హ్యాకింగ్ భారీన 100 మిలియన్ ప్రొఫైల్స్

Written By:

లింక్డ్ ఇన్ ప్రొఫైల్ గురించి ఈ రోజుల్లో తెలియని వారుండరు. మంచి ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న ఉన్నత విద్యావంతులు అలాగే జాబ్స్ ఆఫర్ చేసే కంపెనీలు అన్ని వర్గాలకు చెందిన సమాచారం ఇక్కడ ఉంటుంది. అయితే ఈ ప్రముఖ సోషల్ ఫ్లాట్ ఫాం ఇప్పుడు ప్రమాదంలో చిక్కుకుంది. అన్ని అకౌంట్లు హ్యాక్ అయ్యాయని కంపెనీ అంగీకరించింది. దీంతో పాటు కొన్ని జాగ్రత్తలను సూచించింది.

Read more: ఓ చిన్న డ్రోన్ 55 విమానాలకు చుక్కలు చూపించింది

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

హ్యాకింగ్ భారీన 100 మిలియన్ ప్రొఫైల్స్

లింక్డ్ ఇన్ కు సంబంధించిన దాదాపు 10కోట్ల( 100 మిలియన్ ప్రొఫైల్స్)కు పైగా ఖాతాలు హ్యాకింగ్‌కు గురయ్యాయని తాజా నివేదికలు వెల్లడి చేశాయి. 100 మిలియన్‌ లింక్డ్ ఇన్ ప్రొఫైళ్లకు చెందిన ఈమెయిల్‌ డాటాబేస్‌లు, పాస్‌వర్డ్‌లు హ్యాక్‌ అయ్యాయని అవి ఆన్‌లైన్‌లో అందరికీ కనిపించేలా అందుబాటులోకి వచ్చాయని ఈ నివేదికలు చెబుతున్నాయి.

హ్యాకింగ్ భారీన 100 మిలియన్ ప్రొఫైల్స్

దీంతో అప్రమత్తమైన సంస్థ, 167 మిలియన్ల ప్రొఫైల్స్, వ్యక్తిగత వివరాలు హ్యాక్ అయ్యాయని అంగీకరించింది. స్వయంగా సంస్థ ప్రతి ఖాతాదారుడిని ఈమెయిల్స్ ద్వారా అలర్ట్ చేసింది. దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించింది.

హ్యాకింగ్ భారీన 100 మిలియన్ ప్రొఫైల్స్

ఈ మేరకు ఖాతాదారులను ఈ మెయిల్ ద్వారా అప్రమత్తం చేసింది. పాస్ వర్డ్స్ ను రద్దుచేశామని.. రీసెట్ చేసుకోవాలని కోరింది. 400 మిలియన్‌ యూజర్లకు పాస్‌వర్డ్‌ల విషయంలో బాధ్యతగా వ్యవహరించాలని బలమైన పాస్‌వర్డ్‌లు పెట్టుకోవాలని హెచ్చరికలు జారీ చేసింది.

హ్యాకింగ్ భారీన 100 మిలియన్ ప్రొఫైల్స్

మరోవైపు ఆస్ట్రేలియన్ సెక్యూరిటీ నిపుణుడు ట్రాయ్ హంట్ ఈ ఖాతాల సేఫ్టీని కనుగొనేందుకు సహాయపడేలా హేవ్ ఐ బీన్ పీఓన్డ్ అనే వెబ్ సైట్ ను క్రియేట్ చేశారు. దీని సహాయంతో మన ఖాతాను చెక్ చేసుకోవచ్చని సూచించారు.

హ్యాకింగ్ భారీన 100 మిలియన్ ప్రొఫైల్స్

కాగా 2009లో లాంచ్ అయిన లింక్డ్ ఇన్ 2012 లో హ్యాకింగ్ బారిన పడింది. 6.5 మిలియన్ల ప్రొఫైల్స్ ను రష్యాలోని సైబర్‌ క్రిమినల్స్‌ హ్యాక్‌ చేశారు.

హ్యాకింగ్ భారీన 100 మిలియన్ ప్రొఫైల్స్

ఆ తర్వాత సుమారు 4 సంవత్సరాల తర్వాత మళ్లీ ఇంత పెద్ద మొత్తంలో ప్రొఫైళ్లు హ్యాకవ్వడం ఇదే తొలిసారి అని సైబర్ నిపుణలు వ్యాఖ్యానించారు.

గిజ్‌బాట్ పేజీని లైక్ చేయండి

మీరు టెక్నాలజీకి సంబంధించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్ డేట్ పొందాలనుకుంటే ఇక్కడ క్లిక్ చేయండి.

https://www.facebook.com/GizBotTelugu/

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here Write Over 100 million LinkedIn profiles hacked: Here’s a quick way to find out if you’re one of them
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot