చిన్న వ్యాపారులకు వరం..తక్కువ వడ్డీకే పేటీఎం రుణాలు

Written By:

చిన్న చిన్న వ్యాపారం చేసే వ్యాపారులకు ఇప్పుడు పేటీఎం అత్యంత తక్కువ వడ్డీ రేట్లకు రుణాలను అందిస్తోంది. దీనికి ఎలాంటి పూచీ కత్తు లేకుండానే మూలధన రుణాలను మొబైల్ పేమెంట్ ఈ కామర్స్ దిగ్గజం పేటీఎం అందించనుంది. దీనికోసం ఓ బ్యాంకును కూడా ఏర్పాటు చేసే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది. అన్నీ కుదిరితే అక్టోబర్ 1 నుంచే కార్యకలాపాలు ప్రారంభించే అవకాశం ఉంది.

అమెరికాలో ఉద్యోగమా..ఇక ఆశలు వదిలేసుకోండి !

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

చిన్న వ్యాపారులకు వరం... తక్కువ వడ్డీకే పేటీఎం రుణాలు

పేటీఎం ద్వారా మంచి చెల్లింపులు జరుపుతున్న వినియోగదారులకు పేటీఎం తన ప్లాట్‌ఫామ్‌ ద్వారా ఈ రుణాలను మంజూరు చేయనుంది. అతితక్కువ వడ్డీ రేట్లకే పేటీఎం ఈ రుణాలను అందించనుంది.

చిన్న వ్యాపారులకు వరం... తక్కువ వడ్డీకే పేటీఎం రుణాలు

ఫైనాన్షియల్‌ ఇనిస్టిట్యూషన్ల భాగస్వామ్యంతో చిరు వ్యాపారులకు ఈ రుణాలను ఆఫర్‌ చేయనుంది. ఫైనాన్షియల్‌ ఇంక్లూజన్‌ ప్రధాన అజెండాగా చిరు వ్యాపారులకు ఈ రుణాలను అందిస్తోంది.

చిన్న వ్యాపారులకు వరం... తక్కువ వడ్డీకే పేటీఎం రుణాలు

చిరు వ్యాపారులు తమ రుణాల కోసం అధిక మొత్తం వడ్డీని చెల్లిస్తూ వస్తుండటం వారి వ్యాపారాన్ని పూర్తిగా దెబ్బతీస్తోందని, ఈ పరిస్థితి నుంచి వారిని గట్టెక్కించేందుకు ఆర్థిక సంస్థల భాగస్వామ్యంతో తక్కువ వడ్డీకే రుణాలను ఆఫర్‌ చేస్తున్నట్లు పేటీఎం తెలిపింది.

చిన్న వ్యాపారులకు వరం... తక్కువ వడ్డీకే పేటీఎం రుణాలు

సంవత్సరాంతం నాటికల్లా 10 లక్షల మంది చిన్న వ్యాపారులకు రుణాలను అందించాలని పేటీఎం లక్ష్యంగా పెట్టుకుంది.

చిన్న వ్యాపారులకు వరం... తక్కువ వడ్డీకే పేటీఎం రుణాలు

ఇదిలా ఉంటే దీపావళికి ముందే పేమెంట్ బ్యాంక్ కార్యకలాపాలను ప్రారంభించాలన్న ప్రయత్నాల్లో ఉన్నట్లు డిజిటల్ చెల్లింపుల ప్లాట్‌ఫాం పేటీఎం తెలిపింది. బ్యాంక్ ఏర్పాటు కోసం రూ.350-500 కోట్ల బడ్జెట్‌ను సిద్ధం చేస్తున్నట్లు పేటీఎం తెలిపింది. 

చిన్న వ్యాపారులకు వరం... తక్కువ వడ్డీకే పేటీఎం రుణాలు

అక్టోబర్ 1 నుంచే కార్యకలాపాలు మొదలుపెట్టాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. సాంకేతిక వనరులు సమకూర్చుకునేందుకు కొంత సమయం పట్టొచ్చని, మొత్తంగా దీపావళి కంటే ముందే మార్కెట్లోకి వస్తామన్నారు.

చిన్న వ్యాపారులకు వరం... తక్కువ వడ్డీకే పేటీఎం రుణాలు

పేమెంట్ బ్యాంక్ ఏర్పాటుకు గత ఏడాది ఆర్‌బీఐ పదకొండు మందికి లైసెన్సులు జారీ చేసింది. అందులో పేటీఎం ఒకటి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here Write Paytm starts offering collateral-free loans for merchants on its platform
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot