రూ.1200 విలువైన OTT చందాలను ఉచితంగా అందిస్తున్న Tata Sky Binge
ఇండియాలోని డిటిహెచ్ ఆపరేటర్లలో ఒకటైన టాటా స్కై తన వినియోగదారులకు అందిస్తున్న వివిధ రకాల సర్వీసులలో ఒకటైన బింగే కొన్ని OTT లకు ఉచిత యాక్సిస్ ను అందిస్తుంది. ఇందులో ఎటువంటి అదనపు ఖర్చు లేకుండా అమెజాన్ ఫైర్ టివి స్టిక్ మరియు టాటా స్కై ఎడిషన్‌ను ఉచితంగా అందిస్తుంది. టాటా స్కై బింగే నెలకు రూ.299 ధర వద్ద లభిస్తుంది.

టాటా స్కై డిటిహెచ్ ఆపరేటర్ ప్రస్తుతం 11 OTT సర్వీసులకు ఉచిత యాక్సిస్ ను అందిస్తోంది. టాటా స్కై బింగే + ఆండ్రాయిడ్ టివి సెట్-టాప్ బాక్స్‌ను కొనుగోలు చేసే వినియోగదారులకు ఆరు నెలల పాటు బింగే సర్వీస్ ఉచితంగా లభిస్తుంది. టాటా స్కై బింగేతో ఉచితంగా లభించే OTTలలో అమెజాన్ ప్రైమ్ వీడియో, డిస్నీ + హాట్‌స్టార్ ప్రీమియం, సోనీలైవ్ వంటివి మరిన్ని ఉన్నాయి. వీటి గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

టాటా స్కై బింగే ఉచిత OTT సబ్స్క్రిప్షన్
టాటా స్కై బింగేను OTT సర్వీసులకు విడిగా చెల్లించే వినియోగదారులను లక్ష్యంగా చేసుకొని 2019 మధ్యలో ప్రవేశపెట్టారు. ఈ DTH ఆపరేటర్ 11 OTT సబ్స్క్రిప్షన్స్ లను ఒక ప్యాకేజీగా ‘టాటా స్కై బింగే' పేరుతో అందిస్తున్నారు. ఈ OTT సభ్యత్వాలను టాటా స్కై వినియోగదారులకు 3,999 రూపాయల విలువైన అమెజాన్ ఫైర్ టివి స్టిక్ ఎడిషన్‌లో పూర్తిగా ఉచితంగా అందిస్తోంది. ఈ ఫైర్ టీవీ స్టిక్ ను కస్టమర్ యొక్క టీవీకి కనెక్ట్ చేసి OTT చందాలను టాటా స్కై అకౌంటుతో లాగిన్ అయి యాక్సిస్ చేయవచ్చు.

టాటా స్కై తన బింగే సర్వీసుతో అందించే ఉచిత OTT చందాలను మీరు ఒక్కొక్కటిగా ఎంచుకుంటే కనుక మీకు రూ.1,200 కంటే అధికంగా ఖర్చు అవుతుంది. టాటా స్కై బింగే అందించే ఉచిత OTT సేవలలో అమెజాన్ ప్రైమ్ వీడియో (మొదటి మూడు నెలలు మాత్రమే), డిస్నీ + హాట్‌స్టార్ ప్రీమియం, సోనీలైవ్, ZEE5, SunNXT, వూట్ సెలెక్ట్, క్యూరియాసిటీ స్ట్రీమ్, వూట్ కిడ్స్, ఈరోస్ నౌ, హంగామా ప్లే మరియు షెమరూమీలు ఉన్నాయి.

OTT యాప్ సబ్స్క్రిప్షన్ ధరలు
టాటా స్కై అందించే ఈ OTTలను ఎవరైనా కస్టమర్ వ్యక్తిగతంగా ఎంచుకుంటే కనుక అమెజాన్ ప్రైమ్ చందా ధర నెలకు రూ.129, డిస్నీ + హాట్‌స్టార్ ప్రీమియం నెలకు రూ .299, మరియు Zee5 ఆల్ యాక్సెస్ ప్యాక్ మరియు SunNXT ప్లాన్ ధర నెలకు రూ .99. స్కామ్ 1992 వెబ్ సిరీస్‌ను ఇష్టపడే వారు సోనీలైవ్ ను నెలకు రూ.99 ధర వద్ద పొందవచ్చు. ఈరోస్ నౌ, హంగమా ప్లే, వూట్ సెలెక్ట్, వూట్ కిడ్స్, క్యూరియాసిటీ స్ట్రీమ్ మరియు షెమరూమీ వంటి అన్ని సేవలు రూ.49 నుంచి రూ.199 మధ్య ఖర్చవుతాయి. వీటిని సరిగ్గా గమనిస్తే కనుక మొదటి మూడు నెలల చందాలు 1,200 రూపాయలు దాటాయి. అమెజాన్ ప్రైమ్ చందా మొదటి మూడు నెలలకు మాత్రమే చెల్లుతుందని గమనించండి. ఆ తర్వాత కూడా వినియోగదారులకు దీని యాక్సిస్ ను పొందాలి అనుకుంటే కనుక నెలకు రూ.129 చొప్పున కొనుగోలు చేయవలసి ఉంటుంది.


Click it and Unblock the Notifications








