ఆండ్రాయిడ్ 10 అప్‌డేట్ లతో వన్‌ప్లస్ 7 & 7ప్రో

|

వన్‌ప్లస్ సంస్థకు చెందిన స్మార్ట్‌ఫోన్‌లలో వన్‌ప్లస్ 7 మరియు వన్‌ప్లస్ 7 ప్రోల కోసం ఆండ్రాయిడ్ 10 అప్‌డేట్ రోల్‌అవుట్‌ను ప్రారంభించింది. ఈ సంస్థ గత నెలలో రెండు స్మార్ట్‌ఫోన్‌ల కోసం ఆండ్రాయిడ్ 10 ఆధారిత ఆక్సిజన్ OS 10.0 రోల్‌అవుట్‌ను ప్రారంభించింది. అయితే కొన్ని బగ్స్ కారణంగా దీనిని పాజ్ చేయబడింది. ఇప్పుడు శుభవార్త ఏమిటంటే OTA రోల్అవుట్ పునః ప్రారంభించబడింది. కంపెనీ ఈ సమయంలో సరికొత్త ఆక్సిజన్ OS 10.0.1 అప్‌డేట్ ను కూడా అందిస్తోంది.

ఆండ్రాయిడ్ 10
 

వన్‌ప్లస్ 7 మరియు 7 ప్రో స్మార్ట్‌ఫోన్‌ల కోసం ఆండ్రాయిడ్ 10 OTA అప్‌డేట్‌లో స్టేజ్ రోల్ అవుట్ ఉంటుంది. కాకపోతే పరిమిత సంఖ్యలో మాత్రమే వినియోగదారులు దీన్ని ప్రారంభంలో స్వీకరిస్తారు తరువాత విస్తృతమైన రోల్ అవుట్ ఆండ్రాయిడ్ 10అప్‌డేట్ లో బగ్స్ ఏవి లేవని నిర్ధారించుకున్న కొద్ది రోజుల తరువాత జరుగుతుంది అని వన్‌ప్లస్ తెలిపింది..

డిష్ టివి దీపావళి ఆఫర్: RS.219లకే 250 ఛానెల్‌లు

ఆక్సిజన్ OS వెర్షన్ 10.0

ఆక్సిజన్ OS వెర్షన్ 10.0 యొక్క రోల్ అవుట్ కొన్ని బగ్స్ కారణంగా పాజ్ చేయబడింది. ఇప్పుడు ఆ బగ్ పరిష్కారాలతో ఆండ్రాయిడ్ వెర్షన్ 10.0.1 ని విడుదల చేయటం ప్రారంభించాము అని వన్‌ప్లస్ కమ్యూనిటీ ఫోరం పేర్కొంది. స్టాండర్డ్ వేరియంట్ మరియు మెక్‌లారెన్ ఎడిషన్‌ను కలిగి ఉన్న సరికొత్త వన్‌ప్లస్ 7T ప్రో ఫోన్‌ల కోసం కంపెనీ ఇలాంటి ఆక్సిజన్ OS 10.0.1 అప్‌డేట్‌ను విడుదల చేసింది.

పిక్సెల్ 3a స్మార్ట్‌ఫోన్‌లో డ్యూయల్ సిమ్ డ్యూయల్ స్టాండ్‌బై సపోర్ట్‌ను ఎలా పొందాలి?

వన్‌ప్లస్ 7

వన్‌ప్లస్ 7 మరియు వన్‌ప్లస్ 7 ప్రో కోసం సరికొత్త ఆక్సిజన్ OS 10.0.1 అప్‌డేట్ చేంజ్లాగ్ గూగుల్ యొక్క కొత్త ఫుల్ స్క్రీన్ సంజ్ఞలు, కొత్త UI డిజైన్, సెట్టింగులలో అప్డేట్ మెను, కొత్త గేమ్ స్పేస్ ఫీచర్, మెరుగైన కెమెరా ఫీచర్స్ వంటి మరిన్నింటిని తెస్తుంది.

ఆక్సిజన్ OS10
 

వన్‌ప్లస్ 5 స్మార్ట్‌ఫోన్‌లను అన్నిటిని ఆండ్రాయిడ్ 10 ఆధారిత ఆక్సిజన్ OS10 కు అప్‌డేట్ చేస్తామని వన్‌ప్లస్ ఇటీవల ప్రకటించింది. చైనా స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ వన్‌ప్లస్ 7T ప్రో, వన్‌ప్లస్ 7T ప్రో మెక్‌లారెన్ ఎడిషన్‌ను గత వారం లండన్‌లో జరిగిన కార్యక్రమంలో విడుదల చేసింది. ఈ ప్రయోగ కార్యక్రమంలో కంపెనీ ఆక్సిజన్‌ఓఎస్ యొక్క పరిణామంపై దృష్టి పెట్టింది. టెక్ కమ్యూనిటీలో ఇది ఎక్కువగా ఇష్టపడే OEM UI గా మారింది. వన్‌ప్లస్ సహ వ్యవస్థాపకుడు కార్ల్ పీ సంస్థ తన వినియోగదారులకు ఆండ్రాయిడ్ అప్‌డేట్ లను ఎంత త్వరగా అందిస్తుందో కూడా తెలిపింది.

Most Read Articles
Best Mobiles in India

English summary
OnePlus 7 and OnePlus 7 Pro gets Android 10 Update

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X