ఈ ఐఫోన్ ధర కేవలం రూ.1999 మాత్రమే !

Written By:

ప్రముఖ ఆన్‌లైన్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ ఎంపిక చేసిన ఐఫోన్ మోడల్స్‌పై భారీ ఎక్స్చేంజ్ ఆఫర్స్‌ని ప్రకటించింది. ఈ ఆఫర్ల కింద మీరు ఐఫోన్ 5 ఎస్ ను కేవలం రూ.1999కే కొనుగోలు చేయవచ్చు. 17,999 రూపాయలుగా ఉన్న ఐఫోన్ 5 ఎస్ (16 జీబీ వేరియంట్-సిల్వర్, స్పేస్ గ్రే)పై ఫ్లిప్‌కార్ట్ 16 వేల రూపాయల భారీ ఎక్స్చేంజ్ డిస్కౌంట్‌ను అందిస్తున్నట్టు పేర్కొంది. ఆ ఆఫర్ వల్ల రూ.1999కే ఐఫోన్ 5 ఎస్ ఫ్లిప్ కార్ట్‌లో లభ్యం కానుంది.

అదరగొడుతున్న ఆండ్రాయిడ్ O ఫీచర్లు

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఐఫోన్ 6 ఎస్

ఐఫోన్ 6 ఎస్ (32 జీబీ వేరియంట్ - రోజ్ గోల్డ్)పై ఫ్లిప్‌కార్ట్ 16 వేల రూపాయల ఎక్స్చేంజ్ ఆఫర్ ను ప్రకటించింది.ఈ ఫోన్ ప్రస్తుతం లిస్టెడ్ ధర రూ.40,999

ఐఫోన్ 7

గతేడాది లాంచ్ చేసిన ఐఫోన్ 7 (32 జీబీ వేరియంట్ - సిల్వర్, రోజ్ గోల్డ్, గోల్డ్)ను కూడా ఎక్సేంజ్ ఆఫర్ లో 37 వేల రూపాయలకే అందుబాటులో ఉండనుంది. ఐఫోన్ 7 అసలు ధర 57 వేల రూపాయలు.

ఐఫోన్ 7 ప్లస్

దాంతో పాటు ఐఫోన్ 7 ప్లస్ ను కూడా ఎక్సేంజ్ ఆఫర్‌లో అందించనుంది. బేస్ ధర రూ.68,4000 గా ఉన్న ఈ ఫోను ఎక్స్చేంజ్ ఆఫర్‌లో 48,4000 రూపాయలకు లభిస్తుంది.

128 జీబీ, 256 జీబీ వేరియంట్లపై

ఐఫోన్ 7, ఐఫోన్ 7 ప్లస్‌ల (128 జీబీ, 256 జీబీ వేరియంట్లపై) 20 వేల రూపాయల వరకు ఎక్స్చేంజ్ ఆఫర్ అందుబాటులో ఉంచుతున్నట్టు ఫ్లిప్‌కార్ట్ పేర్కొంది. అయితే ఏ ఫోన్ల ఎక్స్చేంజ్‌తో ఐఫోన్ల ధర తగ్గించనుందో ఫ్లిప్‌కార్ట్ వెల్లడించలేదు.

గూగుల్ స్మార్ట్ ఫోన్లపై

గూగుల్ స్మార్ట్ ఫోన్లపై కూడా ఫ్లిప్ కార్ట్ ఎక్స్చేంజ్ ఆఫర్లను అందించనున్నట్టు తెలిపింది. గూగుల్ పిక్సెల్, గూగుల్ పిక్సెల్ ఎక్స్ ఎల్ స్మార్ట్ ఫోన్లపై రూ.16వేల వరకు ధర తగ్గించనున్నట్టు పేర్కొంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

 

English summary
Now, Buy An iPhone For Rs 1999 Under Flipkart's Exchange Offer read more at gizbot telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot