డిజిటల్ మీడియాలోకి పేటీఎం, త్వరలో న్యూస్, లైవ్ టీవీ

|

డిజిటల్ పేమెంట్స్ రంగంలో దూసుకుపోతున్న దిగ్గజం పేటీఎం తన సేవలను మరింతగా విస్తరించనుంది. ఇప్పటికే కస్టమర్లు, వ్యాపారులకు సమగ్రమైన చెల్లింపు సర్వీసులను పేటీఎం అందిస్తున్న సంగతి విదితమే. అయితే ఇప్పుడు కంపెనీ కొత్త సర్వీసుల వైపు అడుగులు వేస్తోంది.

Paytm Enter into Digital Media:News, Live TV by Next Month

ఇప్పటిదాకా అందిస్తున్న సర్వీసులకు బిన్నంగా కంటెంట్, వార్తలు, చిన్న వీడియోలు, లైవ్ టీవీ వంటి సర్వీసులను కూడా ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తోంది.ఈ సేవలు వచ్చే నెలలో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.

25 కోట్లకు పెంచుకోవడమే టార్గెట్:

25 కోట్లకు పెంచుకోవడమే టార్గెట్:

ఈ కొత్త సర్వీసుల ద్వారా నెలవారీ యాక్టీవ్ కస్టమర్ల సంఖ్యను 25 కోట్లకు పెంచుకోవాలనుకుంటోంది. ఈ స్థాయిలో కస్టమర్లు రావాలంటే పేటీఎం వినూత్నంగా ఈ సర్వీసులను అందుబాటులోకితీసుకురావాల్సి ఉంటుంది. ఇప్పుడు అధిక శాతం మంది మొబైల్ ఫోన్ ద్వారానే వార్తలు చదువుతున్నారు. చదువుకున్నవారు, చదువుకొని వారు వీడియోలకు ఆకర్షితులవుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ విభాగంపై పే టీఎం దృష్టి సారించినట్టు తెలుస్తోంది. ఇప్పటికే పేటీఎం ఇన్ బాక్స్ కు నెలవారీగా 2. 7 కోట్ల మంది యాక్టీవ్ యూజర్లున్నారు.

కొత్తగా 6-7 కోట్ల మంది టార్గెట్:

కొత్తగా 6-7 కోట్ల మంది టార్గెట్:

కొత్త కంటెంట్ తో కొత్తగా 6-7 కోట్ల మంది వినియోగదారులను సంపాదించుకోవాలన్న లక్ష్యంతో ఉంది. ఇదిలా ఉంటే వినియోగదారులను పెంచుకోవడానికి స్మార్ట్ ఫోన్ల తయారీ కంపెనీలతో డీల్స్ కుదుర్చుకుంటోంది. వీటి ద్వారా మొబైల్ ఫోన్ లో ఇన్ బిల్ట్ గా పేటీ ఎమ్ యాప్ ఉంటుందన్న మాట. ఇప్పటికే చాలా కంపెనీలు మొబైల్ ఫోన్ల కంపెనీలతో ఒప్పందాలు చేసుకోవడం ద్వారా తమ యాప్ లను ఇన్ బిల్ట్ గా అందిస్తున్నాయి.

మొబైల్ కంపెనీలతో చర్చలు:

మొబైల్ కంపెనీలతో చర్చలు:

సాధారణంగా ఓక యాప్ ను వినియోగించుకోవాలనుకుంటే దాన్ని యాప్ స్టోర్ నుంచి డౌన్ లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆల్రెడీ డౌన్ లోడ్ అయి వస్తే దాన్ని ఎక్కువ మంది వినియోగించుకునే అవకాశం ఉంటుంది. దీని వల్ల వినియోగ దారుల సంఖ్య పెరగడానికి అవకాశం ఉంటుందని కంపెనీ భావిస్తోంది. దీన్ని పసిగట్టిన పేటీఎమ్ మొబైల్ కంపెనీలతో చర్చలు జరిపి అందులో పేటీఎమ్ యాప్ ఇన్ బుల్ట్ గా ఉండేటా వ్యూహాలు రచిస్తోంది.

క్యూ ఆర్ కోడ్ మరింత విస్తరణ:

క్యూ ఆర్ కోడ్ మరింత విస్తరణ:

వివిధ రకాల చెల్లింపులు చేయడానికి, చెల్లింపులు స్వీకరించడానికి ఉపయోగపడే క్యూ ఆర్ కోడ్ ను మరింతగా విస్తరిస్తోంది. ఇందుకోసం రూ. 250 కోట్లు ఖర్చు చేయనుంది. ఈ పెట్టుబడితో వచ్చే మార్చి నాటికీ దేశవ్యాప్తంగా 2 కోట్ల మంది మార్చంట్లను చేరుకోవాలనుకుంటోంది. ఇప్పుడు పేటీఎం క్యూ ఆర్ కోడ్ ద్వారా 1.2 కోట్ల మంది వ్యాపారాలు చెల్లింపులను స్వీకరిస్తున్నారు.

అంతర్జాతీయ కంపెనీల ఇన్వెస్ట్‌‌మెంట్లు:

అంతర్జాతీయ కంపెనీల ఇన్వెస్ట్‌‌మెంట్లు:

పేటీఎంలో అలీబాబా, సాఫ్ట్‌‌బ్యాంక్‌‌ అంతర్జాతీయ కంపెనీల ఇన్వెస్ట్‌‌మెంట్లు ఉన్న విషయం తెలిసిందే. మరింత మందిని ఆకర్షించడానికి త్వరలో న్యూస్‌‌, షార్ట్‌‌ వీడియోలు, లైవ్‌‌ టీవీ వంటి సేవలను వచ్చే ఏడాది నుంచి అందించడానికి పేటీఎం ఏర్పాట్లు చేస్తోంది. క్యూఆర్‌‌ కోడ్‌‌ ద్వారా పేమెంట్లు తీసుకునే వ్యాపారుల సంఖ్య రెండు కోట్లకు పెంచేందుకు కృషి చేస్తున్నట్టు దీపక్‌‌ చెప్పారు.

Best Mobiles in India

English summary
Paytm Enter into Digital Media:News, Live TV by Next Month

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X