అదరగొడుతున్న ఆండ్రాయిడ్ O ఫీచర్లు

Written By:

దిగ్గజ సాఫ్ట్‌వేర్ సంస్థ గూగుల్‌ తన తరువాతి తరం ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ ఆండ్రాయిడ్ ఓ డెవలపర్ ప్రివ్యూ విడుదల చేసింది. దీంతో పాటు ఆండ్రాయిడ్ ఓ కు చెందిన పలు ఇమేజ్‌లను కూడా విడుదల చేసింది. అయితే గతంలో పేర్లు పెట్టినట్టుగానే ఈ సారి ఓతో ఆపరేటింగ్ సిస్టమ్ రానుంది. అయితే దీని గురించిన వివరాలను గూగుల్ వెల్లడించలేదు.

మరో షాక్, జియో బై వన్ గెట్ వన్ ఫ్రీ ఆఫర్

అదరగొడుతున్న ఆండ్రాయిడ్ O ఫీచర్లు

కాగా ఈ కొత్త ఓఎస్‌ను మే నెలలో విడుదల చేసేందుకు అవకాశం ఉంది. నెక్సస్ 5ఎక్స్, నెక్సస్ 6పీ, నెక్సస్ ప్లేయర్, పిక్సల్, పిక్సల్ ఎక్స్‌ఎల్ డివైస్‌లకు ఆండ్రాయిడ్ ఓ డెవలపర్ ప్రివ్యూ వెర్షన్ ఇప్పటికే అందుబాటులో ఉంది. అయితే 'ఓ'సరికొత్త ఫీచర్లతో ముందుకు రానుంది.

రూ. 5 వేలకే 4జీ వోల్ట్ ఫోన్

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

బ్యాటరీ లైఫ్

ఆండ్రాయిడ్ ఓ ఆపరేటింగ్ సిస్టమ్‌లో గతంలో కన్నా బ్యాటరీ లైఫ్ మరింత ఎక్కువగా వచ్చేలా డిజైన్ చేశారు. బ్యాక్‌గ్రౌండ్‌లో రన్ అయ్యే యాప్స్ బ్యాటరీ వాడుకోవడాన్ని నియంత్రించే కొత్త సాఫ్ట్‌వేర్‌ను ఇందులో తీర్చిదిద్దారు.

కంట్రోల్

ఆండ్రాయిడ్ ఓ లో యూజర్లు నోటిఫికేషన్లను మరింతగా కంట్రోల్ చేసుకోవచ్చు. అలాగే అవసరం లేని నోటిఫికేషన్లను బ్లాక్ చేయవచ్చు. కావాలనుకుంటే వాటిని కొంత సేపు అయ్యాక మళ్లీ కన్పించేలా చేయవచ్చు.

డేటా స్టోర్

ఆండ్రాయిడ్ ఓ లో యూజర్లు ఫోన్‌లో సేవ్ చేసే డేటాను సురక్షితంగా స్టోర్ చేసుకునేందుకు కొత్త యాప్‌లను ఏర్పాటు చేశారు.

మల్టీ విండో మోడ్‌

రెండు, మూడు యాప్‌లను ఒకేసారి స్క్రీన్‌పై వాడుకునేందుకు వీలుగా ఉండే మల్టీ విండో మోడ్‌ను ఇందులో అందిస్తున్నారు.

కొత్త ఫాంట్లు

గతంలో కన్నా ఆండ్రాయిడ్ ఓ ఆపరేటింగ్ సిస్టమ్‌లో మరిన్ని కొత్త ఫాంట్లను యూజర్లకు అందిస్తున్నారు. వాటితో యూజర్లు తమ డివైస్‌లను తమ ఇష్టాలకు అనుగుణంగా సెట్ చేసుకోవచ్చు.

ఐకాన్లు

ఆండ్రాయిడ్ 7.0 నౌగట్‌తో పోలిస్తే ఆండ్రాయిడ్ ఓ ఆపరేటింగ్ సిస్టమ్‌లో పలు ఐకాన్లను చాలా ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు. వివిధ రకాల డిస్‌ప్లేలపై కూడా డివైస్ స్క్రీన్ మరింత ప్రకాశవంతంగా కనిపించేలా ఏర్పాటు చేశారు.

క్రాష్ కాకుండా కొత్త సాఫ్ట్‌వేర్‌

మీరు ఇంటర్నెట్ బ్రౌజర్లలో వెబ్‌సైట్లను చూస్తున్నప్పుడు అవి క్రాష్ కాకుండా ఉండేందుకు గాను కొత్త సాఫ్ట్‌వేర్‌ను ఏర్పాటు చేశారు.

2 రెట్లు వేగం

గతంలో వచ్చిన ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ ల కన్నా ఆండ్రాయిడ్ ఓ 2 రెట్లు వేగంగా పనిచేసేలా డిజైన్ చేశారు.

హైఫై బ్లూటూత్ ఆడియో

మీరు ఓ ద్వారా బ్లూ టూత్ సహాయంతో అత్యాధునిక క్వాలిటీతో ఆడియోను వీక్షించవచ్చు. ఆడియో రికార్డింగ్ స్పీకర్, హెడ్ ఫోన్ అత్యంత క్వాలిటితో వచ్చే విధంగా ఓను తీసుకొస్తున్నారు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here are the 9 best features in Android O read more at gizbot telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot