Home
News

13 ఏళ్లకే గూగుల్ అవార్డు.. రూ. 6 లక్షలు

By Hazarath

ఐడియా రావాలి గాని జీవితాలను మార్చి వేసే ఆవిష్కరణలను చేయవచ్చని ఒడిశాలోని కోరాపుట్ కు చెందిన 13 ఏళ్ల విద్యార్థిని లలిత శ్రీ పాద సాయి నిరూపించారు. పర్యావరణ పరిరక్షణ పద్ధతిలో వాటర్ ప్యూరిపైయర్ సాంకేతిక పరిజ్ఙానాన్ని సృష్టించినందుకు గానూ ఈ బాలిక కాలిఫోర్నియాలోని గూగుల్ సైన్స్ పేర్ లో ఆరు లక్షల రూపాయల నగదు అవార్డును అందుకున్నారు. ఆ బాలిక కనుగొన్న సాంకేతిక పరిజ్ఙానాన్ని ఓ ప్రాజెక్టు కింద అభివృద్ధి చేసేందుకు అవసరమైన ఆర్థిక సహాయాన్ని కూడా అందిస్తామని గూగుల్ యాజమాన్యం ప్రకటించింది. 13 ఏళ్ల ప్రాయంలో బాలిక సాధించిన ఈ విజయం యువతకు ఎంతో ఆదర్శం..ఆ బాలిక చేసిన ఆవిష్కరణపై ఓ స్మార్ట్ లుక్కేద్దాం.

Read more:గూగుల్ కూడా డిగ్రీ కోర్సు పెట్టేసింది

13 ఏళ్లకే గూగుల్ అవార్డు.. రూ. 6 లక్షలు

13 ఏళ్లకే గూగుల్ అవార్డు.. రూ. 6 లక్షలు

శ్రీ సాయికి ఓ రోజున హఠాత్తుగా ఓ ఐడియా తట్టింది. వెంటనే తన ఇంటికి సమీపంలోని పొలాలకు వెళ్లింది. అక్కడ పడేసిన గింజలు వలిచేసిన మొక్కజొన్న కంకులనే సేకరించింది. వాటిని తీసుకొచ్చి దాదాపు నెలరోజుల పాటు ఎండబెట్టంది.

13 ఏళ్లకే గూగుల్ అవార్డు.. రూ. 6 లక్షలు

13 ఏళ్లకే గూగుల్ అవార్డు.. రూ. 6 లక్షలు

ఓ పొడవాటి మొక్కజొన్న కంకి మధ్య గుండా నీళ్లు పోవడానికి వీలుగా ఓ రంధ్రం చేసింది. దాన్ని జగ్గులాంటి ల్యాబ్ బాటిల్ లో అమర్చింది.ఆ బాటిల్ కింద మరో నాలుగు బాటిళ్లను ఏర్పాటు చేసి వాటిలో చిన్నగా కత్తిరించిన మొక్కజొన్న కంకి ముక్కలను వేసింది.

13 ఏళ్లకే గూగుల్ అవార్డు.. రూ. 6 లక్షలు

13 ఏళ్లకే గూగుల్ అవార్డు.. రూ. 6 లక్షలు

ఇంటిముందున్న మురికి కాల్వ నుంచి మురికి నీటిని తీసుకొచ్చి పై నున్న జగ్గులాంటి బాటిళ్లలో పోసింది.అది కంకి రంధ్రం గుండా ప్రవహించి మిగతా నాలుగు బాటిళ్ల ద్వారా ఫిల్టర్ అవుతూ కిందనున్న గిన్నెలోకి నీళ్లు చేరాయి.ఆశ్చర్యం పైన పోసిన మురికి నీరు కాస్త 80 శాతం ఫిల్టర్ అడుగునున్న గిన్నెలో పడ్డాయి.

స్వచ్ఛమైన నీరు అడుగుకు

స్వచ్ఛమైన నీరు అడుగుకు

మురికి నీటిలో ఉండే లవణాలు,ఆమ్లాలు,డిటర్జెంట్స్, రంగులు,చమురు ,మొక్కజొన్న కంకులు పీల్చుకోగా స్వచ్ఛమైన నీరు అడుగుకు చేరుకుంది.

పైసా ఖర్చు లేకుండా ..

పైసా ఖర్చు లేకుండా ..

ఎలాంటి విద్యుత్ అంటే కరెంట్ బ్యాటరీలు అవసరం లేకుండా పైసా ఖర్చు లేకుండా నీటిని ఇలా ప్యూరిపై చేసుకోవచ్చని శ్రీసాయి నిరూపించింది.

13 నుంచి 18 ఏళ్ల క్యాటగిరీలో శ్రీసాయికి అవార్డు

13 నుంచి 18 ఏళ్ల క్యాటగిరీలో శ్రీసాయికి అవార్డు

పైగా వృధాగా పడేసే కంకులను ఇలా ఉపయోగించడం పర్యావరణానికి అనుకూలం కూడా.13 నుంచి 18 ఏళ్ల క్యాటగిరీలో శ్రీసాయికి అవార్డు లభించింది.

13 ఏళ్లకే గూగుల్ అవార్డు.. రూ. 6 లక్షలు

13 ఏళ్లకే గూగుల్ అవార్డు.. రూ. 6 లక్షలు

ప్రపంచ వ్యాప్తంగా వచ్చిన ఎంట్రీలలో నూతన ఆవిష్కరణలకు గానూ మరికొంత మందికి కూడా శ్రీ సాయితో పాటు అవార్డులు అందజేశారు.

అవార్డు అందుకున్న ఆనందంలో శ్రీ సాయి.

అవార్డు అందుకున్న ఆనందంలో శ్రీ సాయి.

అవార్డు అందుకున్న ఆనందంలో శ్రీ సాయి. 

గిజ్‌బాట్ పేజీని లైక్ చేయండి

గిజ్‌బాట్ పేజీని లైక్ చేయండి

మీరు ఎప్పటికప్పుడు టెక్నాలజీకి సంబంధించి లేటెస్ట్ అప్ డేట్ పొందాలనుకుంటే ఇక్కడ క్లిక్ చేయండి

https://www.facebook.com/GizBotTelugu

Best Mobiles in India

English summary
Here Write Odisha School Girl Wins Award At Google Science Fair For Developing Water Purifying Agent
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X