90 రోజుల్లో 60 లక్షల కొత్త వెబ్‌సైట్‌లు!

Posted By:

 90 రోజుల్లో 60 లక్షల కొత్త వెబ్‌సైట్‌లు!
అక్టోబర్ - డిసెంబర్ 2012 (మూడు నెలల) కాలపరిధికి సంబంధించి ప్రపంచవ్యాప్తంగా 60లక్షల కొత్త వెబ్‌సైట్‌లు రిజిస్టర్ అయినట్లు .కామ్
,.నెట్ గ్లోబల్ రిజిస్టరీ ఆపరేటర్ వెరిసైన్ (VeriSign) ఒక ప్రకటనలో వెల్లడించింది. దింతో ప్రపంచవ్యాప్తంగా రిజిస్టర్ అయిన వెబ్‌సైట్‌ల సంఖ్య 252 మిలియన్‌లకు చేరుకున్నట్లు సదరు సంస్థ పేర్కొంది. గడిచిన 8 త్రైమసికాల నుంచి కొత్త డొమైన్‌ల రిజిస్ట్రేషన్‌ల ప్రక్రియ 2శాతం మేర వృద్ధి సాధిస్తూ వస్తున్నట్లు సదరు సంస్థ తెలిపింది.

గూగుల్‌ ఉద్యోగులకు ఎన్ని సౌకర్యాలో....

వెబ్ కంపెనీని ప్రారంభించిన 15 ఏళ్ల బాలిక!

కేరళలోని కోజికోడ్ ప్రాంతానికి చెందిన శ్రీలక్ష్మి సురేష్(15) వెబ్ కంపెనీని స్థాపించి చరిత్ర సృష్టించారు. ఈ బాలిక ఎనిమిది సంవత్సరాల వయస్సులోనే తాను చదువుకుంటున్న స్కూల్‌కు సంబంధించి ఓ వెబ్‌సైట్‌ను వృద్ధిచేసి అప్పట్లోనే సంచలనంగా నిలిచింది.

వివరాల్లోకి వెళితే.... ప్రెజంటేషన్ హయ్యర్ సెకండరీ పాఠశాలలో పదో తరగతి చదువున్న లక్ష్మి సరేష్ మరో ఆరుగురు విద్యార్థులతో కలిసి వైగ్లోబ్స్ ( YGlobes) పేరుతో వెబ్ డిజైనింగ్ కంపెనీని యూఎల్ సైబర్ పార్క్‌లో ప్రారంభించటం జరిగింది. ఈ తాజా వెంచర్‌తో శ్రీలక్ష్మి ప్రపంచపు అతిచిన్న సిఈఓలలో ఒకరిగా గుర్తింపు తెచ్చుకున్నారు. వెబ్ డిజైనింగ్ విభాగంలో శ్రీలక్ష్మి రాణిస్తున్నతీరు ప్రపంచ దేశాలను ఆకర్షిస్తోంది.

వెబ్ డిజైనింగ్ విభాగంలో ప్రత్యేక నైపుణ్యాలను కనబరస్తూ జాతికి గర్వకారణంగా నిలిచిన శ్రీలక్ష్మి అసోసియేషన్ ఆఫ్ అమెరికర్ వెబ్ మాస్టర్స్ సభ్యత్వంతో పాటు 30 అవార్డులను అందుకున్నారు. జూలై నుంచి కంపెనీ కార్యకలాపాలు ప్రారంభమవుతాయని శ్రీలక్ష్మి ఓ వార్తా పత్రికను ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. ఈ వెంచర్ నిమిత్తం పెట్టబడి వ్యయాన్ని రూ.50 లక్షలుగా అంచనా వేస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot