BSNL మరో బంపరాఫర్, 8జిబి డేటా
అత్యంత తక్కువ ధరకు 1 జిబి డేటా, రూ.291 ప్లాన్ లో 8జీబీ 3జీ డేటా
రిలయన్స్ జియోకి పోటీగా ప్రభుత్వ రంగ దిగ్గజం బిఎస్ఎన్ఎల్ సరికొత్త ఆఫర్లను వినియోగదారుల ముందుకు తీసుకొస్తోంది. ఈ నేపథ్యంలోనే 3జీ ఇంటర్నెట్ రేట్లను భారీగా తగ్గించింది. దాదాపు 3 నుంచి నాలుగు వంతుల అధికంగానే డేటా సేవల్ని అందిస్తోంది. ఇప్పుడు అత్యంత తక్కువ ధరకు 1 జిబి డేటాను ప్రకటించింది.
రూ. 2,999కే మోటో ఎమ్ ( షరతులు వర్తిస్తాయ్ )

రూ.36 లకు 1జీబీ స్పెషల్ ప్యాక్
అతి తక్కువ ధరలో రూ.36 లకు 1జీబీ స్పెషల్ ప్యాక్ ను ప్రకటించింది. దీంతో పాటు ఫిబ్రవరి 6 నుంచి అమలయ్యేలా మూడు ప్రత్యేక పథకాలను ప్రవేశపెట్టింది.

రూ.291 ప్లాన్ లో
రూ.291 ప్లాన్ లో 8జీబీ 3జీ డేటా, 28 రోజుల వాలిడిటీ. గతంలో ఇది 2జీబీ మాత్రమే.

రూ. 78 ప్లాన్ లో
రూ. 78 ప్లాన్ లో భాగంగా 2జీబీ 3జీడేటా, 28 రోజుల వాలిడిటీ.

భారతదేశం అంతా
ఈ ఆఫర్లు భారతదేశం అంతా ఫిబ్రవరి 6, 2017 నుంచి చెల్లుబాటులో ఉంటాయని తెలిపారు.

జియో ఉచిత కాలింగ్
కాగా రిలయన్స్ జియో ఉచిత కాలింగ్, డాటా మార్చి 31, 2017 వరకు అమల్లో ఉన్నాయి. దీంతో ఇతర ప్రైవేట్ టెలికాం కంపెనీలు కూడా రూ తక్కువ రూ.50 ఒక జీబీ అందించే డేటా ప్యాక్ లను ప్రకటించిన సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications








