భారతీయులు బిచ్చగాళ్లు, చిక్కుల్లో చైనా కంపెనీ?

ప్రముఖ చైనా ఫోన్‌ల కంపెనీ ఒప్పో ఓ వివాదంలో ఇరుక్కుంది. ఒప్పో పంజాబ్ సర్వీస్ సెంటర్‌లో విధులు నిర్వహిస్తోన్న పలువురు ఉద్యోగుల పేరుతో పోస్ట్ అయిన లేఖ దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది.

ఇంకా చదవండి ఉచితంగా జియో 4జీ ఫోన్, 24 నుంచి బుకింగ్స్, రూ.153కే అనిలిమిటెడ్ కాల్స్, ఇంటర్నెట్

భారతీయులు బిచ్చగాళ్లు, చిక్కుల్లో చైనా కంపెనీ?

కంపెనీ పై అధికారులు తమను బిచ్చగాళ్లుగా పేర్కొన్నట్లు ఈ లేఖలో వారు ఆరోపించారు. ఈ కారణంగానే తాము విధుల నుంచి తప్పుకుంటున్నట్లు ఈ లేఖలో ఉంది. సోషల్ మీడియాలో విస్తృతంగా చక్కర్లు కొడుతోన్న ఈ లేఖ పై ఒప్పో ఇండియా స్పందించింది.

ఈ లేఖ పూర్తిగా నిరాధారమని కేవలం సమాచార లోపం కారణంగానే ఇలా జరిగిందని ఒప్పో ఇండియా చెప్పుకొచ్చింది. తమ సర్వీసింగ్ సెంటర్‌లో ఏ ఒక్కరూ రిజైన్ చేయలేదని ఒప్పో తెలిపింది. ట్విట్టర్‌లో ముందుగా పోస్ట్ అయిన ఈ అనుమానాస్పద లెటర్ సదురు సర్వీసింగ్ సెంటర్‌లో పని చేస్తోన్న ఉద్యోగి పేరు మీదే ఉండటం విశేషం.

ఇంకా చదవండి జియోఫోన్ లాంచ్ అయ్యింది, అందరికి ఉచితం, పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి

English summary
Oppo Punjab service team quits over ‘Indians are beggars’ insult, company claims. Read More in Telugu Gizbot...
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting