వన్‌ప్లస్ వన్ పేలింది

Posted By:

చార్జ్ అవుతోన్న మరో స్మార్ట్‌ఫోన్ పేలుడుకు గురైంది. న్యూఢిల్లీకి చెందిన అంకుర్ దుగార్ తన 64జీబి స్టాండ్ స్టోన్ బ్లాక్ వన్‌ప్లస్ వన్ ఫోన్‌ను చార్జింగ్ సాకెట్‌కు అనుసంధానించి నిద్రపోయాడు. ఉదయం 9 గంటల ప్రాంతంలో కాలిన వాసన పసిగట్టి లెగసి చూసిన అంకుర్ తన ఫోన్ మంటల్లో చిక్కుకున్న విషయాన్ని గ్రహించాడు.

Read More :  ఐఎఫ్ఏ 2015.. కొత్త ఫోన్‌లు వచ్చేస్తున్నాయ్

వెంటనే ఆ ఫోన్‌ను మంచం మీద నుంచి క్రిందకు విసిరేయటంతో పెద్ద ప్రమాదమే తప్పినట్లయింది. అంకుర్ ఈ ఫోటోలను తన ఫేస్‌బుక్‌లో పేజీలో పోస్ట్ చేసాడు. బ్యాటరీ లోపం లేదా చార్జింగ్ సాకెట్‌లో లోపం కారణంగా ఈ ప్రమాదం సంభవించి ఉండొచ్చని తెలుస్తోంది. కాబట్టి ఫ్రెండ్స్ చార్జ్ అవుతోన్న స్మార్ట్‌ఫోన్‌లతో చాలా జాగ్రత్తగా ఉండండి.

Read More : ముదిరిన ఉల్లి లొల్లి

ఇటీవల కాలంలో మొబైల్ ఫోన్‌లు పేలుడుకు గురువుతున్న సంఘటనలను అనేకం వింటున్నాం. మొబైల్ ఫోన్‌లు బ్లాస్ట్ అవటానికి బ్యాటరీనే ప్రధాన కారణం. స్మార్ట్‌ఫోన్ యూజర్లు ఇటువంటి ప్రమాదాల నుంచి బయటపడేందుకు పలు ముఖ్యమైన సూచనలు.....

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

మీ ఫోన్ బ్లాస్ కాకుండా ఉండాలంటే

సాధ్యమైనంత వరకు బ్రాండెడ్ క్వాలటీ ఫోన్‌నే కొనుగోలు చేయండి. మీరు కొనుగోలు చేసే స్మార్ట్‌ఫోన్ ఖచ్చితమైన ఐఎమ్ఈఐ నెంబర్‌ను కలిగి ఉండాలి. అలానే మీరు వినియోగించే ఫోన్‌కు సంబంధించి ఇయర్ ఫోన్స్, బ్యాటరీ ఇంకా ఛార్జర్‌లు మన్నికైనవిగా ఉండాలి.

మీ ఫోన్ బ్లాస్ కాకుండా ఉండాలంటే

సెల్‌ఫోన్ బ్లాస్ట్ అవటానికి ప్రధాన కారణం బ్యాటరీ. ఫోన్ ఛార్జింగ్‌లో ఉన్న సమయంలో మథర్ బోర్డ్ పై ఎక్కువ ఒత్తిడి ఉంటుంది. కొన్ని ఫోన్‌లలో నాసిరకమైన ఎలక్ట్రానిక్ కాంపోనెంట్‌లను ఉపయోగించటం వల్ల పేలుడు సంభవిస్తుంటుంది.

మీ ఫోన్ బ్లాస్ కాకుండా ఉండాలంటే

సెల్‌ఫోన్ పై ఎక్కువ ఒత్తిడి పడకుండా ఉండాలంటే, ఫోన్ చార్జ్ అవుతున్న సమయంలో కాల్స్ రిసీవ్ లేదా డయల్ చేయటం అంత శ్రేయస్కరం కాదు. అంతగా మాట్లాడాలనుకుంటే ఛార్జింగ్ కేబుల్ నుంచి ఫోన్‌లను వేరు చేసి మాట్లాడండి.

మీ ఫోన్ బ్లాస్ కాకుండా ఉండాలంటే

తడి ఫోన్‌ను ఛార్జ్ చేయకండి

మీ ఫోన్ బ్లాస్ కాకుండా ఉండాలంటే

చవక ధర ఫోన్‌‍లలో వినియోగించే కాంపోనెంట్స్ బ్రాండెడ్ క్వాలిటీ కాకపోవటం వల్ల వీటిని ఉపయోగించటం అంతగా మంచిది కాదు. ఒక వేళ వీటిని ఉపయోగించాల్సి వస్తే చాలా అప్రమత్తంగా ఉండాలి.

మీ ఫోన్ బ్లాస్ కాకుండా ఉండాలంటే

నకిలీ బ్యాటరీలకు దూరంగా ఉండటం వల్ల సెల్‌ఫోన్ ప్రమాదాలను నివారించవచ్చు. వర్షం లేదా చమ్మ తాకిడికి గురైన ఫోన్‌ను ఛార్జ్ చేయటం ప్రమాదకరం.

మీ ఫోన్ బ్లాస్ కాకుండా ఉండాలంటే

ఉబ్బిన బ్యాటరీతో ఫోన్‌ను వాడొద్దు. వీలైనంత త్వరగా బ్యాటరీని మార్చేయండి.

మీ ఫోన్ బ్లాస్ కాకుండా ఉండాలంటే

ఫోన్ పూర్తిగా చార్జ్ అయిన వెంటనే, బ్యాటరీ ప్లగ్ నుంచి తొలగించటం మంచిది.

మీ ఫోన్ బ్లాస్ కాకుండా ఉండాలంటే

నకిలీ మొబైల్ చార్జర్‌లకు దూరంగా ఉండటం వల్ల సెల్‌ఫోన్ ప్రమాదాలను నివారించవచ్చు.

మీ ఫోన్ బ్లాస్ కాకుండా ఉండాలంటే

ఫోన్ పూర్తిగా చార్జ్ అయిన వెంటనే, బ్యాటరీ ప్లగ్ నుంచి తొలగించటం మంచిది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
OnePlus One Unit Allegedly Explodes. Read More in Telugu Gizbot..
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot