఈ సంస్థ, ప్రస్తుతం 70శాతం ఉత్పత్తులను వినియోగదారులకు చేరవేస్తోంది. 

6

క్రమేపి తమ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకుంటూ, ఉత్పత్తులను త్వరగా వినియోగదారులకు అందించేందుకు ప్రయత్నిస్తున్నామని చిత్రవంశీ చెప్పారు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here Write Not just phones Snapdeal may deliver more products in 4 hours
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot