జియో ప్లాన్లు మారాయి, యూజర్లకు ఇక తిప్పలే !

Written By:

కొత్త కొత్త ప్లాన్లతో వినియోగదారులను ఆకట్టుకుంటున్న జియో ఇప్పుడు తాజా ఆఫర్లతో కష్టమర్లకు కష్టాలను కొనితెచ్చిపెట్టేలా ఉంది. జూలై 15తో సమ్మర్ సర్ ప్రైజ్ ఆఫర్ ముగిసిపోతున్న నేపథ్యంలో ియో ఇప్పుడు కొత్త ఆఫర్లపై దృష్టి సారించాల్సిన అవసరం ఏర్పడింది. ఇందులో భాగంగానే జియో తన ప్లాన్లను మార్చివేసింది.

ఒక్కరోజే..ఈ ఫోన్‌పై రూ.3వేలు తగ్గింపు

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

రూ.309

ఇంతకు ముందు రూ.309తో రీఛార్జ్ చేసుకుంటే 3 నెలల పాటు యూజర్లకు డేటా లభించేది. ఇప్పుడు దీన్ని నెలకు కుదించింది. జులై1 నుంచి రూ.309 ప్లాన్ కింద సాధారణ వినియోగదారులకు 3 నెలలకు బదులుగా... 28 రోజులకు 28GB డేటా మాత్రమే అందనుంది.

రూ.509

అదే రూ.509తో రీఛార్జ్ చేసుకుంటే నెల రోజుల పాటు 2జిబి 4జీ డేటా అన్ లిమిటెడ్ వాయిస్ వాయిస్ కాలింగ్ వస్తుంది. జూలై 15 తర్వాత ఆటోమేటిగ్గా ఈ ప్లాన్ స్టార్టవుతుంది.

ధన్ ధనా ధన్ ప్లాన్

మరోవైపు ధన్ ధనా ధన్ ప్లాన్ కింద ఉన్న కస్టమర్లకు 84 రోజుల పాటు 84GB డేటా అందిస్తున్నట్లు జియో ప్రకటించింది. అయితే ఈ ఆఫర్ కూడా జూలై 15తో ముగిసే అవకాశం ఉంది.

కష్టమర్లు ఆసక్తి చూపుతారా

అయితే ఈ ప్లాను వేయించుకోవాలంటే కష్టమర్లు ఆసక్తి చూపుతారా లేరా అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. చాలామంది వెనక్కి తగ్గే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.

అన్ని టెల్కోలు

ఇక ఇంచుమించుగా అన్ని టెల్కోలు ఇదే రకమైన ఆఫర్లను అందిస్తున్నాయి. దీంతో ఇప్పుడు జియో కొత్త ఆఫర్లను ప్రకటిస్తుందా లేద అన్నదే చూడాలి.

రాబోయే రోజులు పెస్టివ్ సీజన్

ఇదిలా ఉంటే రాబోయే రోజులు పెస్టివ్ సీజన్ కావడంతో ఆ పేరుతో జియో తన కొత్త ఆఫర్లను ప్రకటించే అవకాశం కూడా లేకపోలేదు.

సెప్టెంబర్ 5న జియో ఫస్ట్ యానివర్సరీ

దీంతోపాటు సెప్టెంబర్ 5న జియో ఫస్ట్ యానివర్సరీ రానుండటంతో కొత్త ఆ పేరుతో యానవర్సరీ ఆఫర్లను అందిచే అవకాశం కూడా ఉంది. జియో నుంచి సమాచారం వచ్చేంతవరకు కష్టమర్లు ఆగాల్సిందే.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Now What Next After 15 July Jio Summer Surprise Offer Read more at gizbot telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot