ఉగ్రవాదులను బెంబేలెత్తిస్తున్న హ్యాకర్లు

Written By:

ఉగ్రవాదులపై ఇప్పుడు హ్యాక్లరు పగబట్టారు..వారిపై ఏకంగా యుద్ధాన్ని ప్రకటించారు. ఉగ్రవాదుల్లారా కాచుకోండి..మీరు అక్కడ యుద్ధం చేస్తే మేము ఇక్కడ యుద్ధం చేస్తామంటూ..మొత్తం ఉగ్రవాద సంస్థల సైట్లను హ్యాకింగ్ చేశారు. ఒక్కసారిగా హ్యాకర్లు ఇలా విరుచుకుపడేసరికి ఉగ్రవాదులకు ఇప్పుడు ముచ్చెమటలు పడుతున్నాయి. ఇన్నాళ్లు సోషల్ మీడియా వేదికగా సాగిస్తున్న ఉగ్రదాడులకు ఇప్పుడు ఒక్కసారిగా బ్రేక్ పడే పరిస్థితి వచ్చింది. మిగతా కథనం స్లైడర్ లో

Read more: వారి అంతు చూస్తాం: పట్టిస్తే రూ. 330 కోట్లు

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

గుర్తు తెలియని ఓ హ్యాకింగ్ బృందం వారిపై యుద్ధం

ఫ్రాన్స్ పై మారణకాండ అనంతరం ఐఎస్ ఎస్ ఉగ్రవాదులపై ముప్పేట దాడులు జరుగుతుండగా గుర్తు తెలియని ఓ హ్యాకింగ్ బృందం వారిపై యుద్ధం ప్రకటించింది. వారి అన్ని ఇంటర్నెట్ కనెక్షన్లు వెబ్ సైట్లను హ్యాకింగ్ చేస్తున్నట్లు ఓ వీడియోని వెలువరించింది.

ఈ తరహా చర్యలు తగవని ఇప్పుడు అగ్రరాజ్యాలు..

ఈ తరహా చర్యలు తగవని ఇప్పుడు అగ్రరాజ్యాలు మొత్తుకోవాల్సిన పరిస్థితి. ఉగ్రవాదులు నెట్ వర్క్ ను హ్యాక్ చేస్తే వారి చర్యలపై సమాచారం కరవవుతుందని ఫ్రాన్స్ సైబర్ సైక్యూరిటీ వ్యవస్థ అధికారి ఓలివర్ లౌరెల్లి హెచ్చరించారు. జీహాది సంస్థలు చేస్తున్న ప్రచారం బయటి ప్రపంచానికి తెలియకుండా చేసే ఈ తరహా చర్యలు ఆపివేయాలని సూచిస్తున్నారు.

ఈ తరహా చర్యలు తగవని ఇప్పుడు అగ్రరాజ్యాలు..

ఈ తరహా చర్యలు తగవని ఇప్పుడు అగ్రరాజ్యాలు మొత్తుకోవాల్సిన పరిస్థితి. ఉగ్రవాదులు నెట్ వర్క్ ను హ్యాక్ చేస్తే వారి చర్యలపై సమాచారం కరవవుతుందని ఫ్రాన్స్ సైబర్ సైక్యూరిటీ వ్యవస్థ అధికారి ఓలివర్ లౌరెల్లి హెచ్చరించారు. జీహాది సంస్థలు చేస్తున్న ప్రచారం బయటి ప్రపంచానికి తెలియకుండా చేసే ఈ తరహా చర్యలు ఆపివేయాలని సూచిస్తున్నారు.

దీనికి ప్రతికారంగా అతి పెద్ద సైబర్ ఆపరేషన్ ..

కాగా మా దేశం ప్రాన్స్ పై నవంబర్ 13 రాత్రి 10 గంటల సమయంలో పలు ఉగ్రదాడులు జరిగాయి. దీనికి ప్రతికారంగా అతి పెద్ద సైబర్ ఆపరేషన్ మొదలు పెడుతున్నాం. మా సైబర్ దాడులను కాచుకునేందుకు సిద్ధంగా ఉండండి.ఇక యుద్ధమే అంటూ గుర్తు తెలియని వ్యక్తులు పెట్టిన వీడియోను ఇప్పటికే 13 లక్షల మందికి పైగా తిలకించారు.

సుమారు 5,500 ట్విట్టర్ అకౌంట్లను తాము హ్యాక్ చేసినట్లు

మొత్తం ఐఎస్ ఎస్ కు సంబంధించిన వారితో సంబంధాలున్న సుమారు 5,500 ట్విట్టర్ అకౌంట్లను తాము హ్యాక్ చేసినట్లు హ్యాకర్ల గ్రూపు ప్రకటించింది. ఐఎస్ ఐఎస్ పై తమ సైబర్ పోరు ఆగదని ఆ హ్యాకర్ల గ్రూప్ ఒక ట్వీట్ లో హెచ్చరించింది. ఇక అన్ని దేశాలు ఇప్పుుడు ఐఎస్ఐఎస్ ఉగ్రవాద సంస్థ మీద యుధ్దానికి సన్నద్దమవుతున్నాయి. ఉగ్రవాదాన్ని ఏ రూపంలో ఉన్నా ఉపేక్షించేది లేదని అన్ని దేశాలు తీర్మానించుకున్నాయి.

ఫ్రాన్స్ తో పాటు రష్యా కూడా ఐఎస్ఐఎస్ మీద యుధ్దాన్ని

ప్యారిస్ దాడి తర్వాత ఫ్రాన్స్ తో పాటు రష్యా కూడా ఐఎస్ఐఎస్ మీద యుధ్దాన్ని ప్రకటించింది. రష్యా విమానాన్ని కూల్చింది కూడా ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులే కనుక తప్పక మూల్యం చెల్లించాల్సిందేనని... దానికి కారకులైన వారిని ప్రపంచంలో ఏ మూలన ఉన్నా వదిలేది లేదని రష్యా అధ్యక్షుడు ఇప్పటికే వాదిమ్లిర్ పుతిన్ ప్రకటించారు.

అసలు మూలాల మీద దాడికి దిగుతున్నాయి సైబర్ సంస్థలు

అయితే ఇలా రష్యా, ఫ్రాన్స్ లు ప్రత్యక్ష యుద్దానికి దిగుతుంటే.. అసలు ఐఎస్ఐఎస్ ప్రపంచంలో ఎలా వ్యాపిస్తోంది అన్న అసలు మూలాల మీద దాడికి దిగుతున్నాయి సైబర్ సంస్థలు. హ్యాకింగ్ టెక్నాలజీని ఐఎస్ఐఎస్ ఉగ్రవాద సంస్థను అంతమొందించడానికి కంకణం కట్టుకుంది హ్యాకర్ గ్రూప్.

హ్యాకర్ గ్రూప్స్ లో యునినిమస్ హ్యాకర్ గ్రూప్ చాలా ..

ప్రపంచంలో ఉన్న హ్యాకర్ గ్రూప్స్ లో యునినిమస్ హ్యాకర్ గ్రూప్ చాలా ప్రసిద్ది చెందింది. తాజాగా ప్యారిస్ దాడి తర్వాత ఆ సంస్థ ఐఎస్ఐఎస్ మీద యుద్దాన్ని ప్రకటించింది. మీరు మా నుంచి తప్పించుకోలేరు.. ఎంత మాత్రం అవకాశం లేనట్లుగా చేస్తాం.. సిద్దంగా ఉండండి అంటూ వీడియో ద్వారా యుధ్దానికి తెర తీసింది.

ఐఎస్ఐఎస్ ఈ హ్యాకర్ గ్రూప్ ను ఇడియట్స్ గా..

అయితే దీని మీద ఐఎస్ఐఎస్ కూడా స్పందించింది. ఐఎస్ఐఎస్ ఈ హ్యాకర్ గ్రూప్ ను ఇడియట్స్ గా కొట్టివేసింది. అయితే యునానిమస్ మాత్రం తన పని తాను చేసుకుంటూ పోతోంది.

