Samsung యొక్క కొత్త రకం టీవీలు వచ్చేసాయి!!! ధరలు కూడా భారీగానే...

|

శామ్‌సంగ్ సంస్థ తన తాజా టీవీలను భారత్‌లో విడుదల చేసింది. కొత్తగా ప్రారంభించిన శామ్‌సంగ్ యొక్క లైనప్‌లో ది సెరిఫ్ , 4K మరియు 8K QLED 2020 స్మార్ట్ టివిలు ఉన్నాయి. శామ్‌సంగ్ యొక్క క్రొత్త ఉత్పత్తులు వేర్వేరు ధరలతో రకరకాల ఫీచర్లతో ప్రేక్షకులను లక్ష్యంగా చేసుకున్నాయి.

శామ్‌సంగ్ తాజా టీవీలు

శామ్‌సంగ్ తాజా టీవీలు

శామ్‌సంగ్ తాజా టీవీలలో సెరిఫ్ టీవీ ప్రత్యేకమైన యూనిబోడీ డిజైన్‌ను కలిగి ఉంది. శామ్‌సంగ్ మరియు పారిసియన్ డిజైన్ బృందం రోనన్ మరియు ఎర్వాన్ బౌరౌలెక్ కలిసి ఈ టీవీను తయారుచేసారు. ఈ కొత్త టీవీల గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

శామ్సంగ్ సెరిఫ్‌ టీవీ దరల వివరాలు

శామ్సంగ్ సెరిఫ్‌ టీవీ దరల వివరాలు

ఇండియాలో శామ్సంగ్ ది సెరిఫ్‌ టీవీను 43-అంగుళాల, 49-అంగుళాల, మరియు 55-అంగుళాల వంటి మూడు వేరువేరు పరిమాణాల్లో విడుదల చేసింది. వీటి యొక్క ధరలు వరుసగా రూ. 83,900, రూ. 1,16,900, మరియు రూ. 1,48,900. ఈ లైఫ్ స్టైల్ టీవీని కేవలం అమెజాన్ మరియు శామ్సంగ్ యొక్క అధికారిక ఆన్‌లైన్ స్టోర్, శామ్‌సంగ్ షాప్‌లలో మాత్రమే కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంటుంది. 2020 జూలై 8 నుండి జూలై 17 వరకు అమెజాన్‌లో జరిగే ప్రత్యేకమైన సేల్స్ ద్వారా శామ్సంగ్ సెరిఫ్‌ టీవీను తగ్గింపు ధర వద్ద పొందవచ్చు.

శామ్సంగ్ 8K QLED టీవీ ధరల వివరాలు

శామ్సంగ్ 8K QLED టీవీ ధరల వివరాలు

శామ్‌సంగ్‌ సంస్థకు చెందిన 8K QLED టీవీలు 65-అంగుళాల, 75-అంగుళాల, 82-అంగుళాల, మరియు 85-అంగుళాల వేరియంట్ లలో విడుదల అయ్యాయి. వీటి యొక్క ధరలు వరుసగా 4.99 లక్షలు, 9.99 లక్షలు, 14.29 లక్షలు, మరియు 15.79 లక్షల రూపాయలు. ఇవే కాకుండా కంపెనీ 43-అంగుళాలు మరియు 75-అంగుళాల పరిమాణంలో 4K QLED మోడళ్లను కూడా తీసుకువచ్చింది. ప్రస్తుతానికి దీని ధరల వివరాలను మాత్రం వెల్లడించలేదు.

శామ్‌సంగ్ టీవీల ప్రీ-బుకింగ్‌

శామ్‌సంగ్ టీవీల ప్రీ-బుకింగ్‌

శామ్‌సంగ్ యొక్క ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌లలో అందుబాటులో ఉండే ఈ టీవీలు జూలై 1 నుండి జూలై 10, 2020 మధ్య 8K టివి కోసం సామ్‌సంగ్ ప్రీ-బుకింగ్‌లు తీసుకుంటోంది. ఈ టివిను కొనుగోలు చేసిన వినియోగదారులకు రెండు శామ్‌సంగ్ గెలాక్సీ ఎస్ 20 + స్మార్ట్‌ఫోన్‌లను ఉచితంగా కూడా అందిస్తుంది.

శామ్‌సంగ్‌ QLED 8K TV సేల్స్ ఆఫర్స్

శామ్‌సంగ్‌ QLED 8K TV సేల్స్ ఆఫర్స్

శామ్‌సంగ్‌ యొక్క QLED 8K TVలను కొనుగోలు చేసే వినియోగదారులు HDFC బ్యాంక్ , ICICI బ్యాంక్ మరియు ఫెడరల్ బ్యాంక్ డెబిట్ కార్డు ద్వారా కొన్న వారికి రూ.15,000 వరకు క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. అలాగే అదనంగా ZEE5, సోనీ లివ్ & ఈరోస్ నౌ వంటి OTT ప్లాట్‌ఫారమ్‌ల చందాలపై శామ్‌సంగ్ 50 శాతం తగ్గింపును కూడా అందిస్తోంది. అలాగే ఉచిత చందాలలో భాగంగా ఒక సంవత్సరం గానా ప్లస్ చందా మరియు మూడు నెలలు ఆపిల్ మ్యూజిక్ చందా కూడా లభిస్తుంది. ఇది 5GB క్లౌడ్ స్టోరేజ్‌తో పాటు Office365 కు ఉచిత సభ్యత్వాన్ని కూడా అందిస్తోంది.

శామ్‌సంగ్ సెరిఫ్ టీవీ డిజైన్

శామ్‌సంగ్ సెరిఫ్ టీవీ డిజైన్

శామ్‌సంగ్ సంస్థ కొత్తగా విడుదల చేసిన సెరిఫ్ టీవీ "I" అక్షరం ఆకారంలో యూనిబోడీ డిజైన్‌ను కలిగి ఉంది. ఈ సెరిఫ్ టీవీ ప్రస్తుతం ఉన్న టెలివిజన్ల కంటే ఎక్కువ ఫీచర్లతో రూపొందించబడింది. అలాగే దీని యొక్క బాహ్య సౌందర్యాన్ని ఇంటి డెకర్‌గా మెరుగైన డిజైన్ ను కలిగి ఉంది. ఈ సెరిఫ్ టీవీ ఒక మెటల్ స్టాండ్ ను కలిగి ఉంటుంది. ఇది గదిలో ఎక్కడైనా ఉంచడానికి అనుమతిస్తుంది. అలాగే సెరిఫ్‌ టీవీ యొక్క మెటల్ స్టాండ్‌ను తొలగించి టేబుల్ లేదా షెల్ఫ్‌లో కూడా ఉంచవచ్చు. సెరిఫ్ టీవీ శామ్సంగ్ యొక్క క్వాంటం డాట్ టెక్నాలజీని కలిగి ఉండి యాక్టివ్ వాయిస్ యాంప్లిఫైయర్ ఫీచర్ ను కలిగి ఉంది. ఇందులో గల హెచ్‌డిఆర్ 10+ సర్టిఫైడ్ మరియు AI అప్‌స్కేలింగ్ టెక్నాలజీని ఉపయోగించి డిస్ప్లే లోని ప్రతి విషయాన్ని 4Kకు పెంచగలదు.

శామ్‌సంగ్ సెరిఫ్ టీవీ ఫీచర్స్

శామ్‌సంగ్ సెరిఫ్ టీవీ ఫీచర్స్

శామ్‌సంగ్ యొక్క సెరిఫ్‌ టీవీకు NFC కనెక్టివిటీ కూడా ఉంది. దీనిని కనెక్ట్ చేయడానికి టీవీ పైభాగంలో స్మార్ట్‌ఫోన్‌ను ఉంచాలి లేదా నొక్కాలి. ఇది ఎయిర్‌ప్లే 2కు కూడా అనుకూలంగా ఉంటుంది. ఇది ఆపిల్ ఫోన్ వినియోగదారులను ది సెరిఫ్‌లో కంటెంట్‌ను ప్రసారం చేయడానికి అనుమతిస్తుంది.

శామ్సంగ్ 8K QLED టీవీ ఫీచర్స్

శామ్సంగ్ 8K QLED టీవీ ఫీచర్స్

శామ్సంగ్ సంస్థ తన 8K QLED టీవీలను సెరిఫ్‌ టీవీతో పాటు విడుదల చేసింది. ఈ సంవత్సరం విడుదల అయిన శామ్సంగ్ యొక్క QLED 8K టీవీలు దాదాపు 99% స్క్రీన్-టు-బాడీ రేషియో ఇన్ఫినిటీ స్క్రీన్, అడాప్టివ్ పిక్చర్, యాక్టివ్ వాయిస్ యాంప్లిఫైయర్, క్యూ-సింఫనీ మరియు ఆబ్జెక్ట్ ట్రాకింగ్ సౌండ్ + వంటి ఫీచర్లను కలిగి ఉన్నాయి. ఈ క్యూఎల్‌ఇడి 8K టివిలు రియల్ 8K రిజల్యూషన్, 8K AI అప్‌స్కేలింగ్, క్వాంటం ప్రాసెసర్ మరియు క్వాంటం హెచ్‌డిఆర్‌తో వస్తాయి.

Best Mobiles in India

English summary
Samsung Launches The Serif, 8K and 4K QLED New TVs in India : Price, Sales Date, Offers and More

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X