Oppo Reno Ace 2 స్మార్ట్‌ఫోన్‌ ఫీచర్స్ ఎలా ఉన్నాయో ఓ లుక్ వేయండి....

|

ఒప్పో రెనో Ace2 స్మార్ట్ ఫోన్ యొక్క లాంచ్ ఈవెంట్ ఏప్రిల్ 13 న జరుగనున్నది. ఈ లాంచ్ ఈవెంట్ కు కొద్ది రోజుల ముందు ఒప్పో సంస్థ తన కొత్త రెనో Ace2 స్మార్ట్‌ఫోన్‌ యొక్క ఫీచర్స్ మరియు స్పెసిఫికేషన్స్ లను విడుదల చేసింది.

 

ఒప్పో రెనో Ace2

ఒప్పో రెనో Ace2

ఇది 180HZ టచ్ శాంప్లింగ్ రేట్‌తో 90HZ డిస్‌ప్లేను కలిగి ఉన్నట్లు వెల్లడించింది. ఇది 4D స్థిరమైన కూలింగ్ మాత్రమే కాకుండా 4D గేమింగ్ వైబ్రేషన్ 2.0 కు కూడా మద్దతు ఇస్తుంది. ఒప్పో యొక్క తాజా టీజర్ బ్రాండ్ వినియోగదారులకు మంచి గేమింగ్ అనుభవాన్ని అందించాలని కోరుకుంటుందని సూచిస్తుంది.

ఒప్పో రెనో Ace2

ఒప్పో రెనో Ace2

ఒప్పో రెనో Ace2 ఫోన్‌ యొక్క ఫీచర్ల విషయానికి వస్తే ఇది డ్యూయల్ స్టీరియో స్పీకర్లను కలిగి ఉండి డాల్బీ అట్మోస్‌కు మద్దతును ఇస్తుంది. ఈ హ్యాండ్‌సెట్‌కు సంబంధించి ఇతర వివరాలను కంపెనీ వెల్లడించలేదు. ఏదేమైనా రాబోయే ఒప్పో ఫోన్ యొక్క పూర్తి స్పెసిఫికేషన్ వివరాలను ఇటీవలే టెనాలో స్పెక్స్ షీట్తో గుర్తించబడింది. దాని గురించి మరింత తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

Oppo Reno Ace 2 లీకైన స్పెసిఫికేషన్స్
 

Oppo Reno Ace 2 లీకైన స్పెసిఫికేషన్స్

ఒప్పో రెనో Ace 2 లో 2400 x 1080 పిక్సెల్స్ రిజల్యూషన్‌తో 6.5 అంగుళాల అమోలెడ్ డిస్‌ప్లే ఉంటుంది. ఇది బ్లాక్, బ్లూ మరియు పర్పుల్ వంటి మూడు కలర్ ఆప్షన్ లలో ఈ హ్యాండ్‌సెట్‌ను కంపెనీ అందిస్తుందని భావిస్తున్నారు. ఇది 2.8GHz క్లాక్ వేగంతో మరియు క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 865 SoC తో ప్యాక్ చేయబడి వస్తుంది. ఒప్పో రెనో ఏస్ 2 ను రెండు వేరియంట్లలో విడుదల చేయనున్నది. వీటిలో 8 జిబి ర్యామ్ / 12 జిబి స్టోరేజ్ మరియు 128 జిబి ర్యామ్/ 256 జిబి ఇంటర్నల్ స్టోరేజ్ ఆప్షన్స్ ఉన్నాయి.

కెమెరా సెటప్‌

కెమెరా సెటప్‌

ఆండ్రాయిడ్ 10 ఆధారిత కలర్‌ఓఎస్ 7తో రన్ అవుతున్నట్లు దీనిని డిజైన్ చేసారు. ఇమేజింగ్ కోసం దీని యొక్క వెనుక వైపు క్వాడ్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉన్నది. ఇందులో మెయిన్ కెమెరా 48 మెగాపిక్సెల్ షూటర్ మరియు 8 మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్-యాంగిల్ రెండవ కెమెరాతో జతచేయబడుతుంది.అలాగే 2 మెగాపిక్సెల్ మాక్రో మరియు 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ కెమెరాలు కూడా ఇందులో ఉన్నట్లు సమాచారం. ముందు భాగంలో 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా కూడా ఉంటుందని ఐటిహోమ్ నివేదించింది.

బ్యాటరీ

బ్యాటరీ

ఒప్పో రెనో Ace 2 స్మార్ట్ ఫోన్ 4,000 ఎమ్ఏహెచ్ బ్యాటరీతో ప్యాక్ చేయబడి వస్తుంది. ఈ హ్యాండ్‌సెట్ 65W సూపర్ VOOC ఫ్లాష్ ఛార్జింగ్‌ టెక్నాలజీ మద్దతుతో రానున్నది. ఒప్పో గత సంవత్సరం రెనో ఏస్‌తో 65W చూపించింది మరియు ఈ సంవత్సరం ఇది మరింత వేగంగా ఉండవచ్చు. ఇది ఇప్పటివరకు వేగవంతమైన VOOC వైర్‌లెస్ ఫ్లాష్ ఛార్జింగ్ ఫోన్. ఈ పరికరం వైర్‌లెస్ రివర్స్ ఛార్జింగ్‌కు కూడా మద్దతు ఇస్తుంది.

Best Mobiles in India

English summary
Oppo Reno 2 Specifications Leaked

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X