సెల్ఫీతో పండగ చేసుకుంటున్న పేలు

By Hazarath
|

సెల్ఫీ.. ఈ పదం కొత్తగా అనిపించవచ్చు. కానీ ఇప్పుడు ప్రపంచం మొత్తం చిన్నా, పెద్ద, యువత సెల్ఫీ మోజులో మునిగి తేలుతోంది. సెల్ఫీలతో నేటి యువతకు ఆనందానికి హద్దులు లేకుండాపోతుంది. ఇటీవల ఈ సెల్ఫీలకు ఆధారణ ఎక్కువగా పెరిగింది. ఎక్కడ పడితే అక్కడ ఒకరిద్దరు, గుంపుగా చేరి మొబైల్ ఫోన్లతో సెల్ఫీ ఫోటోలు దిగుతున్నారు. సెల్ఫీ మోజులో ప్రాణాలమీదకు తెచ్చుకున్న సంఘటనలూ అనేకం జరుగుతున్న యువత మాత్రం వాటికి దూరంగా ఉండకుండా ఉండలేకపోతుంది.అయితే సెల్ఫీతో మా బతుకు పండగేనంటున్నాయి పేలు.అదెలాగంటారా..అయితే వార్తను చూసేయండి మరి.

 

Read more : గృహ నిర్భంధంలో నాసా శాస్ర్తవేత్తలు

తలలో పేలు ఒకరి నుంచి ఒకరికి పాకే ప్రమాదం

తలలో పేలు ఒకరి నుంచి ఒకరికి పాకే ప్రమాదం

సెల్పీతో మంచి విషయం పక్కనపెడితే సెల్ఫీలు తీసుకోవడం వలన తలలో పేలు ఒకరి నుంచి ఒకరికి పాకే ప్రమాదం ఉందని డాక్టర్లు సూచిస్తున్నారు.

తలలను దగ్గరగా చేర్చి సెల్ఫీకి పోజులు

తలలను దగ్గరగా చేర్చి సెల్ఫీకి పోజులు

సెల్ఫీలు తీసుకునే సమయంలో యువత ఒకరిపై ఒకరు వాలి, తలలను దగ్గరగా చేర్చి సెల్ఫీకి పోజులిస్తున్నారు. ఆ సమయంలో ఒకరి తల నుంచి మరొకరికి పేలు పాకుతున్నాయి. కనుక సెల్ఫీలు తీసుకునే వారు ఒకరి తల మరొకరికి తగలని విధంగా పోజు ఇవ్వాలని వైద్యులు సూచిస్తున్నారు.

చుండ్రు ఏర్పడే ప్రమాదం
 

చుండ్రు ఏర్పడే ప్రమాదం

ఈ విధంగా సెల్ఫీలు తీసుకునే అమ్మాయిలకు తలలో ఎక్కువగా పేలు పెరగడం, చుండ్రు ఏర్పడే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

అత్యధికంగా సెల్ఫీ తీసుకోవడం ద్వారా మానసిక సమస్యలు

అత్యధికంగా సెల్ఫీ తీసుకోవడం ద్వారా మానసిక సమస్యలు

సామాజిక మాధ్యమాలలో తమ ఫోటోలను అప్ చేయడం, తద్వారా వచ్చే లైక్స్ వంటివే యువతను సెల్ఫీల ఊబిలోకి నెడుతున్నట్టు తాజా సమాచారం తెలుస్తోంది. అత్యధికంగా సెల్ఫీ తీసుకోవడం కూడా మానసిక సమస్యలు ఏర్పడతాయని అమెరికా వైద్యులు వెల్లడించారు.

అనేక ప్రమాదాలు

అనేక ప్రమాదాలు

అదే విధంగా ఎతైన ప్రదేశాల్లో సెల్ఫీ తీసుకుంటున్న సమయంలో కాలుజారి మరణించిన సంఘటనలు జరుగుతున్నాయి.

వైద్యుల హెచ్చరిక

వైద్యుల హెచ్చరిక

కాబట్టి సెల్ఫీలు తీసుకుంటున్న సమయంలో జాగ్రత్తలు వహిస్తే ఇలాంటి వాటిని నివారించవచ్చని వైద్యులు సూచిస్తున్నారు.

ప్రియాంక చోప్రాతో మొదలు

ప్రియాంక చోప్రాతో మొదలు

బాలీవుడ్ భామ ప్రియాంకా చోప్రా తొలి సెల్ఫీ పిక్చర్‍ ను ట్విట్టర్‍, ఫేస్ బుక్ లలో అప్ లోడ్ చేసింది. అది మొదలు ఈ సెల్ఫీ శైలి మనదేశంలోకి జుర్రున పాకేసింది. సినీ, స్పోర్ట్స్, ఇతర సెలెబ్రిటీ స్టార్లు తమ సెల్ఫీ ఫోటోలను పబ్లిష్ చేయడం మొదలుపెట్టారు. ఇక వాళ్ళను చూసి మన కుర్రకారు అదే దారిలో దూసుకుపోతోంది. ఇది ఇప్పుడు ఓ పెద్ద క్రేజీ.

సెల్పీ కోసం ప్రాణాలనే పనంగా పెట్టేంత

సెల్పీ కోసం ప్రాణాలనే పనంగా పెట్టేంత

సెల్ఫీ పిచ్చి రోజురోజుకు ముదిరిపోతోంది. ఎంతగా అంటే సెల్పీ కోసం ప్రాణాలనే పనంగా పెట్టేంత. చావు అంచుల మధ్యకు వెళ్లి సెల్ఫీలు దిగాలన్న ఆలోచన వరకు. ఆలోచనే కాదు.. కొందరు ఆచరించి మరీ చూపారు. అవి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ఇటీవల సెల్ఫీపై గూగుల్ సంస్థ నిర్వహించిన సర్వేలో ఆసక్తిక విషయాలు వెలుగులోకి వచ్చాయి.

ప్రపంచంలో ఎక్కువగా సెల్ఫీలు తీసుకుంటున్నది యువతే

ప్రపంచంలో ఎక్కువగా సెల్ఫీలు తీసుకుంటున్నది యువతే

రోజుకు కనీసం 14 సెల్ఫీలు దిగనిదే ఎవరికీ నిద్ర పట్టడం లేదట. ప్రపంచంలో ఎక్కువగా సెల్ఫీలు తీసుకుంటున్నది యువతేనని తేలింది. అలాగే ఎక్కువ యూత్ రోజుకు 14 గంటలపాటు మొబైల్‌తో గడుపుతున్నారు. వీళ్లు రోజుకు 14 సెల్ఫీలు, 16 వీడియోలు, 25 మెసేజ్‌లు షేర్ చేస్తున్నారు. ఇక ఇతరుల మెసేజ్‌లు తెలుసుకోవడానికి రోజుకు కనీసం 21 సార్లు సోషల్ సైట్లను యూత్ చెక్ చేస్తున్నారు. పెద్దవాళ్లైతే రోజుకు 4 ఫొటోలు, 2 నుంచి 3 సెల్ఫీలు తీసుకుంటున్నారు.

మోడీకి సెల్ఫీ సరదా

మోడీకి సెల్ఫీ సరదా

ఇక మన ప్రధాని మోడీకి కూడా సెల్ఫీలు తీసుకోవడం అంటే మహా సరదా. ఎన్నికల పోలింగ్ రోజు సెల్ఫీ తీసి నేను ఓటు వేశా? మీరు వేశారా? అంటూ మొదలైన మోడీ సెల్ఫీల పర్వం విదేశీ పర్యటనలో అక్కడి ఎన్నారైలతోపాటు ప్రముఖులతోనూ సెల్ఫీలు తీసుకుని సందడి చేశారు.

Best Mobiles in India

English summary
here write Selfies lead to ‘social media lice’ spreading head lice infestations among teens

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X