Oppo Find X2 Lite స్మార్ట్‌ఫోన్‌ ధర, ఫీచర్స్ ఇవే...

|

ఒప్పో సంస్థ యొక్క స్మార్ట్‌ఫోన్‌లకు ప్రపంచం అంతటా మంచి డిమాండ్ ఉంది. ఇప్పుడు సంస్థ తన మరో మిడ్-రేంజ్ 5G సపోర్ట్ ఒప్పో ఫైండ్ X2 లైట్ స్మార్ట్‌ఫోన్‌ను నిశ్శబ్దంగా విడుదల చేసింది. ఈ స్మార్ట్‌ఫోన్‌ యొక్క లాంచ్ మీద గత కొంతకాలం నుండి పుకార్లు బయటకు వచ్చాయి.

ఒప్పో ఫైండ్ X2 లైట్‌

ఇటీవలే ఈ ఫోన్ యొక్క పూర్తి డిజైన్ రెండర్ ఫోటోలు మరియు ఫీచర్స్ కూడా లీక్ అయ్యాయి. ఇప్పుడు ఒప్పో కంపెనీ తన పోర్చుగల్ వెబ్‌సైట్‌లో ఒప్పో ఫైండ్ X2 లైట్‌ను విడుదల చేసింది.

ఒప్పో ఫైండ్ X2 లైట్‌ స్మార్ట్‌ఫోన్‌

ఒప్పో ఫైండ్ X2 లైట్‌ స్మార్ట్‌ఫోన్‌

ఒప్పో ఫైండ్ X2 లైట్‌ స్మార్ట్‌ఫోన్‌ 5G కనెక్టివిటీ మద్దతును కలిగి ఉండి క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 765G చిప్‌సెట్ తో జతచేయబడి ఉంటుంది. అలాగే ఇందులో గల 48 మెగాపిక్సెల్ లెన్స్‌ క్వాడ్-రియర్ కెమెరా సెట్-అప్ ఈ ఫోన్ కు పెద్ద హైలైట్. ప్రస్తుతానికి ఒప్పో ఫోన్ ధరను ప్రకటించలేదు. అలాగే ఈ ఫోన్ ఇండియాలో ఎప్పుడు లాంచ్ అవుతుందో అన్న దాని మీద కూడా ఎటువంటి సమాచారం లేదు. ఒప్పో ఫైండ్ ఎక్స్ 2 లైట్ మూన్లైట్ బ్లాక్ మరియు పెర్ల్ వైట్ కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంటుంది.

Oppo Find X2 Lite స్పెసిఫికేషన్స్

Oppo Find X2 Lite స్పెసిఫికేషన్స్

Oppo Find X2 Lite 20: 9 కారక నిష్పత్తి మరియు 60Hz స్క్రీన్ రిఫ్రెష్ రేట్‌తో 6.4-అంగుళాల ఫుల్-HD + రిజల్యూషన్‌ OLED డిస్ప్లేని కలిగి ఉంది. దీని యొక్క డిస్ప్లేలో సెల్ఫీ కెమెరా కోసం వాటర్‌డ్రాప్ నాచ్ ఉంది. సెల్ఫీ కెమెరా ఎఫ్ / 2.0 ఎపర్చర్‌తో 32 మెగాపిక్సెల్ రెసొల్యూషన్ తో ఉంటుంది. ఫోన్ ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ను కూడా అందిస్తుంది.

ఒప్పో ఫైండ్ X2 లైట్ ఫీచర్స్

ఒప్పో ఫైండ్ X2 లైట్ ఫీచర్స్

ఒప్పో ఫైండ్ X2 లైట్ కలర్ OS 7 తో ఆండ్రాయిడ్ 10తో రన్ అవుతూ ఆక్టా-కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 765G ప్రాసెసర్‌ను కలిగి ఉంది. ఇది 8GB LPDDR4X RAM మరియు 128GB ఇంటర్నల్ స్టోరేజ్‌తో కేవలం ఒకే ఒక వేరియంట్‌లో మాత్రమే వస్తుంది. ఈ ఫోన్ యొక్క వెనుకవైపు క్వాడ్-కెమెరా సెటప్‌ను నిలువు వరుసలో అమర్చబడి ఉంది. ఈ సెటప్‌లో 48 మెగాపిక్సెల్ సోనీ IMX586 సెన్సార్, 8 మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ యాంగిల్ సెన్సార్, 2 మెగాపిక్సెల్ మాక్రో లెన్స్ మరియు 2 మెగాపిక్సెల్ పోర్ట్రెయిట్ లెన్స్ ఉన్నాయి.

బ్యాటరీ

ఒప్పో ఫైండ్ X2 లైట్‌ స్మార్ట్‌ఫోన్‌ 5G 30W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 4,025mAh బ్యాటరీతో ప్యాక్ చేయబడి ఉంటుంది. కనెక్టివిటీ ఎంపికలలో యుఎస్‌బి టైప్-సి పోర్ట్, 3.5mm ఆడియో జాక్ మరియు 5G సపోర్ట్ వంటివి ఉన్నాయి. ఒప్పో ఫైండ్ ఎక్స్ 2 లైట్ 30W ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతిచ్చే 4,025 ఎంఏహెచ్ బ్యాటరీని కూడా ప్యాక్ చేస్తుంది. 30W VOOC ఫ్లాష్ 4.0 టెక్నాలజీ కేవలం 20 నిమిషాల్లో ఫోన్‌ను 3 నుండి 50 శాతం వరకు ఛార్జ్ చేస్తుందని ఒప్పో పేర్కొంది.

Best Mobiles in India

English summary
Oppo Find X2 Lite with 5G Support Launched: Specifications, Features and More

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X