ఐడియా నుంచి సరికొత్త ఆఫర్లు

Written By:

జియోతో పోటీని తట్టుకునే క్రమంలో ఐడియా రెండు సరికొత్త ఆఫర్లను ప్రవేశపెట్టింది. ఇప్పటికే ఎయిర్ టెల్ అన్ లిమిటెడ్ ఆఫర్లను ప్రవేశపెట్టిన నేపధ్యంలో ఐడియా కూడా ఇదే బాటలో నడుస్తోంది. రూ .148 , రూ. 348 రేంజ్ లో రెండు ఆఫర్లను వినియోగదారుల ముందుకు తీసుకువచ్చింది. ఆఫర్ బెనిఫిట్స్ ఏంటో ఓ సారి చూద్దాం.

జియోకి కౌంటర్, మేము ఫ్రీ కాల్స్ ఇస్తాం !

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

రూ .148 తో రీఛార్జ్

రూ .148 తో రీఛార్జ్ చేసుకుంటే ఐడియా నుంచి ఐడియాకు లోకల్, ఎస్టీడీ కాల్స్‌ను అపరిమితంగా చేసుకోవచ్చు. 50 ఎంబీ డేటాను కూడా పొందొచ్చు. 4 జీ మొబైల్ను కలిగి ఉంటే ఉచిత వాయిస్ సేవలకు తోడు 300 ఎంబీ డేటా లభిస్తుంది.

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

రూ. 348 రీఛార్జ్‌తో

రూ. 348 రీఛార్జ్‌తో ఏ నెట్వర్క్‌కైనా అపరిమిత కాల్స్ చేసుకునే సదుపాయంతో పాటు 50 ఎంబీ డేటాను పొందొచ్చు. 4 జీ మొబైల్ వినియోగదారులకు 1 జీబీ డేటా వస్తుందని ఐడియా సెల్యులార్ ఒక ప్రకటనలో తెలిపింది.

28 రోజుల వరకు

ఈ రెండు రీఛార్జ్ల ప్రయోజనాలు 28 రోజుల వరకు వర్తిస్తాయని పేర్కొంది. అలాగే టెలికాం సర్కిల్ ఆధారంగా ధరలో కూడా స్వల్ప మార్పుల ఉంటాయని పేర్కొంది.

ఎయిర్ టెల్ రూ. 149

ఇప్పటికే ఎయిర్ టెల్ రూ. 149కే అన్ లిమిటెడ్ ఎస్టీడీ ,లోకల్ కాల్స్ ను ప్రవేశపెడుతోంది. అయితే ఇది ఎయిర్‌టెల్ టూ ఎయిర్‌టెల్ మాత్రమే. దీంతో పాటు మరో ప్లాన్ కూడా తీసుకొస్తోంది.

రూ. 349తో

రూ. 349తో 1జిబి 4జీ/3జీ డేటాతో పాటు అపరిమిత వాయిస్ కాల్స్ ఏ నెట్ వర్క్ కైనా చేసుకోవచ్చని చెబుతోంది. 28 రోజుల పాటు ఈ ఆఫర్ వర్తిస్తుందని చెబుతోంది.

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Now Idea Cellular launches unlimited voice calling to take on Jio, Airtel Read more at gizbot telugu
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot