IRCTCతో పనిలేదు, రైల్వే టికెట్ బుకింగ్ చాలా ఈజీ !
ఈ వ్యాలెట్ రంగంలోకి రైల్వే టికెట్లు, ఈ కామర్స్ తో ప్రయాణికుల కష్టాలు తీర్చేందుకు ప్రయత్నం
డిజిటల్ మార్కెట్ పుంజుకుంటున్న నేపథ్యంలో అన్ని పనులు ఆన్ లైన్ ద్వారానే జరిగిపోతున్నాయి. టికెట్ కొనాలన్నా, అలాగే మొబైల్ రీ ఛార్జ్ చేయాలన్నా అంతా ఈ వ్యాలెట్ మీదకే వెళుతున్నారు. అదీగాక రూ. 500, రూ. 1000 నోట్లు బ్యాన్ అయిన నేపధ్యంలో ఇది మరింతగా పెరిగింది. త్వరలో ఈ జాబితాలోకి రైల్వే టికెట్లు కూడా చేరునున్నాయి.
వాటర్ ఫ్రూప్‌తో రూ. 2000 నోట్లు, దుమ్మురేపుతున్న వీడియో

ఈ వ్యాలెట్ రంగంలోకి రైల్వే టికెట్లు
ఇప్పుడు ఈ వ్యాలెట్ రంగంలోకి రైల్వే టికెట్లు కూడా చేరనున్నాయి. అప్పటికప్పుడు టికెట్లు కొనే 'అన్‌రిజర్వ్‌డ్' విభాగంలో రద్దీ తగ్గించే లక్ష్యంతో భారత రైల్వేశాఖ ఈ-వ్యాలెట్లతో టికెట్ కొనే సదుపాయం కల్పించే యోచనలో ఉంది.

కాగితం వాడకం
ఈ విధానంతో ప్రయాణికులు, రైల్వేశాఖకు వ్యయప్రయాసలు తగ్గడమే కాకుండా కాగితం వాడకం పెద్దఎత్తున తగ్గుతుందని అధికారులు భావిస్తున్నారు.
లేటెస్ట్ ల్యాప్‌టాప్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

రోజుకు 2.3 కోట్ల ప్రయాణికులను
భారతీయ రైల్వేలు రోజుకు 2.3 కోట్ల ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరవేస్తుండగా అందులో ఆరుశాతం మంది మాత్రమే ముందస్తుగా టికెట్లు కొనుగోలు చేసి 'రిజర్వ్డ్' విభాగంలో ప్రయాణిస్తున్నవారే.

స్వస్థి పలికే యోజనలో
ఈ విధానానికి స్వస్థి పలికే యోజనలో ఇప్పుడు రైల్వేఉంది. ఈ కామర్స్ తో ప్రయాణికుల కష్టాలు తీర్చేందుకు ప్రయత్నం చేస్తున్నామని రైల్వే మంత్రిత్వశాఖకు చెందిన ఓ సీనియర్ అధికారి తెలిపారు

ప్రతి టికెట్టుపై కొంతమొత్తం కమీషన్
అయితే ఈ కొత్త పద్ధతితో రైల్వేశాఖపై ఎలాంటి భారం పడదు. పైగా వ్యాలెట్ నిర్వాహకుల నుంచి ప్రతి టికెట్టుపై కొంతమొత్తం కమీషన్ అందుతుంది.

ప్రముఖ వ్యాలెట్ సంస్థలన్నీ
ఈ విధానంలో భాగస్వాములు కావడానికి ప్రముఖ వ్యాలెట్ సంస్థలన్నీ ఆసక్తి చూపిస్తున్నాయనీ, చర్చల అనంతరం విధివిధానాలు రూపొందిస్తామనీ వచ్చే ఏడాది ఈ విధానం అమల్లోకి రావొచ్చని ఆ అధికారి పేర్కొన్నారు.
లేటెస్ట్ ట్యాబ్లెట్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి


Click it and Unblock the Notifications








