ప్రపంచాన్నే టార్గెట్ చేసిన పాకిస్తాన్

By Hazarath
|

కుట్రలు.. కుతంత్రాలు... వెన్నుపోటు...ఒప్పందాల ఉల్లంఘన.. వీటన్నింటికీ కేరాఫ్ అడ్రస్ పాకిస్థాన్.. పైకి ప్రపంచ శాంతి అంటుంది..లోపల మాత్రం ప్రపంచాన్నే పేల్చేసే కుట్ర చేస్తుంది. భారత్ తో సరిహద్దులో ఉన్న పాకిస్థాన్ ఇప్పటికీ లెక్కలేనన్నీ సార్లు కాల్పులకు తెగబడింది.. అనేక మంది జవాన్లను పొట్టనబెట్టుకుంది. ఈ ఒక్క విషయంలోనే కాదు.. ప్రతి విషయంలో పాక్ తోక వంకరే... ఆమధ్య భారత ప్రధాని నరేంద్ర మోదీతో చేసుకున్న ఒప్పందాలన్నీ గాలికొదిలేసి మళ్లీ పాత పంథానే అనుసరిస్తోంది పాపిస్థాన్.
Read more: సెల్ఫీతో పండగ చేసుకుంటున్న పేలు

 

భయంకర నిజాన్ని దాచిన పాకిస్తాన్

భయంకర నిజాన్ని దాచిన పాకిస్తాన్

పాక్ బుద్ది మారదని అందరికీ తెలుసు. కానీ ఈ మధ్య పాకిస్థాన్ మరో భయంకరమైన విషయాన్ని ప్రపంచదేశాలకు తెలియకుండా దాచిపెట్టింది.

చాపకింద నీరులా పాకుతోంది

చాపకింద నీరులా పాకుతోంది

అణుబాంబుల తయారీ, పరీక్షల నిషేదం ఉన్నా... అదేమీ పట్టనట్లు లోలోపల అనుకున్న వ్యూహాలు రచిస్తూ.. చాపకింద నీరులా పాకుతోంది.

వాషింగ్టన్ పోస్ట్ చెప్పింది.

వాషింగ్టన్ పోస్ట్ చెప్పింది.

ఈవిషయం మనం చెప్పింది కాదు.. వాషింగ్టన్ పోస్ట్ చెప్పింది. ఇటీవల వాషింగ్టన్ పోస్ట్ ప్రచురించిన ఓ సంచలన కథనంతో ఈ విషయం ప్రపంచ దేశాలకు తెలిసింది.

అత్యధిక అణు బాంబులను కలిగి ఉన్న దేశంగా పాకిస్తాన్
 

అత్యధిక అణు బాంబులను కలిగి ఉన్న దేశంగా పాకిస్తాన్

మరో పదేళ్లలో అమెరికా, రష్యాల తర్వాత అత్యధిక అణు బాంబులను కలిగి ఉన్న దేశంగా పాకిస్తాన్ నిలుస్తుందని వాషింగ్టన్ పోస్టు తెలిపింది.

భారీ ఎత్తున అణ్వస్త్రాల తయారీకి పాక్ ప్రణాళికలు

భారీ ఎత్తున అణ్వస్త్రాల తయారీకి పాక్ ప్రణాళికలు

భారీ ఎత్తున అణ్వస్త్రాల తయారీకి పాక్ ప్రణాళికలు రూపొందించిందని `ఏడాదికి 20 అణు బాంబులను తయారు చేసి దాచుకుంటోందని వెల్లడించింది.

350 అణు ఆయుధాలు

350 అణు ఆయుధాలు

వేలకొద్ది బాంబులు ఒకేసారి వేస్తే వచ్చేంత శక్తితో కూడుకున్న 350 అణు ఆయుధాలను పాకిస్థాన్ తయారు చేయనున్నదని వివరించింది.

2025 నాటికి టాప్-3లో పాకిస్తాన్

2025 నాటికి టాప్-3లో పాకిస్తాన్

2025 నాటికి ప్రపంచంలో అత్యధిక అణు బాంబులు ఉన్న దేశాల్లో పాకిస్తాన్ టాప్-3లో నిలవనుందని వాషింగ్టన్ పోస్ట్ అంచనా వేసింది.

ఇండియా పేరు వింటేనే చాలు భయపడుతున్న పాకిస్తాన్

ఇండియా పేరు వింటేనే చాలు భయపడుతున్న పాకిస్తాన్

ఇండియా పేరు వింటేనే చాలు భయపడుతున్న పాకిస్తాన్ శరవేగంగా అణు సామర్థాయన్ని పెంచుకుంటోంది అంటూ కార్నేజ్ ఎండోమెంట్స న్యూక్లియర్ పాలసీ ప్రోగ్రామ్ కో-డైరెక్టర్ టోబీ డాల్టన్, స్టిమ్సన్ సెంటర్ సహ వ్యవస్థాపకుడు మైఖేల్ క్రిపాన్ ఓ ప్రత్యేక కథనం రాశారు.

పాక్ వద్ద 120 ,ఇండియా వద్ద 100

పాక్ వద్ద 120 ,ఇండియా వద్ద 100

ఇప్పటికే అణు బాంబుల విషయంలో భారత్ ను పాకిస్తాన్ అధిగమించింది. ప్రస్తుతం పాక్ వద్ద 120 న్యూక్లియర్ వార్హెడ్స్ ఉండగా, ఇండియా వద్ద 100 మాత్రమే ఉన్నాయి.

పాకిస్తాన్ నీచబుద్ధి

పాకిస్తాన్ నీచబుద్ధి

అయితే, పాకిస్తాన్ తక్కువ ప్రభావం చూపే యురేనియం వార్హెడ్లతోనే సరిపెట్టుకుంటోందని, భారత్ మాత్రం భారీ ఎత్తున విధ్వంసం చేయగల ప్లుటోనియం వార్హెడ్ల తయారీలో ఉంది' అని వారు వివరించారు.

స్పష్టం చేసిన వాషింగ్టన్ పోస్టు

స్పష్టం చేసిన వాషింగ్టన్ పోస్టు

అయితే అటామిక్ టెక్నాలజీ విషయంలో పాకిస్తాన్ కంటే భారతదేశమే మెరుగ్గా ఉందని వాషింగ్టన్ పోస్టు తన కథనంలో స్పష్టం చేసింది..

పాకిస్తాన్ భవిష్యత్ లో విరుచుకు పడినా ఆశ్యర్యం లేదు

పాకిస్తాన్ భవిష్యత్ లో విరుచుకు పడినా ఆశ్యర్యం లేదు

పాకిస్తాన్ కు ధీటుగా ఇండియా కూడా ఆయుధసామాగ్రిని సమకూర్చుకోవాలి.లేకుంటే పాకిస్తాన్ భవిష్యత్ లో విరుచుకు పడినా ఆశ్యర్యం లేదు  

 ప్రపంచ దేశాలకే పాకిస్తాన్ సవాల్

ప్రపంచ దేశాలకే పాకిస్తాన్ సవాల్

రానున్న కాలంలో ప్రపంచ దేశాలకే పాకిస్తాన్ సవాల్ విసురి అవకాశం లేకపోలేదు

Best Mobiles in India

English summary
Pakistan could become the third largest nuclear stock pile within the next five to ten years, behind only the United States and Russia, the Washington Post reported, quoting reports published by two American think tanks.

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X