ఐఎస్ఐఎస్ అసలు బలమైన సోషల్ మీడియా ప్రచారం మీద

తాజాగా ప్యారిస్ దాడికి లింక్ ఉన్న దాదాపు 5500 ట్విట్టర్ అకౌంట్లను గుర్తించినట్లు ఆ సంస్థ వెల్లడించింది,. అలాగే వాటిని డౌన్ చేస్తున్నట్లు కూడా తన ట్విట్టర్ అకౌంట్లో వెల్లడించింది. దాంతో అసలు ఐఎస్ఐఎస్ అసలు బలమైన సోషల్ మీడియా ప్రచారం మీద అప్పుడే నీలి నీడలు అలుముకున్నాయి. ఐఎస్ఐఎస్ ఉగ్రవాద సంస్థకు హ్యాకర్ గ్రూప్ భయం పట్టుకుంది.

తమ యాప్ ద్వారా ఐఎస్ఐఎస్ ఉగ్రవాద కార్యకలాపాలు

ఇక తమ యాప్ ద్వారా ఐఎస్ఐఎస్ ఉగ్రవాద కార్యకలాపాలు నిర్వహించకుండా అడ్డుకునేందుకు 'టెలిగ్రామ్' సంస్థ ఉపక్రమించింది. తమ యూజర్లను ఉగ్రవాదం వైపు దారి మళ్లించడానికి అవకాశం ఇవ్వకుండా ఉండేందుకు ప్రయత్నిస్తున్నట్లు టెలిగ్రామ్ నిర్వాహకులు అధికారిక ట్విటర్ ద్వారా వెల్లడించారు.

12 భాషలకు సంబంధించిన సైట్లను ఐఎస్ఎస్ వినియోగిస్తుందని

12 భాషలకు సంబంధించిన సైట్లను ఐఎస్ఎస్ వినియోగిస్తుందని, ఉగ్రవాదులు తమ యాప్ వాడకుండా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపింది. గత వారం రోజుల నుంచి తాము చేసిన ప్రయత్నాలు ఫలించి ఐఎస్ఐఎస్ సైట్లను బ్లాక్ చేసే కోడింగ్ విధానాన్ని కనుగొన్నామని వెల్లడించింది.

ఈ యాప్ వాడి తమ యూజర్లను ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు

బెర్లిన్ కేంద్రంగా పనిచేస్తున్న టెలిగ్రామ్ యాప్ ద్వారా వ్యక్తిగత ఛాటింగ్ నుంచి గ్రూప్ ఛాటింగ్ వరకు 200 మంది ఒకేసారి మెసేజ్లు పంపుకోవచ్చు. అయితే ఈ యాప్ వాడి తమ యూజర్లను ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు వారి కార్యకలాపాల వైపు ఆకర్షించకుండా ఉండేందుకు తీసుకున్న చర్యల్లో భాగంగా కోడింగ్ విధానాన్ని అనుసరించినట్లు టెలిగ్రాఫ్ తెలిపింది.

టెలిగ్రామ్ యూజర్ల సమాచారాన్ని ఐఎస్ఎస్ ఉగ్రవాదులు

టెలిగ్రామ్ యూజర్ల సమాచారాన్ని ఐఎస్ఎస్ ఉగ్రవాదులు రిట్రీవ్ చేయకుండా వారి డేటాని ఎన్క్రిప్ట్ చేసే యోచనలో యాప్ రూపకర్తలు ఉన్నారు. ఈ నిర్ణయాన్ని తీవ్రంగా ఖండిచండటంతో పాటు తమ చర్యలకు అడ్డుకట్ట వేయాలని భావిస్తున్న యాప్ నిర్వాహకులపై దాడులు చేయాలన్న యోచనలో ఉన్నట్లు ఐఎస్ఐఎస్ హెచ్చరిక సంకేతాలు పంపించింది.

హ్యాకర్లు ఉగ్రవాదులకు సవాల్ విసిరిన వీడియో ఇదే

హ్యాకర్లు ఉగ్రవాదులకు సవాల్ విసిరిన వీడియో ఇదే

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here Write paris attacks effect anonymous hackers group warns isil of cyberattacks
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot