ఇకపై అత్యవసర సర్వీసులన్నింటికీ ఒకటే నంబర్

Written By:

ఇక నుంచి దఏశ వ్యాప్తంగా అత్యవసర నంబర్ ఒక్కటే..వచ్చే ఏడాది నుంచి మిగతా అత్యవసర నంబర్లన్నీ కనుమరుగు కానున్నాయి. అన్నీ అత్యవసర సర్వీసులకు ఒకటే నంబర్ ను కేటాయిస్తూ డాట్ నిర్ణయం తీసుకుంది .ఈ మేరకు అన్నిమొబైల్ కంపెనీలకు రానున్న మొబైల్ ఫోన్లలో పానిక్ బటన్ ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఇంతకీ అది ఎలా పనిచేస్తుందో మీరే చూడండి.

Read more: అంతరిక్షం నుంచి భూమి ఇంత అద్భుతంగా ఉంటుందా..

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఇకపై అత్యవసర సర్వీసులకు ఒకటే నంబర్

మొబైల్ ఫోన్లలో ఇప్పుడు సరికొత్త సదుపాయం అందబాటులోకి రానుంది. ప్రస్తుతం వాడకంలో ఉన్న ప్రతి మొబైల్ హ్యాండ్‌సెట్‌లోనూ పానిక్ బటన్ లాంటి ఫీచర్‌ను పొందుపరచాలని మొబైల్ తయారీ కంపెనీలను డాట్ ఆదేశించింది.

ఇకపై అత్యవసర సర్వీసులకు ఒకటే నంబర్

పానిక్ బటన్ అంటే.. ఫోన్ వినియోగదారుడు ఏదైనా అత్యవసర సమయాల్లో అతని ఫోన్‌లోని 5 లేదా 9 బటన్‌ను నొక్కితే.. అప్పుడు ఆ ఫోన్ నుంచి ప్రభుత్వ విభాగాలకు ఒక కాల్ (112 నెంబర్‌కు) వెళుతుంది.

ఇకపై అత్యవసర సర్వీసులకు ఒకటే నంబర్

అప్పుడు ఆయా విభాగాలు వెంటనే స్పందించి.. మొబైల్ వినియోగదారునికి సాయం అందిస్తాయి. వచ్చే ఏడాది (2017) జనవరి 1 నుంచి విక్రయించే అన్ని ఫోన్లలోనూ ఈ పానిక్ బటన్ ఉండాలని డాట్ ఇప్పటికే మొబైల్ హ్యాండ్‌సెట్స్ తయారీ కంపెనీలకు ఆదేశాలను జారీ చేసింది.

ఇకపై అత్యవసర సర్వీసులకు ఒకటే నంబర్

ఇప్పటికే వినియోగంలో ఉన్న ఫోన్లలో ఈ సదుపాయం కల్పించడం కోసం అవసరమైన సాఫ్ట్‌వేర్‌ను అన్ని మొబైల్‌ రీటెయిల్‌ షాపుల్లో అందుబాటులోకి తీసుకురావాలని డివోటీ కోరింది.

ఇకపై అత్యవసర సర్వీసులకు ఒకటే నంబర్

అత్యవసర పరిస్థితుల్లో సహాయం కోసం ఇప్పటి వరకు.. 100 (పోలీస్‌), 101 (ఫైర్‌ సర్వీస్‌). 102, 108 (అంబులెన్స్‌), 1512 (రైల్వే నేరాల నియంత్రణ), 1090 (యూపీ పోలీస్‌ హెడ్‌క్వార్టర్స్‌) వంటి పలు నంబర్లు అందుబాటులో ఉన్నాయి.

ఇకపై అత్యవసర సర్వీసులకు ఒకటే నంబర్

అయితే కొత్తగా ఏర్పాటు చేస్తున్న ‘112' నంబరు అమలులోకి వచ్చిన తర్వాత.. క్రమంగా వాటన్నింటినీ తొలగిస్తారు. అంటే అన్ని అపత్కర పరిస్థితుల్లో సహాయం కోసం దేశవ్యాప్తంగా ఒకే నంబరు ‘112' అందుబాటులో ఉంటుంది.

ఇకపై అత్యవసర సర్వీసులకు ఒకటే నంబర్

ఈ నేపథ్యంలోనే ఆ నంబరు అందరికీ అందుబాటులోకి వచ్చేలా మొబైల్‌ ఫోన్లలో ప్యానిక్‌ బటన్‌ ఏర్పాటు చేయాలని డివోటీ కోరింది. అలాగే 2018, జనవరి 1నుంచి జీపీఎస్‌ సదుపాయం లేకుండా ఒక్క ఫోన్‌ కూడా విక్రయించవద్దని డివోటీ నిర్దేశించింది.

ఇకపై అత్యవసర సర్వీసులకు ఒకటే నంబర్

ఈ బటన్ అమల్లోకి వస్తే మీరు ప్రమాదంలో చిక్కుకున్నప్పుడు అత్యవసర సర్వీసులకు రాం రాం చెప్పి మీ మొబైల్ నుంచి 112 డయల్ చేస్తే సరిపోతుంది. మీకు తక్షణ సాయం లభించే అవకాశం ఉంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here Write Panic button in all mobile phones from Jan 2017
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot