ఆపిల్, మైక్రోసాప్ట్‌లకు షాక్..ఒరాకిల్‌కు భారీ షాక్

Written By:

దిగ్గజ కంపెనీలకు కష్టాలు తప్పడం లేదు.. భారీ ఫైన్లతో అల్లాడుతున్నాయి. ఉల్లఘంన కేసులో ఒరాకిల్ ను భారీ నష్టపరిహారం వేధిస్తుండగా...ఆపిల్ కంపెనీని టెక్నాలజీ చౌర్యం కేసు వేధిస్తోంది. ఇక విండోస్ 10తో మైక్రోసాఫ్ట్ కు భారీ నష్టపరిహారంతో తలబొప్పి కట్టించుకుంది. ఒక్కో కేసులో ఒక్కో కంపెనీ కోట్ల రూపాయలను పరిహారంగా చెల్లించింది. ఏ కంపెనీ ఏ కేసులో చిక్కుకుని విలవిలలాడిందో మీరే చూడండి.

మృత్యు లోయలో మిస్టరీగా మారిన కదిలే రాళ్లు

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఒరాకిల్ కష్టాలు

హెచ్ పీ ఇటానియం సర్వర్ కేసులో హెచ్ పీ ఎంటర్ ప్రైజెస్ కు 20 వేల కోట్లకు పైగా (300 కోట్ల డాలర్లు) నష్టపరిహారం చెల్లించాలని ఒరాకిల్ ను జ్యూరీ ఆదేశించింది. 2012లోనే ఈ కేసుపై మొదటి దశ ట్రయల్ నడిచింది.

ఒరాకిల్ కష్టాలు

హెచ్ పీ ఇటానియం ఆధారిత సర్వర్లతో ఒరాకిల్ సాప్ట్ వేర్ డెవలప్ చేసే ఒప్పందాన్ని ఉల్లఘించడంతో ఈ కేసు ప్రారంభమైంది. కాంట్రాక్ట్ ఉల్లంఘన కేసును ఒరాకిల్ పై హెచ్ పీ నమోదుచేసింది.

ఒరాకిల్ కష్టాలు

ఇటానియం ప్రాసెసర్ ను ఇంటెల్ ఇంక్ తయారుచేసింది. ఈ చిప్ కు కాలం చెల్లిపోవడంతో, 2011లో ఒరాకిల్ సాప్ట్ వేర్ డెవలప్ చేయడం ఆపివేసింది. అయితే అగ్రిమెంట్ ప్రకారం ఆ చిప్ వాడుకలో ఉన్నా లేకపోయినా ఒరాకిల్ హెచ్ పీకి సపోర్టు చేయడం కొనసాగించాలని హెచ్ పీ వాదించింది.

ఒరాకిల్ కష్టాలు

ఈ చిప్ కు కాలం చెల్లడంతోనే ఎక్స్ 86 మైక్రో ప్రాసెసర్లపై దృష్టిసారించామని ఇంటెల్ సైతం స్పష్టంచేసింది. అయినా హెచ్ పీ ఈ కేసుపై కోర్టు గడపతొక్కింది. అయితే ఈ తీర్పుపై తాము అప్పీల్ కు వెళ్తామని ఒరాకిల్ చెబుతోంది. మేము న్యాయబద్దంగానే నడుచుకుంటున్నామని వాదిస్తోంది.

ఆపిల్ కు తప్పని చిక్కులు

ఆపిల్ కంపెనీ కూడా టెక్నాలజీ చౌర్యానికి పాల్పడిందనే ఓ వ్యకి కోర్టులో దావా వేసాడు. తాను 1992లోనే రూపొందించిన ‘ఎలక్ట్రానిక్ రీడింగ్ డివైస్ (ఈఆర్‌డీ)' సాంకేతిక పరిజ్ఞానాన్ని కొల్లగొట్టి ఆపిల్ కంపెనీ ఐఫోన్లు, ఐపాడ్లు, ఐప్యాడ్లు రూపొందించిందని ఆరోపిస్తూ ఫ్లోరిడాకు చెందిన థామస్ రాస్ అనే వ్యక్తి కంపెనీపై వెయ్యి కోట్ల డాలర్లకు దావా వేశారట.

ఆపిల్ కు తప్పని చిక్కులు

ఈ కేసులో కనుక థామస్ రాస్ నిజంగా గెలిస్తే వెయ్యి కోట్ల డాలర్లతోపాటు ఏడాదికి 350 కోట్ల డాలర్లను ఆపిల్ కంపెనీ చెల్లించాల్సి ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

ఆపిల్ కు తప్పని చిక్కులు

నవలలు, వ్యాసాలు చదువుకోవడానికి, వీడియోలు చూడడానికి, ఫొటోలు బ్రౌజ్ చేయడానికి థామస్ రాస్ ఎలక్ట్రానిక్ రీడింగ్ డివైస్‌కు రూపకల్పన చేశారట. తన డిజైన్ పేటెంట్ కోసం 1992లో అమెరికా పేటెంట్, ట్రేడ్ మార్క్ కార్యాలయానికి దరఖాస్తు కూడా చేసుకున్నారట.

ఆపిల్ కష్టాలు

అప్పటికి ఆపిల్ కంపెనీకి చెందిన ఐఫోన్ తొలి మోడల్ కూడా విడుదల కాలేదు. పేటెంట్‌కు నిర్దేశించిన ఫీజును థామస్ చెల్లించకపోవడంతో 1995లో అమెరికా పేటెంట్ కార్యాలయం ఆయన దరఖాస్తును తిరస్కరించిందట.

మైక్రోసాఫ్ట్ చిక్కులు

మైక్రోసాఫ్ట్ విండోస్ 10తో కష్టాలను కొని తెచ్చుకుంది.కాలిఫోర్నియా సాసాలిటోకు చెందిన మహిళ టెరీ గోల్డ్ స్టీన్ మైక్రోసాఫ్ట్ తమను విండోస్ 10 అప్ గ్రేడ్ చేసుకోమని బలవంత పెడుతోందంటూ పెట్టిన కేసులో కోర్టు తీర్పు వెలువరించింది.

మైక్రోసాఫ్ట్ చిక్కులు

తాజాగా వెలువడ్డ తీర్పులో ఆమెకు మైక్రోసాఫ్ట్ 10 వేల డాలర్డు అంటే సుమారు 7 లక్షల రూపాయలను చెల్లించాలని ఆదేశించింది. కోర్టు తీర్పుతో మైక్రోసాఫ్ట్ కంపెనీ టెరీకి పరిహారం చెల్లించాల్సి వచ్చింది.

మైక్రోసాఫ్ట్ చిక్కులు

ఓ ట్రావెల్ ఏజెన్సీని నడుపుతున్న టెరీ.. తన కంప్యూటర్లో విండోస్ 7 తో పనిచేస్తోంది. అయితే ఆమె చేసుకోకుండానే విండోస్ 10 అప్ డేట్ అయిపోవడంతో ఆగ్రహించిన ఆమె మైక్రోసాఫ్ట్ కంపెనీ తీరుపై కోర్టులో కేసు వేసింది.

మైక్రోసాఫ్ట్ చిక్కులు

విండోస్ 10 అప్ డేట్ వల్ల కంప్యూటర్ పనిచేయడం మానేసిందని, తన వ్యాపార కార్యకలాపాలకు తీవ్ర అంతరాయం కలిగిందని కోర్టుకు విన్నవించింది. అందుకు పరిహారంగా 17 వేల డాలర్లు చెల్లించాలని డిమాండ్ చేసింది. కేసును విచారించిన కోర్టు.. సదరు మహిళకు 10 వేల డాలర్లు నష్టపరిహారం చెల్లించాలని తీర్పు ఇవ్వడంతో సంస్థ చెల్లించక తప్పని పరిస్థితి ఏర్పడింది.

 

 

గిజ్‌బాట్ పేజీని లైక్ చేయండి

టెక్నాలజీకి సంబంధించి లేటెస్ట్ అప్‌డేట్ కోసం క్లిక్ చేయండి.

https://www.facebook.com/GizBotTelugu/

 

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here Write Oracle ordered to pay HP 3 billion in Itanium case
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot