జియోకి ఝలక్, ఉచిత డేటా ఆఫర్‌తో మరో కంపెనీ రెడీ

అమెరికాలోని బోస్టన్‌ ఆధారిత మొబైల్ ప్రకటనల సంస్థ జన కంపెనీ ఉచిత డేటా ఆఫర్‌‌తో ముందుకొస్తోంది.

By Hazarath
|

నిన్నటిదాకా జియో ఉచితే డేటా, ఉచిత కాలింగ్ అంటూ టెలికాం రంగంలో సంచలనాలు రేపి టెల్కోలకు చుక్కలు చూపించగా ఇప్పుడు అదే బాటలో మరో విదేశీ కంపెనీ ఉచిత డేటా ఆఫర్‌తో దూసుకొస్తోంది. అయితే ఈ సారి రాబోతున్నది ఓ విదేశీ కంపెనీ. అమెరికాలోని బోస్టన్‌ ఆధారిత మొబైల్ ప్రకటనల సంస్థ జన కంపెనీ ఉచిత డేటా ఆఫర్‌‌తో ముందుకొస్తోంది. రోజుకు 10 ఎంబీ డేటాను ఉచితంగా అందించనుంది. అంతేకాకుండా తమ ప్లాట్‌ ఫాంపై ప్రకటనల ఆదాయం పెరిగే కొద్దీ ఉచిత డేటా ఆఫర్‌ను కూడా ఆమేరకు పెంచుతుందట.

 

బ్లాక్‌బెర్రీ నుంచి 4జిబి ర్యామ్‌తో సెకండ్ ఆండ్రాయిడ్ ఫోన్

జన కంపెనీ ఆండ్రాయిడ్‌ బ్రౌజర్‌ను

జన కంపెనీ ఆండ్రాయిడ్‌ బ్రౌజర్‌ను

జియో ఉచిత ఆఫర్‌లకు స్వస్తి చెప్పి బిల్లింగ్ మోడ్‌లోకి మారిపోయిన తరుణంలో, జన కంపెనీ ఆండ్రాయిడ్‌ బ్రౌజర్‌ను ప్రారంభించింది. ప్రపంచ వ్యాప్తంగా,అలాగే భారత్‌ సహా ఇతర అభివృద్ధి చెందుతున్న మార్కెట్లలో తన ఎంసెంట్‌(mCent ) బ్రౌజర్‌ను శుక్రవారం ప్రారంభించనున్నట్లు ప్రకటించింది.

వినియోగదారులకు రోజుకు ఉచిత 10ఎంబీ డేటా

వినియోగదారులకు రోజుకు ఉచిత 10ఎంబీ డేటా

ఈ ఆఫర్‌ ప్రారంభ దశలో, వినియోగదారులకు రోజుకు ఉచిత 10ఎంబీ డేటా (వారానికి 70ఎంబీ) అందించనున్నట్టు వెల్లడించింది. ఈ మేరకు భారతి ఎయిర్‌ టెల్‌, రిలియన్స్‌ జియో లాంటి ఇతర దేశీయ ఆపరేటర్లతో ఒప్పందం కుదుర్చుకుంది.

ఇంటర్నెట్ ఉచితంగా అందించడమే
 

ఇంటర్నెట్ ఉచితంగా అందించడమే

బిలియన్ ప్రజలకు ఇంటర్నెట్ ఉచితంగా అందించడమే తమ తదుపరి లక్ష్యమని జన చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మరియు సహ వ్యవస్థాపకుడు నాథన్ ఈగిల్ చెప్పారు. ఎంసెంట్‌ బ్రౌజర్‌ ను ఎంసెంట్‌ యాప్‌ స్టోర్‌ నుంచి డౌన్‌‌లోడ్‌ చేసుకోవచ్చని తెలిపారు.

ఉచితంగా ఇంటర్నెట్ బ్రౌజింగ్‌ సదుపాయం

ఉచితంగా ఇంటర్నెట్ బ్రౌజింగ్‌ సదుపాయం

మేము అందించే డేటా వినియోగదారుల ఉచితంగా ఇంటర్నెట్ బ్రౌజింగ్‌ సదుపాయం అందించడంతోపాటు, ప్రకటనకర్తలకు మంచి అవకాశాన్ని కల్పించనుందని జన మేనేజర్‌, సహ వ్యవస్థాపకుడు జోనాథన్ డిసౌజా చెప్పారు.

ఎంసెంట్‌ యాప్‌ స్టోర్‌ నుంచి

ఎంసెంట్‌ యాప్‌ స్టోర్‌ నుంచి

కాగా దాదాపు గూగుల్‌ ప్లే స్టోర్‌ను పోలిన ఎంసెంట్‌ బ్రౌజర్‌‌ను ఎంసెంట్‌ యాప్‌ స్టోర్‌ నుంచి డౌన్‌‌లోడ్‌ చేసుకోవచ్చు. భారతదేశం లో 2014 లో ప్రారంభించిన ఈ యాప్ ప్రతి డౌన్‌‌లోడ్‌ పై ఉచిత డేటాను ఆఫర్‌ చేసి 30 మిలియన్ల యూజర్లను ఆకర్షించింది.

Best Mobiles in India

English summary
Now, surf the web on your mobile, free of cost read more at gizbot telegu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X