చల్లటి బీర్‌తో సెల్ ఛార్జింగ్!
ఇక పై చల్లటి బీర్‌లేదా హాట్ కాఫీతో మీ మొబైల్ ఫోన్‌ను రీఛార్జ్ చేసుకోవచ్చు. ఇందకు దోహదపడే ప్రత్యేక డివైజ్‌ను యూఎస్‌కు చెందిన ఎపిఫనీ ల్యాబ్స్ వృద్ధి చేసింది. ‘ఆన్-ఈ పుక్'గా పిలవబడుతున్న ఈ కోస్టెర్ రెండు భాగాలను కలిగి ఉంటుంది. ఈ పుక్‌లోని ఎరుపు భాగం పై హాట్ డ్రింక్ మగ్‌ను, బులుగు భాగం పై చల్లటి డ్రింక్ మగ్‌ను ఉంచటం వల్ల శక్తి ఉత్పన్నమై యూఎస్బీ కేబుల్ ఆధారంగా స్మార్ట్‌ఫోన్‌కు అందుతుంది. ఇందుకుగాను స్టిర్లింగ్ ఇంజిన్ వ్యవస్థను ఆన్-ఈ పుక్ డివైజ్‌లో వినియోగించారు. ఈ తక్కువ బరువు పోర్టబుల్ డివైజ్‌ను ప్రయాణ సందర్భాల్లో సలువుగా క్యారీ చేయవచ్చు. విద్యుత్ సదుపాయంలో లేని ప్రాంతాల్లో ఈ కోస్టెర్‌ను ఉపయోగించుకుని యూఎస్బీ ఆధారిత స్మార్ట్‌ఫోన్‌లను ఛార్జ్ చేసుకోవచ్చు.
కరెంటు కోతలు షురూకాకముందే మేల్కొండి!
కరెంటు కోతలు కారణంగా మీ మొబైల్ బ్యాటరీ లెవల్ సున్నా స్థాయికి చేరుకుందా..?, ఆదమరుపునో.. అనుకోకుండానో మీ టాబ్లెట్ పీసీకి ఛార్జింగ్ పెట్టడం మర్చిపోయారా..?, డోండ్ వర్రీ!!!... ముఖ్యంగా ప్రయాణ సమాయాల్లో ఈ సమస్యలు తలెత్తకుండా ఉండాలంటే ముందుగా మీరు వీటి గురించి తెలుసుకోవల్సిందే.

టెట్రిస్, స్టోన్, స్టోన్ 3, టారట్, మ్యాజిక్ స్టిక్ వంటి ప్రత్యేక పరకరాలు ఛార్జింగ్‌ను ముందుగానే స్టోర్ చేసి పెట్టుకుంటాయి. అవసరమైనప్పుడు చార్జింగ్ తక్కువుగా ఉన్న మీ మొబైల్ లేదా టాబ్లెట్‌ను ప్రత్యేక కేబుల్ ద్వారా వీటికి కనెక్ట్ చేసుకుని ఛార్జ్ చేసుకోవచ్చు.
బెస్ట్ ఆండ్రాయిడ్ ఫోన్‌లు... రూ.6,000 నుంచి రూ.7,000 ధరల్లో


Click it and Unblock the Notifications








