2021 OTT ప్లాట్‌ఫారమ్‌లలో పోటీ ఏ రేంజ్ లో ఉండనుందో గమనించండి!!

|

కరోనా మహమ్మారి సమయంలో ప్రజలు ఇంటి వద్దనే ఉండడంతో ఓవర్-ది-టాప్ (OTT) ప్లాట్‌ఫాంలు అధికంగానే ప్రజాదరణను పొందాయి. ఈ ప్లాట్‌ఫారమ్‌లలో లభించే ప్రత్యేకమైన కంటెంట్‌తో ప్రేక్షకులను ఇంటివద్దనే ఉండే విధంగా కట్టిపడేశాయి. గత సంవత్సరం డిస్నీ + హాట్‌స్టార్ ఇండియాలోకి ప్రవేశించడంతో దేశంలోని అతిపెద్ద ప్లాట్‌ఫామ్‌లలో ఒకటిగా మారింది. అయితే పోటీగా ఈ సంవత్సరం మరికొన్ని యాప్ లు రానున్నట్లు సమాచారం. ఈ పోటీ ప్లాట్‌ఫారమ్‌లలో ఉన్న పోటీని మరింత మెరుగుపరుస్తుంది. 2021 లో ఇండియాలో OTT ప్రపంచాన్ని శాసించనున్న యాప్ ల గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

 

Netflix

Netflix

OTT ప్లాట్‌ఫారమ్‌లలో వినియోగదారులతో సంబంధం లేకుండా నెట్‌ఫ్లిక్స్ అతి పెద్ద యూజర్ బేస్ తో కొనసాగుతుందనడంలో ఎటువంటి సందేహం లేదు. నెట్‌ఫ్లిక్స్ ఇతర OTT ప్లాట్‌ఫారమ్‌ల కంటే ఖరీదైనది అయినప్పటికీ కంటెంట్ లైబ్రరీ మిగిలిన వారితో పోలిస్తే అధికంగా ఉండడం వలన దీనికి అత్యధిక డిమాండ్ ఉంది. ఇంకా ఇది 'ఫ్రెండ్స్' మరియు మరెన్నో ప్రసిద్ధ టెలివిజన్ షోలను పంపిణీ చేసే హక్కులను కొనుగోలు చేసింది.

Amazon Prime Video

Amazon Prime Video

అమెజాన్ ప్రైమ్ సబ్స్క్రిప్షన్ సమర్పణలో ప్యాక్ చేయబడిన వీడియోలు చాలా సంవత్సరాలుగా ప్రజాదరణను పొందాయి. ముఖ్యంగా ఇప్పుడు భారతదేశంలో 'మిర్జాపూర్', 'ఫోర్ మోర్ షాట్స్' వంటి మరిన్ని షోలు వినియోగదారుల దృష్టిని మరింత ఆకర్షించాయి. అమెజాన్ ప్రైమ్ వీడియో భారతీయుల కోసం 'షార్క్ ట్యాంక్' ప్రసిద్ధ టీవీ షోలతో పాటు టన్నుల కొద్దీ ప్రాంతీయ కంటెంట్‌ను కూడా అందిస్తుంది.

Disney+ Hotstar
 

Disney+ Hotstar

ఇండియాలో గత సంవత్సరం OTT ప్లాట్‌ఫామ్‌లో మొదలైన డిస్నీ+హాట్స్టార్ ఇప్పటికే మిలియన్ల సబ్స్క్రిప్షన్ లను అందుకుంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) ను ప్రసారం చేసే హక్కులను పొందడంతో పాటుగా వివిధ టెలికాం ఆపరేటర్లతో భాగస్వామ్యం చేయడంతో OTT ప్లాట్‌ఫామ్‌లో సబ్స్క్రిప్షన్ బేస్ మరింత పెరగడంలో చాలా సహాయపడింది. ఇది టెలివిజన్ షోలైన 'హౌ ఐ మెట్ యువర్ మదర్', 'వెస్ట్‌వరల్డ్' వంటి మరెన్నో భారతీయ వినియోగదారుల నుండి చాలా ట్రాక్షన్‌ను పొందింది.

ఆపిల్ టీవీ +

ఆపిల్ టీవీ +

OTT ప్లాట్‌ఫారమ్‌లలో ఆపిల్ టీవీ +, HBO మాక్స్, డిస్కవరీ + మరియు బుక్‌మైషో స్ట్రీమ్ వంటి నాలుగు యాప్ లు కూడా ఈ సంవత్సరంలో అధిక సంఖ్యలో ప్రజాదరణను పొందే అవకాశం ఉన్నట్లు భావిస్తున్నాము. ఆపిల్ టీవీ + ఒరిజినల్ కంటెంట్‌ను మాత్రమే అందిస్తుంది. అయితే ఇప్పుడు ఇది నెమ్మదిగా దాని షోలు మరియు మూవీ లైబ్రరీని నిర్మిస్తోంది. దీని ధర కూడా చాలా తక్కువ నెలకు రూ.99 నుండి ప్రారంభం అవుతుంది.

HBO మాక్స్‌

HBO మాక్స్‌

HBO మాక్స్‌ OTT ప్లాట్‌ఫారమ్‌లలో టీవీ కార్యక్రమాలు మరియు ప్రజలు ఇష్టపడే సినిమాలతో కూడిన టన్నుల కంటెంట్ ఉంది. ఇందులో భారీ లైబ్రరీ కంటెంట్ ఉన్నందున వినియోగదారులు ఎంచుకోవడానికి చాలా ఎంపికలు లభిస్తాయి. అయితే ఇందులో ఒక విషయం ఏమిటంటే ఈ ప్లాట్‌ఫాం భారతదేశంలో ఇంకా అందుబాటులో లేదు. అయితే ఇది ఈ సంవత్సరం చివరలో వచ్చే అవకాశం ఉంది.

 

డిస్కవరీ + OTT ప్లాట్‌ఫారమ్‌లలో విషయానికి వస్తే ఇది చాలా ప్రత్యేకమైన విద్యా మరియు వినోదాత్మక కంటెంట్‌ను అందిస్తుంది. ఇది దాని ప్రత్యేకమైన అమ్మకపు ధరలో దీనికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఈ సంవత్సరం ఈ ప్లాట్‌ఫాంలో స్థానిక కంటెంట్‌ను కూడా అందించే ఆలోచనలో ఉంది. ఇది భారతదేశంలో దాని భవిష్యత్తును మరింత మెరుగు పరచనున్నది.

బుక్‌మైషో స్ట్రీమ్‌

బుక్‌మైషో స్ట్రీమ్‌

OTT ప్లాట్‌ఫారమ్‌లలోకి ఇటీవల బుక్‌మైషో స్ట్రీమ్‌ కూడా ప్రవేశించింది. ఇది పేమెంట్ వీడియో-ఆన్-డిమాండ్ (VOD) ప్లాట్‌ఫాం. కావున ఇక్కడ వినియోగదారులు వారు చూడాలనుకుంటున్న సినిమాలను కొనుగోలు చేయవచ్చు లేదా అద్దెకు తీసుకోవచ్చు. 600 కి పైగా టైటిల్స్ టెనెట్ హాలీవుడ్ మరియు బాలీవుడ్ బ్లాక్ బస్టర్స్ సినిమాలు ఈ వేదికలో ఉన్నాయి. ఇది ప్రతి శుక్రవారాలలో వినియోగదారులకు 'ప్రీమియర్‌లకు' యాక్సిస్ ను అందిస్తుంది. ఇది వినియోగదారులకు వారి ఇంటిలోనే థియేటర్ అనుభవాన్ని అందివ్వడానికి సహాయపడుతుంది.

Best Mobiles in India

English summary
OTT Platforms Competition Increased in India on 2021

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X