పేటీఎంలో ఉద్యోగాల పంట, 20 వేలకు పైగానే..

Written By:

ఈ వ్యాలెట్ రంగంలో దూసుకుపోతున్న పేటీఎం ఉద్యోగాల పంట పండించనుంది. రానున్న కాలంలో 20 వేల ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ మేరకు పేటీఎం సీఈఓ విజయ్ శర్మ ఉద్యోగాలు అప్లయి చేసుకోవాలని పిలుపునిచ్చారు. మొత్తం దేశ వ్యాప్తంగా ఈ రిక్రూట్ మెంట్ జరగనుంది. ఇంకా ఆశ్చర్యకర విషయం ఏంటంటే గత నెల్లోనే 1500 మంది కొత్తగా విధుల్లో చేరారు.

ఐడియా నుంచి సరికొత్త ఆఫర్లు

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

650 జిల్లాల్లో పేటీఎం ఉద్యోగులు

నగదురహిత లావాదేవీలు నిర్వహించేందుకు దేశవ్యాప్తంగా ఉన్న 650 జిల్లాల్లో పేటీఎం ఉద్యోగులు పనిచేయనున్నారు. ఈ మేరకు పేటీఎం సీఈఓ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ప్రస్తుతం పేటీఎంలో 11 వేల మంది ఉద్యోగులు పనిచేస్తుండగా .. వీరిలో 1500 మంది గత ముప్ఫై రోజుల్లో చేరిన వారే .

పేటీఎంకు 88 లక్షల మంది వినియోగదారులు

యాప్ డేటా ట్రాకర్ 'యాప్ అన్నీ' ప్రకారం .. భారతదేశంలో పేటీఎంకు 88 లక్షల మంది వినియోగదారులు ఉన్నారు. వీరందరూ రెగ్యులర్ గా యాప్ ను వినియోగిస్తున్నట్లు కూడా 'యాప్ అన్నీ' పేర్కొంది.

లేటెస్ట్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

జిల్లాకు 10 మంది సేల్స్ బృందాన్ని

ఒక జిల్లాకు 10 మంది సేల్స్ బృందాన్ని పంపే యోచనలో ఉన్నట్లు విజయ్ శేఖర్ చెప్పారు. డిజిటల్ లావాదేవీలపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు నీతి ఆయోగ్ తో కలిసి పనిచేస్తున్నట్లు తెలిపారు.

చిన్న వ్యాపారుల్లో యాప్ వినియోగం

ఫీచర్ ఫోన్లలో వాలెట్ సర్వీసులను ప్రవేశపెట్టిన తర్వాత చిన్న వ్యాపారుల్లో యాప్ వినియోగం బాగా పెరిగినట్లు చెప్పారు. పేటీఎం వినియోగదారుడు ఎవరైనా టోల్ ఫ్రీ నంబర్ కు ఫోన్ చేసి పేమెంట్ చేయొచ్చని వెల్లడించారు.

సెకనుకు 1300 కాల్స్

సెకనుకు 1300 కాల్స్ ను హ్యాండిల్ చేయగల సామర్ధ్యానికి తమ నెట్ వర్క్ పరిధిని పెంచుకున్నట్లు చెప్పారు. 

రోజుకు కనీసం రూ .150 కోట్ల నగదు రహిత లావాదేవీలు

రోజుకు కనీసం రూ .150 కోట్ల నగదు రహిత లావాదేవీలు యాప్ ద్వారా జరుగుతున్నట్లు చెప్పారు. అధిక విలువ కలిగిన నోట్ల రద్దుకు ముందు రోజుకు రూ .40 కోట్ల లావాదేవీలు మాత్రమే జరిగేవని వెల్లడించారు.

లేటెస్ట్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Paytm to hire 10,000 agents to expand offline merchant network read more at gizbot telugu
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting