ఒక్కరోజే..ఈ ఫోన్‌పై రూ.3వేలు తగ్గింపు

Written By:

ఈ-కామర్స్‌ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌, లెనోవో వైబ్‌ కే5 నోట్‌పై స్పెషల్‌ వన్‌ డే సేల్‌ను ప్రకటించింది. ఈ సేల్‌లో భాగంగా వైబ్‌ కే5 నోట్‌ ఫోన్‌పై ఫ్లాట్‌ 3వేల రూపాయల డిస్కౌంట్‌ను ఇవ్వనున్నట్టు పేర్కొంది. దీంతో ఫ్లిప్‌కార్ట్‌లో లెనోవో వైబ్‌ కే5 నోట్‌ 4జీబీ ర్యామ్‌, 32జీబీ స్టోరేజ్‌ మోడల్‌ ఫోన్‌ 9,499 రూపాయలకే మంగళవారం అందుబాటులోకి రానుంది.

అత్యంత షార్ప్ ఫోన్.. ధర రూ. 40,500

ఒక్కరోజే..ఈ ఫోన్‌పై రూ.3వేలు తగ్గింపు

లెనోవో కే-సిరీస్‌ స్మార్ట్‌ఫోన్లు మార్కెట్లోకి వచ్చి రెండో వార్షికోత్సవం పురస్కరించుకున్న సందర్భంగా ఈ స్పెషల్‌ వన్‌ డే సేల్‌ను ఈకామర్స్‌ దిగ్గజం నిర్వహిస్తోంది. నేటి అర్థరాత్రి 12 గంటల నుంచి ఈ సేల్‌ ప్రారంభమై, మంగళవారం అర్థరాత్రి వరకు కొనసాగనుంది.

షియోమి కొత్త ఫోన్, దుమ్మురేపుతున్న ఫీచర్లు ఇవే !

లెనోవోతో తమ భాగస్వామ్యం ఎంతో విజయవంతమైనదని, 2015లో తొలిసారి వైబ్‌ కే3 నోట్‌ను తమ ప్లాట్‌ ఫామ్‌పై లాంచ్‌​ చేసినట్టు ఫ్లిప్‌కార్ట్‌ సీనియర్‌ డైరెక్టర్‌ స్మార్ట్‌ఫోన్స్‌, అయ్యప్పన్‌ రాజగోపాల్‌ చెప్పారు.ఫీచర్లు ఈ కింది విధంగా ఉన్నాయి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

డిస్‌ప్లే

వైబ్ కే5 ఫోన్ 5.5 అంగుళాల ఫుల్ హైడెఫినిషన్ 1080 పిక్సల్ డిస్‌ప్లే విత్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్,(రిజల్యూషన్ సామర్థ్యం 1280 x 720పిక్సల్స్), 180 డిగ్రీ వైడ్ యూగింగ్ వ్యూవింగ్ సామర్థ్యాలను ఈ ఫోన్ డిస్‌ప్లే కలిగి ఉంది.

క్విక్ ఛార్జ్ 2.0 టెక్నాలజీ

వైబ్ కే5 ఫోన్‌లో 1.4గిగాహెర్ట్జ్ సామర్థ్యం గల ఆక్టా‌కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 415 ప్రాసెసర్‌ను నిక్షిప్తం చేసారు. అడ్రినో 450 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్ ఆకట్టుకుంటుంది. క్విక్ ఛార్జ్ 2.0 టెక్నాలజీతో వస్తోన్న ఈ ఫోన్ బ్యాటరీ వేగవంతంగా ఛార్జ్ అవుతుంది.

ర్యామ్

3/4జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం

కెమెరా

కెమెరా వైబ్ కే5 నోట్ ఫోన్ 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరాతో వస్తోంది (ప్రత్యేకతలు : ఎల్ఈడి ఫ్లాష్, 1080పిక్సల్ వీడియో రికార్డింగ్). 8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా.

కనెక్టువిటీ ఫీచర్లు

ఆండ్రాయిడ్ 6.0 మార్ష్ మల్లో ఆపరేటింగ్ సిస్టం.(డ్యుయల్ సిమ్ సపోర్ట్, 4జీ ఎల్టీఈ, వై-ఫై, బ్లుటూత్ 4.1, జీపీఎస్), 3500 ఎమ్ఏహెచ్ బ్యాటరీ విత్ క్విక్ ఛార్జ్ టెక్నాలజీ, డ్యుయల్ ఓఎస్ యూజర్ ఇంటర్‌ఫేస్.

డాల్బీ ఆడియో టెక్నాలజీ

లెనోవో వైబ్ కే5 నోట్ ఫోన్, డాల్బీ ఆడియో టెక్నాలజీతో వస్తంది. ఫోన్ సౌండ్ క్వాలిటీ అద్భుతంగా ఉంటుంది. ఫోన్ కనెక్టువిటీ ఫీచర్లు (4జీ ఎల్టీఈ, వై-ఫై, బ్లుటూత్, జీపీఎస్, 3.5 ఎమ్ఏమ్ రేడియో, ఎఫ్ఎమ్ రేడియో).

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Lenovo Vibe K5 Note Price Cut Announced for Limited Period on Flipkart read more at gizbot telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot