ఐ ఫోన్ గన్‌గా మారి ఎంత పని చేసింది

Written By:

ఐ ఫోన్ గన్ గా మారడమేందని ఆశ్చర్యపోతున్నారా..అవును ఐ ఫోన్ గన్ గా మారి ప్రయాణికులను అలాగే భద్రతా అధికారులను పరుగులు పెట్టించింది. ఈ సంఘటన ఎక్కడ జరిగిందంటే ఇంగ్లండ్ లోని స్టాన్ స్టెడ్ విమానాశ్రయంలో జరిగింది. తీవ్రవాదులు విమానశ్రయంలోకి దూసుకొచ్చారన్నంతగా ఆ ఐ ఫోన్ గన్ అక్కడున్న వారికి చెమటలు పట్టించింది..అసలు కధేంటో చూడండి.

మానవతను చాటుకున్న ఆపిల్

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఐ ఫోన్ గన్‌గా మారి ఎంత పని చేసింది

ఇంగ్లండ్‌లోని స్టాన్‌స్టెడ్ విమానాశ్రయంలోకి ఓ ప్రయాణికుడు గన్ ఆకారంలో గల ఐ ఫోన్ కేస్‌ను ఫ్యాంటు వెనుక జేబులో పెట్టుకుని విమానాశ్రయంలోకి వచ్చాడు. బయటకు కనిపిస్తున్న ఈ ఫోన్‌ను భద్రతాధికారులు గుర్తించారు. భద్రతాధికారులు దీన్ని గన్ అని భావించారు.

ఐ ఫోన్ గన్‌గా మారి ఎంత పని చేసింది

టీ షర్ట్, జీన్స్ ఫ్యాంట్ ధరించిన ఈ గుర్తుతెలియని వ్యక్తిని భద్రత సిబ్బంది వెంటనే అదుపులోకి తీసుకుని సోదా చేశారు. అది గన్ కాదని, గన్ ఆకారంలో గల ఐ ఫోన్ కేస్ అని గుర్తించారు.

ఐ ఫోన్ గన్‌గా మారి ఎంత పని చేసింది

గన్ ఆకారంలో గల ఇలాంటి వస్తువులను విమానాశ్రయంలోకి తీసుకురావడం ప్రమాదకరమని, సంబంధిత వ్యక్తిని భద్రత సిబ్బంది ఉగ్రవాదిగా పొరబడి, కాల్చే అవకాశముందని ఎసెక్స్ పోలీసులు ట్వీట్ చేశారు.

ఐ ఫోన్ గన్‌గా మారి ఎంత పని చేసింది

వారి ప్రయాణానికి ఆటంకం ఏర్పడుతుందని.. సోదాలు, విచారణ వల్ల వాళ్లు వెళ్లాల్సిన విమానం అందుకోలేకపోవచ్చని సూచించారు. ప్రయాణికులు ఇలాంటి వస్తువులను తీసుకురాకపోవడం శ్రేయస్కరమని పేర్కొన్నారు.

ఐ ఫోన్ గన్‌గా మారి ఎంత పని చేసింది

గన్ ఆకారంలో ఐ ఫోన్ కేస్‌ను తీసుకువచ్చిన వ్యక్తిపై చర్యలు తీసుకుంటారా లేదా అన్న విషయాన్ని పోలీసులు వెల్లడించలేదు. కాగా ఇతగాడి నిర్వాకాన్ని తోటి ప్రయాణికులు తీవ్రంగా విమర్శించారు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here Write What was he thinking? Plane passenger stopped at Stansted with iPhone case shaped like a gun
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot