OnePlus Nord కెమెరా ఫీచర్స్!!105-డిగ్రీల ఫీల్డ్ వ్యూ వైడ్ యాంగిల్ సెల్ఫీ కెమెరా

|

ఇండియాలో వన్‌ప్లస్ సంస్థ తన స్మార్ట్‌ఫోన్‌లను అన్ని రకాల బడ్జెక్ట్ ధరల వేరియంట్ లలో విడుదల చేసి బాగా పాపులర్ అయింది. ఇప్పుడు ఈ సంస్థ యొక్క తదుపరి స్మార్ట్‌ఫోన్ వన్‌ప్లస్ నార్డ్ జూలై 21 న భారతదేశంలో విడుదల కానుంది. లాంచ్‌కు ముందు స్మార్ట్‌ఫోన్‌లోని కొన్ని ముఖ్యమైన ఫీచర్ల వివరాలను టీజ్ చేయడం ప్రారంభించింది.

 

వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్‌ ఫీచర్స్

వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్‌ ఫీచర్స్

వన్‌ప్లస్ కొత్త స్మార్ట్‌ఫోన్‌ నార్డ్‌ యొక్క డిజైన్‌ విషయానికి వస్తే ఇది కొత్త ఫీచర్లతో వస్తున్నట్లు ఇప్పటికే లీక్ అయిన సమాచారం ద్వారా తెలిసింది. ఇప్పుడు ఈ స్మార్ట్‌ఫోన్ తన కొత్త ఫోన్ యొక్క కెమెరా ఫీచర్లను పంచుకున్నది. అందులో భాగంగా ఇది‌ అల్ట్రావైడ్ సెల్ఫీ కెమెరా ఫీచర్ ను కలిగి ఉంది అని మరొక లీక్ ద్వారా వెళ్ళడించింది. దీని అర్థం మీరు ఈ స్మార్ట్‌ఫోన్‌తో పాటుగా ఎటువంటి సెల్ఫీ స్టిక్ తీసుకెళ్లవలసిన అవసరం లేదు.

 

 

<strong>Also Read: OnePlus Nord AR స్మార్ట్‌ఫోన్ యొక్క స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో ఓ లుక్ వేయండి...</strong>Also Read: OnePlus Nord AR స్మార్ట్‌ఫోన్ యొక్క స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో ఓ లుక్ వేయండి...

వన్‌ప్లస్ నార్డ్ కెమెరా ఫీచర్స్
 

వన్‌ప్లస్ నార్డ్ కెమెరా ఫీచర్స్

వన్‌ప్లస్ యొక్క కొత్త స్మార్ట్‌ఫోన్‌ నార్డ్‌లో డ్యూయల్ సెల్ఫీ కెమెరా ఫీచర్లు ఉంటాయని వన్‌ప్లస్ సంస్థ తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా ధృవీకరించింది. దీనితో పాటుగా 105-డిగ్రీల ఫీల్డ్ వ్యూతో వైడ్ యాంగిల్ షూటర్ కూడా ఉన్నట్లు ధృవీకరించింది. ఇటీవల విడుదల చేసిన ఫొటోలో ముందు భాగంలో రెండు ముందు కెమెరాలు ఉన్నట్లు సూచించింది. అందులో ఒకటి 105-డిగ్రీల వీక్షణ క్షేత్రాన్ని కలిగి ఉన్నట్లు వన్‌ప్లస్ సంస్థ ఇప్పుడు ధృవీకరించింది. వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ సంస్థకు "కొత్త ప్రారంభం" గా ఉంది, దాని ప్రధాన ఫ్లాగ్‌షిప్ సిరీస్‌తో పోల్చితే అవసరమైన లక్షణాలను మరింత చేరుకోగల ధరలకు అందించడంపై దృష్టి సారించింది. ఈ ఫోన్ జూలై 21 వర్చువల్ లాంచ్ కోసం నిర్ణయించగా ప్రీ-ఆర్డర్లు రేపటి నుంచి అంటే జూలై 15 నుండి ప్రారంభమవుతాయి.

వన్‌ప్లస్ కొత్త వీడియో క్లిప్ సమాచారం

వన్‌ప్లస్ కొత్త వీడియో క్లిప్ సమాచారం

ఇన్‌స్టాగ్రామ్‌లో వన్‌ప్లస్ సంస్థ విడుదల చేసిన కొత్త వీడియో క్లిప్ (@ oneplus.nord) యొక్క వివరాలలోకి వెళితే వన్‌ప్లస్ నార్డ్‌ ఫోన్ డ్యూయల్ సెల్ఫీ కెమెరాలు ఉన్నట్లు నిర్ధారిస్తుంది. సెల్ఫీ స్టిక్‌ అవసరం లేకుండా దానికి బదులుగా అల్ట్రా-వైడ్-యాంగిల్ ఫ్రంట్ కెమెరాను అందిస్తున్నట్లు ఈ వీడియో తెలుపుతోంది. టిప్‌స్టర్ ఇవాన్ బ్లాస్ పోస్ట్ చేసిన ఫోటో లీకైన కొద్దిసేపటికే ఈ పోస్ట్ వచ్చింది.

వన్‌ప్లస్ నార్డ్ లీక్ స్పెసిఫికేషన్స్

వన్‌ప్లస్ నార్డ్ లీక్ స్పెసిఫికేషన్స్

వన్‌ప్లస్ నార్డ్ యొక్క అన్ని ముఖ్యమైన ఫీచర్ల విషయానికి వస్తే కొత్తగా లీక్ అయిన వన్‌ప్లస్ ఫోటో ప్రకారం నార్డ్‌లో 32 మెగాపిక్సెల్ మెయిన్ సెల్ఫీ కెమెరాతో పాటు 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ సెకండరీ కెమెరాతో 105 డిగ్రీల ఫీల్డ్ వ్యూ ఫీచర్ ఉన్నట్లు చూపించింది. ఈ ఫోన్ యొక్క అధికారిక ప్రయోగానికి కేవలం ఒక వారం దూరం మాత్రమే ఉంది.

వన్‌ప్లస్ నార్డ్  లాంచ్ ఆహ్వాన టికెట్ అమ్మకాలు

వన్‌ప్లస్ నార్డ్ లాంచ్ ఆహ్వాన టికెట్ అమ్మకాలు

వన్‌ప్లస్ నార్డ్ లాంచ్ ఆహ్వానాలను కొనుగోలు చేసేవారికి అమెజాన్‌లో లాంచ్ డే లాటరీలో పాల్గొనడానికి మరియు హామీ ఇచ్చిన బహుమతిని గెలుచుకునే అవకాశం కూడా లభిస్తుంది. అయితే ఈ లాంచ్ లో పాల్గొనేవారికి ఎటువంటి బహుమతులు ఇవ్వనున్నదో కంపెనీ వెల్లడించలేదు. వన్‌ప్లస్ నార్డ్ AR లాంచ్ యొక్క టికెట్ల అమ్మకం జూలై 11 నుంచి ఇప్పటికే మొదలయ్యాయి. యూజర్లు అమెజాన్ ఇండియా వెబ్‌సైట్ ద్వారా టికెట్ లను రూ.99 ధర వద్ద కొనుగోలు చేయవచ్చు.

Best Mobiles in India

English summary
OnePlus Nord Features New Leaks : Dual Selfie Camera with 105-Degree Ultra Wide-Angle Lens

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X