ఈ కామర్స్ దిగ్గజాలకు ఫేస్‌బుక్ దిమ్మతిరిగే షాక్

Written By:

సోషల్ మీడియాని ఏలుతున్న ఫేస్‌బుక్ ఇప్పుడు ఈ కామర్స్ దిగ్గజాలకు దిమ్మతిరిగే షాక్ ఇస్తోంది. ఇప్పటిదాకా సోషల్ మీడియా ఫ్లాట్ ఫాంమీద నడిచిన ఫేస్‌బుక్ పూర్తి స్తాయిలో ఈ కామర్స్ బిజినెస్ లోకి ఎంటరవుతోంది. మార్కెట్ ప్లేస్' అనే కొత్త ప్లాట్ ఫాం ద్వారా ఇ-కామర్స్ మార్కెట్లోకి కూడా దూసుకొచ్చింది. ఈ దెబ్బతో ఈ కామర్స్ దిగ్గజాలకు గడ్డు పరిస్థితులు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయని టెక్ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ యాప్ గురించి ఓ సారి తెలుసుకుందాం.

ఆఫర్లే ఆఫర్లు..

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

వస్తువుల అమ్మకాలు, కొనుగోళ్లకు అవకాశం

ఫేస్‌బుక్ యాప్‌లోని దీని ద్వారా వస్తువుల అమ్మకాలు, కొనుగోళ్లకు అవకాశం కల్పిస్తోంది. ఈ యాప్‌ని ప్రస్తుతం అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియ, న్యూజిలాండ్ దేశాల్లో ప్రారంభించింది. యూజర్ టు యూజర్స్ అమ్మకాలు, విక్రయాలకు సరికొత్త మార్కెటింగ్ సేవలను ప్రారంభించింది.

18 సం.రాలు నిండిన వారు

18 సం.రాలు నిండిన వారు ఎవరైనా 'మార్కెట్ ప్లేస్' ద్వారా క్రయ విక్రయాలు జరుపుకోవచ్చు. అయితే ప్రస్తుతానికి ఆపిల్ ఐ ఫోన్, ఆండ్రాయిడ్ వెర్షన్ ఫోన్లలో మాత్రమే ఈ సదుపాయం అందుబాటులో ఉంది.

ఈ సౌకర్యాన్నిఅన్నిదేశాలలో అందించడంతో పాటూ

ఈ సౌకర్యాన్నిఅన్నిదేశాలలో అందించడంతో పాటూ, రాబోయే నెలల్లో డెస్క్ టాప్ వెర్షన్‌ని కూడా అందుబాటులో తేనున్నామని సంస్థ ఉత్పత్తి మేనేజ్మెంట్ డైరెక్టర్ మేరీ కూ ఒక పోస్ట్ లో వెల్లడించారు.

ప్రతి నెల 450 మిలియన్లకు పైగా ప్రజలు

ఇప్పటికే ప్రారంభమైన ఈ యాప్ ని ప్రతి నెల 450 మిలియన్లకు పైగా ప్రజలు సందర్శిస్తున్నారన్నారు

లోకల్ కమ్యూనిటీ వ్యక్తుల మధ్య మార్కెటింగ్ కు

ప్రపంచవ్యాప్తంగా స్థానిక పరిసరాల కుటుంబాలనుంచి వస్తువులను సేకరించేవారి సంఖ్య పెరిగిందనీ తెలిపారు. లోకల్ కమ్యూనిటీ వ్యక్తుల మధ్య మార్కెటింగ్ కు ఇది అనుకూలమైన ప్రదేశమని మేరీ తన ఫేస్‌బుక్ పోస్ట్‌లో వెల్లడించారు.

షాప్' ఐకాన్ మీద క్లిక్ చేస్తే

ఫేస్‌బుక్ యాప్‌లో పైన కనిపించే 'షాప్' ఐకాన్ మీద క్లిక్ చేస్తే ఫోటోతో సహా, విక్రయానికి అందుబాటులో వున్న ఆయా వస్తువుల వివరాలు తెలుస్తాయని మేరీ చెప్పారు. గృహావసరాలు, ఎలక్ట్రానిక్స్, వస్త్రాలు తదితర వివిధ కేటగిరీల వస్తువులు అందుబాటులో ఉంచినట్టు పేర్కొన్నారు.

విక్రయదారుని ప్రొఫైల్ పిక్ తో పాటు

అంతేకాదు విక్రయదారుని ప్రొఫైల్ పిక్ తో పాటు, అతడు/ఆమెకు సంబంధించిన వివరాలు వుంటాయి. కావాలంటే నేరుగా మెసేజ్ ద్వారా వారిని సంప్రదించవచ్చని తన పోస్ట్ లో తెలిపారు.

అలాగే ఏదైనా వస్తువును విక్రయించాలనుకుంటే

అలాగే ఏదైనా వస్తువును విక్రయించాలనుకుంటే 'మార్కెట్ ప్లేస్' లో విక్రయ అంశాన్నిఫోటోతో సహా జోడించాలనీ, ఉత్పత్తి పేరు, వివరణ, ధరలను నమోదు చేయాలని తెలిపారు.

ఆయుధాలు, తుపాకీలు, జంతువులు

ఆయుధాలు, తుపాకీలు, జంతువులు, మద్యం లాంటి ఇతరాల అమ్మకాలు నిషేధించినట్టు తెలిపారు. డ్రగ్స్ , పేలుడు పదార్థాలు లాంటి చట్టవిరుద్ధ వస్తువులను తమ మార్కెట్ ప్లేస్‌లో తావులేదని అలాంటి వాటిని అనుమతించదని మేరీ కూ స్పష్టం చేశారు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

 

 

English summary
Facebook launches Marketplace to let you buy and sell items with nearby users read more gizbot telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot