ఇండియాపై సైబర్ దాడులు చేస్తున్న పాకిస్తాన్

Written By:

ఇప్పటిదాకా భూభాగాన్ని ఆక్రమిస్తూ వచ్చిన పాకిస్తాన్ ఇప్పుడు ఏకంగా టెక్నాలజీతో భారతదేశాన్ని ఆక్రమించుకోవాలని చూస్తోంది. ఇండియాపై సైబర్ వార్ కు రంగం సిధ్దం చేస్తోంది. టెక్నాలజీ సాయంతో భారత్ లో ముఖ్య మైన ఆఫీసుల డేటాను హ్యక్ చేయాలని వ్యూహాలకు తెరలేపింది. మనదేశ భద్రతకు సంబంధించిన అనేక రహస్యాలను ఎలాగైనా సాధించేందుకు సైబర్ దాడులకు తెరలేపిందని ఇంటిలెజెన్స్ బ్యూరో సమాచారం.

Read more : శ్యాం సంగ్ ఫోన్లు ఇంత ఛీప్ గానా...

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

మన దేశ గవర్నమెంట్ వెబైసైట్ ల మొత్తాన్ని పాకిస్తాన్ హ్యక్ చేయాలని చూస్తోందని సమాచారం

లేటెస్ట్ గా అందిన సమాచారం ప్రకారం పాకిస్తాన్ డేటా హ్యకింగ్ కోసం కొత్త డీల్ కుదుర్చుకున్నదని తెలుస్తోంది. విదేశీ వ్యవహారాలకు సంబంధించిన డేటాను సైబర్ ద్వారా హ్యక్ చేయనుందని సమాచారం.

అంతే కాకుండా ఇందులో ఐఎస్ ఐ ప్రమేయం కూడా ఉందని తెలుస్తోంది. గవర్నమెంట్ల వెబ్ సైట్లను హ్యక్ చేయడానికి దాదాపు అక్కడ 500 మంది పనిచేస్తున్నారని సమాచారం.

కొద్ది సంవత్సరాల కిందట పాకిస్తాన్ సైబర్ ఆర్మీమన దేశ సెంట్రల్ బ్యూరో ఇన్విస్టిగేషన్ సైట్ ను హ్యక్ చేసింది. దీంతో అలర్టయిన ఇండియా దాన్ని సమర్థవంతంగా తిప్పి కొట్టింది. ఇప్పుడు మళ్లీ అదే పని చేస్తోంది.

చైనాతో కలిసి పాకిస్తాన్ ఈ సైబర్ వార్ కు తెరలేపిందని సమాచారం. ఇందుకోసం ప్రత్యేకంగా పాకిస్తాన్ ఆర్మీలో సైబర్ ఆర్మీ టీమ్ ను కూడా ఏర్పాటు చేశారు. వీరు నిరంతరం హ్యక్ పైనే చూపు సారిస్తున్నారు.

పాకిస్తాన్ ఐఎస్ఐ ఇండియాతో ఇంటర్నెట్ వార్ చేసేదానికి రెడీగా ఉందని తెలుస్తోంది. సైబర్ దాడుల ఎజెండాతోనే పాకిస్తాన్ ముందుకు వెళుతుందని అందుకే బార్డర్ వార్ ను వదిలేసి సైబర్ వార్ మీద పాకిస్తాన్ చూపు సారించినట్లు నిఘా వర్గాల సమాచారం.

బార్డర్ దాడులను వదిలేసి సైబర్ దాడులు చేయడంపైనే పాక్ తన చూపంతా నిలిపింది.

ఇప్పటికే సైబర్ దాడులకు డీల్ కుదిరినట్లు కూడా తెలుస్తోంది 

ఐఎస్ ఐ కూడా ఈ సైబర్ దాడులతో భారతదేశంలో అరాచకం చేయాలని చూస్తోంది.ఉగ్రవాద దాడులపై కూడా తన చూపును కేంద్రీకరించిందని సమాచారం 

ఇండియా ఇప్పటికే ఈ దాడులపై కన్నేసింది. హ్యకింగ్ చేయకుండా ఉండేందుకు జాగ్రత్తలతో రెడీగా ఉంది .

భారత్ ఆర్మీ కూడా పాకిస్తాన్ కు ఈ విషయంలో ధీటుగానే బదులిస్తోంది. 

సైబర్ దాడులు మానుకోకపోతే పాకిస్తాన్ కు తీవ్ర పరిణామాలు తప్పవని పలు దేశాలు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశాయి 

నీచ బుద్ధితో పాకిస్తాన్ చేస్తున్న అరాచకానికి తగిన బుద్ధి చెప్పాల్సిన తరుణం భారత్ కు ఆసన్నమైంది. 

డేటా హ్యకింగ్ తో పాకిస్తాన్ పూర్తిగా మన దేశ సమాచారాన్ని సేకరిస్తే భారత్ కు ముందు ముందు పెను ముప్పు వాటిల్లే అవకాశాలు కూడా ఉన్నాయి. 

బార్డర్ దాడులతో పాటు ఇప్పుడు రెండు దేశాలు సైబర్ వార్ కు సిద్ధమయ్యాయి 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Pakistan has declared a proxy war on India, Intelligence Bureau officials say. While they intend to continue to with cross border firing and infiltrations in a bid to carry out terror strikes, a new alert would also suggest a cyber war.
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot