Home
News

OnePlus కొత్త టీవీలు వచ్చేసాయి!!! రూ.12,999 ధరకే కొత్త టీవీ....

ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ వన్‌ప్లస్ టీవీ రంగంలోకి ప్రవేశించిన తరువాత దూకుడును ప్రదర్శిస్తున్నది. ఇప్పుడు ఈ సంస్థ కొత్తగా U సిరీస్ మరియు Y సిరీస్‌ స్మార్ట్ టీవీలను ఇండియాలో విడుదల చేసింది. ఇండియాలో వన్‌ప్లస్ యొక్క Y-సిరీస్ టీవీ మోడళ్ల యొక్క ధర రూ.12,999 నుండి ప్రారంభం అవుతుండగా U-సిరీస్ యొక్క సింగల్ వేరియంట్ టీవీ యొక్క ధర రూ. 49,999.

వన్‌ప్లస్ కొత్త స్మార్ట్ టీవీలు

వన్‌ప్లస్ కొత్త స్మార్ట్ టీవీలు

వన్‌ప్లస్ సంస్థ యొక్క కొత్త స్మార్ట్ టీవీలు ఆండ్రాయిడ్ టీవీ 9 పై ఆధారంగా రన్ అవుతున్నాయి. అలాగే ఇవి వాటి యొక్క వేరియంట్‌ను బట్టి వివిధ రకాల ఫీచర్స్ మరియు స్పెసిఫికేషన్స్ లను అందిస్తాయి. వన్‌ప్లస్ యొక్క Y-సిరీస్ స్మార్ట్ టీవీలు రెండు వేరు వేరు 32-అంగుళాల హెచ్‌డి రిజల్యూషన్ మరియు 43-అంగుళాల ఫుల్-హెచ్‌డి రిజల్యూషన్ పరిమాణాల్లో లభిస్తుంది. అలాగే వన్‌ప్లస్ యొక్క U- సిరీస్ స్మార్ట్ టీవీ 55-అంగుళాల అల్ట్రా- HD సింగిల్ స్క్రీన్‌‌ వేరియంట్‌లో లభిస్తుంది.

వన్‌ప్లస్ కొత్త టీవీల సేల్స్ వివరాలు

వన్‌ప్లస్ కొత్త టీవీల సేల్స్ వివరాలు

వన్‌ప్లస్ సంస్థ యొక్క కొత్త స్మార్ట్ టీవీలు U-సిరీస్ మరియు Y-సిరీస్ టెలివిజన్ల యొక్క మొదటి అమ్మకాలు ఇండియాలో జూలై 5 నుండి అమెజాన్‌లో జరగనున్నాయి. ఈ స్మార్ట్ టీవీలు త్వరలో వన్‌ప్లస్ ఆన్‌లైన్ స్టోర్‌తో పాటు ఆఫ్‌లైన్ రిటైల్ ద్వారా కూడా అందుబాటులోకి రానున్నాయి.

వన్‌ప్లస్ Y- సిరీస్‌ టీవీ స్పెసిఫికేషన్స్

వన్‌ప్లస్ Y- సిరీస్‌ టీవీ స్పెసిఫికేషన్స్

ఇండియాలో సరసమైన ధరల వద్ద వన్‌ప్లస్ సంస్థ విడుదల చేసిన Y-సిరీస్‌ యొక్క స్మార్ట్ టెలివిజన్లు 32-అంగుళాల మరియు 43-అంగుళాల పరిమాణాలలో లభిస్తాయి. బడ్జెట్ ధరలో ఇవి అద్భుతమైన ఫీచర్లతో కొనుగోలుదారులను ఆకర్షిస్తున్నాయి. ఈ స్మార్ట్ టీవీలలో అధికంగా ఆక్సిజన్ ప్లే, వన్‌ప్లస్ కనెక్ట్ వంటి మరిన్ని ఫీచర్ల యాక్సిస్ ఉంది. ఈ ఫీచర్స్ పోటీ ప్రపంచంలో బడ్జెక్ట్ ధరలో వినియోగదారులకు మెరుగైన స్మార్ట్ టీవీ అనుభవాన్ని ఇస్తుంది.

 

వన్‌ప్లస్ U- సిరీస్‌ టీవీ స్పెసిఫికేషన్స్

వన్‌ప్లస్ U- సిరీస్‌ టీవీ స్పెసిఫికేషన్స్

ఇండియాలో అధిక ధర వద్ద లాంచ్ అయిన 55 అంగుళాల సింగిల్ సైజ్ వేరియంట్ వన్‌ప్లస్ U-సిరీస్ స్మార్ట్ టీవీ 4K LED స్క్రీన్ మరియు డాల్బీ విజన్ HDR ఫార్మాట్ మద్దతుతో వస్తుంది. ఈ కొత్త టీవీ వన్‌ప్లస్ టివి క్యూ 1 మరియు వన్‌ప్లస్ టివి క్యూ 1 ప్రో యొక్క స్పెసిఫికేషన్ లకు సమానమైన ఫీచర్ లను కలిగి ఉంది. వన్‌ప్లస్ యొక్క Q1 సిరీస్ క్యూఎల్‌ఇడి డిస్‌ప్లేలను కలిగి ఉండి స్పష్టమైన తేడాతో 93 శాతం కలర్ స్పష్టతను కలిగి ఉంటుంది. ఇది ప్రపంచంలోని చాలా సినిమా హాళ్ళలో ఉపయోగించబడే DCI-P3 ఫీచర్లను కలిగి ఉంటుంది.

వన్‌ప్లస్ U- సిరీస్‌ టీవీ డిజైన్

వన్‌ప్లస్ U- సిరీస్‌ టీవీ డిజైన్

వన్‌ప్లస్ యొక్క 55-ఇంచ్ U- సిరీస్‌ టీవీ 6.9 mm మందం, 95 శాతం స్క్రీన్-టు-బాడీ రేషియో డిజైన్ ను కలిగి ఉంటుంది. అలాగే ఇది స్మార్ట్‌ఫోన్‌తో సులభంగా కనెక్ట్ అవ్వడం కోసం ఆక్సిజన్ ప్లే మరియు వన్‌ప్లస్ కనెక్ట్ యాప్ యాక్సిస్ ను కలిగి ఉంది. దీని యొక్క రిమోట్ లో గల చిన్న బటన్ ల ద్వారా నెట్‌ఫ్లిక్స్ మరియు అమెజాన్ ప్రైమ్ వీడియోలను నేరుగా యాక్సిస్ చేయడానికి అనుమతిని ఇస్తుంది. అలాగే దీని యొక్క రిమోట్ గూగుల్ అసిస్టెంట్‌తో కమ్యూనికేట్ చేయడానికి కూడా ఉపయోగించవచ్చు.

వన్‌ప్లస్ కొత్త స్మార్ట్ టీవీల ఫీచర్స్

వన్‌ప్లస్ కొత్త స్మార్ట్ టీవీల ఫీచర్స్

వన్‌ప్లస్ యొక్క మూడు కొత్త టీవీలు ఏవైనా యాప్ లను మరియు గేమ్ లను డౌన్‌లోడ్ చేయడానికి గూగుల్ అసిస్టెంట్, గూగుల్ క్రోమ్‌కాస్ట్ మరియు గూగుల్ ప్లే స్టోర్‌ వంటి వాటిని కలిగి ఉన్నాయి. ఇవి ఆండ్రాయిడ్ టివి 9 పై ఆధారంగా రన్ అవుతాయి. కంటెంట్-సెంట్రిక్ వీక్షణ కోసం యూజర్లు ఆక్సిజన్ ప్లే ఇంటర్‌ఫేస్‌ను కూడా ఉపయోగించవచ్చు. Y సిరీస్ డాల్బీ ఆడియో ట్యూనింగ్‌తో 20W రేటింగ్ సౌండ్ అవుట్‌పుట్‌ను కలిగి ఉంది. అలాగే U సిరీస్‌లో 30W ఫోర్-స్పీకర్ సెటప్, డాల్బీ అట్మోస్ ఆడియో మద్దతును కలిగి ఉంది. ఈ కొత్త టెలివిజన్‌లు బ్లూటూత్ స్టీరియో మోడ్‌లో వైర్‌లెస్ స్పీకర్‌లను ఉపయోగించగల సామర్థ్యంను కూడా కలిగి ఉన్నాయి.

Best Mobiles in India

English summary
OnePlus TV U and Y Series Launched in India: Price, Sale Date and More Details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X