Home
News

ఒప్పో 10,000mAh పవర్ బ్యాంక్... ధర చాలా తక్కువ!!!

ఒప్పో సంస్థ ఇప్పుడు తన సరికొత్త 20W VOOC ఫాస్ట్ ఛార్జింగ్ పవర్ బ్యాంక్‌ను ఇండియాలో ప్రారంభించింది. ఒప్పో యొక్క 10,000mAh VOOC ఫ్లాష్ ఛార్జ్ పవర్ బ్యాంక్ రెండు మార్గాల ఛార్జింగ్కు మద్దతు ఇస్తుంది. ఇది అన్ని స్మార్ట్‌ఫోన్‌లను ఛార్జింగ్ చేయడానికి అనుకూలంగా ఉంటుంది. ఈ సరికొత్త పవర్ బ్యాంక్ అమెజాన్ ఇండియా మరియు ఒప్పో యొక్క ఆఫ్‌లైన్ స్టోర్ల ద్వారా 1,499 రూపాయలకు కొనుగోలు చేయవచ్చు అని ఒప్పో సంస్థ తెలిపింది.

పవర్ బ్యాంక్

ఒప్పో పవర్ బ్యాంక్ యొక్క స్పెసిఫికేషన్ల విషయానికి వస్తే ఇది 10,000mAh సామర్ధ్యం కలిగి ఉండి 20W VOOC ఫ్లాష్ ఛార్జింగ్ మద్దతును కలిగి ఉంటుంది. ఈ పవర్ బ్యాంక్ అల్యూమినియం ఆర్క్ బాడీను కలిగి ఉండి లోపల 2x 5000mAh బ్యాటరీలతో అమర్చబడి ఉంటుంది.

 

 

 

బ్యాటరీ

ఇందులో 1x USB టైప్-ఎ పోర్ట్, 1x USB టైప్-సి పోర్ట్ మరియు ఫిజికల్ బటన్ ఉంటాయి. అలాగే 4 ఎల్ఈడి లైట్లను కలిగి ఉంటాయి ఇవి పవర్ బ్యాంక్ యొక్క పవర్ స్థితిని సూచిస్తాయి. పవర్ బ్యాంక్ బ్యాటరీల భద్రతా రక్షణ కోసం రెండు లేయర్ లను కలిగి ఉంది. అలాగే అవుట్ ఫుట్ పవర్ ను సర్దుబాటు చేయడానికి స్మార్ట్ చిప్ లోపల నిర్మించబడి ఉందని ఒప్పో పేర్కొంది. పవర్ సర్క్యూట్ కోసం 13లేయర్ భద్రతా రక్షణ కూడా ఉంది.

 

కలర్ OS 7

ఒప్పో సంస్థ ఇటీవల ఇన్-హౌస్ స్కిన్డ్ ఆపరేటింగ్ సిస్టమ్ కలర్ OS 7 ను చైనాలో విడుదల చేసింది. దీనిని నవంబర్ 26 న భారతదేశంలో లాంచ్ చేస్తున్నట్లు సమాచారం. కొత్త స్కిన్ యొక్క హైలైట్ ఏమిటంటే ఇది తాజా ఆండ్రాయిడ్ 10 OS ఆధారంగా రూపొందించబడింది. ఒప్పో రెనో 3 సిరీస్‌ను డిసెంబర్‌ 5వ తేదీన చైనాలో విడుదల చేయనున్నట్లు కంపెనీ ధృవీకరించింది.

 

 రెనో 3 సిరీస్

ఒప్పో యొక్క అధికారిక Weibo రెనో 3 సిరీస్ స్పెసిఫికేషన్లను ధృవీకరించింది. ఇది డ్యూయల్-మోడ్ 5G సపోర్ట్‌తో పని చేసే డ్యూయల్ సిమ్ స్లాట్లను కలిగి ఉందని కంపెనీ తెలిపింది. డ్యూయల్-మోడ్ 5G అంటే ఫోన్ SA (స్టాండ్ అలోన్ మోడ్) మరియు NSA (నాన్-స్టాండ్ అలోన్) నెట్‌వర్క్ మోడ్‌లకు మద్దతు ఇస్తుంది. సెల్ టవర్లు మరియు సర్వర్‌ల మధ్య కమ్యూనికేషన్ వంటి పనుల కోసం NSA మోడ్ LTE బ్యాండ్‌లపై ఆధారపడుతుంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Oppo 10,000mAh,20W Fast Charging Power bank Launched in India: Price,Availability and Specifications
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X