Home
News

Oppo స్మార్ట్‌ఫోన్‌ల కొత్త ధరలు ఇవే.... భారీగా పెరిగిన ధరలు....

భారత ప్రభుత్వం కొన్ని వారాల క్రితం మొబైల్ ఫోన్‌లపై ఉన్న GSTని 12% నుండి 18% కు పెంచినట్లు ప్రకటించింది. దీని అర్థం భారతదేశంలో స్మార్ట్‌ఫోన్‌లు ఖరీదైనవి అవుతాయి. GST పెంపు కారణంగా కొత్తగా మార్కెట్ లోకి రాబోయే ఫోన్‌లతో పాటు ఇప్పటికే అందుబాటులో ఉన్న స్మార్ట్‌ఫోన్‌ల యొక్క ధరల మీద కూడా వాటి ప్రభావం పడింది.

ఒప్పో ఇండియా

షియోమి తన మొబైల్ ఫోన్ల యొక్క కొత్త ధరలను త్వరలో ట్విట్టర్‌ ద్వారా వెల్లడిస్తున్నట్లు ప్రకటించింది. ఒప్పో ఇండియా ఇప్పటికే దేశంలోని ఆఫ్‌లైన్ రిటైలర్లకు తన కొత్త ధరల వివరాలను తెలియజేసింది. ముంబైకి చెందిన ప్రముఖ రిటైలర్ మహేష్ టెలికాం ధరల పెరుగుదల తర్వాత వివిధ రకాల ఒప్పో స్మార్ట్‌ఫోన్‌ల కొత్త ధరలను పోస్ట్ చేసింది.

ఒప్పో

ఒప్పో సంస్థ ఇటీవల విడుదల చేసిన రెనో 3 ప్రోతో సహా ఒప్పో అన్ని స్మార్ట్‌ఫోన్‌ల మీద సుమారు రూ.2,000 వరకు ధరల పెరుగుదలను అందుకున్నది. ఎంట్రీ లెవల్ ఒప్పో ఫోన్‌ల మీద రూ.500 పెంచగా, హై లెవల్ ఫోన్‌లకు 18% జీఎస్టీ రేటును గ్రహించడానికి రూ.2,000 వరకు ధరలను పెంచారు. ఇండియాలో ఒప్పో స్మార్ట్‌ఫోన్‌ల యొక్క కొత్త ధరల వివరాల గురించి మరింత తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

ఇండియాలో ఒప్పో స్మార్ట్‌ఫోన్‌ల కొత్త ధరలు

ఇండియాలో ఒప్పో స్మార్ట్‌ఫోన్‌ల కొత్త ధరలు

ఒప్పో యొక్క ఎంట్రీ లెవల్ స్మార్ట్‌ఫోన్‌ ఒప్పో A1K కొత్త MOP లేదా మార్కెట్ ఆపరేటింగ్ ధర రూ.7,990. పెరుగుదలకు ముందు దీని యొక్క ధర రూ.7,490. అంటే దీనిని మీద రూ.500లు పెరిగింది. ఒప్పో A5S యొక్క 2GB ర్యామ్ వేరియంట్ ఇప్పుడు రూ.8,990 మరియు ఒప్పో A5s యొక్క 3GB ర్యామ్ వేరియంట్ రూ.9,990 ధర వద్ద లభిస్తుంది. A5s మోడల్స్ రెండూ ఇంతకుముందు వరుసగా రూ.8,490 మరియు రూ.8,990 ధర వద్ద లభించేవి. చివరగా,ఒప్పో A5s యొక్క 4GB ర్యామ్ మోడల్‌ను ఇప్పుడు పాత ధర రూ.10,990 నుండి రూ.11,990 లకు పెంచింది.

Oppo A5 2020

Oppo A5 2020

ఒప్పో A5 2020 స్మార్ట్‌ఫోన్‌ యొక్క 3GB, 4GB మరియు 6GB మోడళ్ల యొక్క కొత్త ధరలు వరుసగా రూ.12,490, రూ.13,990, రూ.15,990. ధరల పెరుగుదలకు ముందు వీటి యొక్క ధరలు వరుసగా రూ.11,490, రూ.12,990 మరియు రూ .14,990. ఇటీవల విడుదల చేసిన ఒప్పో A31 ఫోన్ యొక్క 4GB మోడల్‌ కొత్త ధర రూ.12,490 వద్ద కలిగి ఉంది. ఇది రూ.11,490 ధర వద్ద లాంచ్ అయింది.

 

 

Oppo A9 2020

Oppo A9 2020

ఒప్పో A9 2020 స్మార్ట్‌ఫోన్‌ యొక్క 4GB మరియు 8GB ర్యామ్ మోడల్స్ ఇప్పుడు రూ.15,990 మరియు రూ.18,990 ధర వద్ద కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉన్నాయి. ఒప్పో F15 స్మార్ట్‌ఫోన్‌ను భారతదేశంలో రూ .19,990 వద్ద లాంచ్ చేయడం ద్వారా ఒప్పో 2020 ను ప్రారంభించింది. అయితే ధరల పెరుగుదల తరువాత ఒప్పో F15 ఇప్పుడు రూ.21,990 వద్ద లభిస్తుంది.

 

 

 

ఒప్పో రెనో 2F & రెనో 2Z

ఒప్పో రెనో 2F & రెనో 2Z

గతంలో అనేక సార్లు ధరల తగ్గింపును పొందిన ఒప్పో రెనో 2F మరియు రెనో 2Z స్మార్ట్‌ఫోన్‌లు ఇప్పుడు వరుసగా రూ .23,490 మరియు రూ .27,490 ధరలకు లభిస్తాయి. ఒప్పో రెనో 2 ను రూ .36,990 మునుపటి ధర నుండి రూ.38,990 లకు పెంచారు. చివరగా ఉన్న ఒప్పో రెనో 3 ప్రోను ఇండియాలో రూ.29,990 ధర వద్ద లాంచ్ చేసారు. అయితే ఇప్పుడు ఇది ఈ రోజు నుండి రూ.31,990 వద్ద కొనుగోలు చేయడానికి లభిస్తుంది. ఈ రోజు నుండి కొత్త ధరలు అమలులోకి వస్తాయని మహేష్ టెలికాం గుర్తించింది. అయితే లాక్డౌన్ వ్యవధి కారణంగా మీరు ఈ స్మార్ట్‌ఫోన్‌లను కొనుగోలు చేయలేకపోవచ్చు.

More from GizBot

Best Mobiles in India

English summary
Oppo Company Increase Smartphone Prices : Here are The List
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X