మోడీ యుఎస్ పర్యటన రహస్యం ఇదేనా..?

Posted By:

మోడీ యుఎస్ పర్యటనకు ఈ నెల చివరి వారంలో శ్రీకారం చుట్టబబోతున్న విషయం విదితమే. అది డిజిటల్ ఇండియాలో భాగంగానా లేక మేక్ ఇన్ ఇండియాలో భాగంగానా అనేది పక్కనబెడితే అసలు మోడీ యుఎస్ పర్యటనలో ఏం చేయబోతున్నారు అనేది ఇప్పుడు అందరికీ తెగ ఆసక్తిని రేపుతోంది. సాధారణంగా ఏ పర్యటనకు వెళ్లినా అక్కడ అన్నీ పనులు చక్కబెట్టుకొచ్చే ఇండియా ప్రధాని ఈ సారి యుఎస్ పర్యటనలో కూడా అదే పాత్ర పోషించబోతున్నారు. అక్కడ మేక్ ఇన్ ఇండియాకు అలాగే డిజిటల్ ఇండియాకు కావాల్సిన అన్ని వ్యవహారాలను చక్కబెట్టబోతున్నారని తెలుస్తోంది. అయితే మోడీ అక్కడ ఎవరెవరినీ కలవబోతున్నారనేదానిపై ఓ స్మార్ట్ లుక్కేద్దాం.

Read more: ఫేస్‌బుక్‌లో సందడిచేయనున్న ప్రధాని మోడీ

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

యాపిల్ సీఈఓ టీమ్ కుక్ ని కలిసే అవకాశాలు

ప్రధాని నరేంద్ర మోడీ యుఎస్ పర్యటనలో ప్రధానంగా యాపిల్ సీఈఓ టీమ్ కుక్ ని కలిసే అవకాశాలు చాలా మెండుగా ఉన్నాయని తెలుస్తోంది. ప్రధాని పర్యటన వెనుక బలమైన కారణం అదేనని తెలుస్తోంది.

యాపిల్ సీఈఓతో చర్చలు

ఇండియాలో ఇంటర్నెట్ సమాచారం గురించి ప్రధానంగా యాపిల్ సీఈఓతో నరేంద్ర మోడీ చర్చించే అవకాశం ఉంది.

పెట్టుబడులు పెట్టాలనే ఆసక్తి

ఇండియాలో యాపిల్ సంస్థ తమ ఉత్పత్తి కార్యాలయాన్ని ప్రారంభించేందుకు కసరత్తు, అలాగే పెట్టుబడులు పెట్టాలనే ఆసక్తి ఉన్న నేపథ్యంలో మోడీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

ఇప్పటికే ఫోక్స్ కాన్ తమ కార్యకలాపాలు..

అదీగాక ఈ మధ్య భారత్ లో పెట్టుబడులు పెట్టేందుకు అనేక కంపెనీలు ఆసక్తి చూపిస్తున్నాయి. ఇప్పటికే ఫోక్స్ కాన్ తమ కార్యకలాపాలను ఇండియాలో ప్రారంభించింది.

ప్రధాని పర్యటన

అన్నీ కుదిరితే భవిష్యత్ లో లేక తొందర్లోనే ఐ ఫోన్ తమ కార్యకలాపాలు కొనసాగించేలా ప్రధాని పర్యటన కొనసాగే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.

మిగతా కంపెనీలకు సవాల్

అదీగాక మార్కెట్లో రోజు రోజుకు యాపిల్ కంపెనీ మిగతా కంపెనీలకు సవాల్ విసురుతోంది. కొద్ది సంవత్సరాల క్రితం యాపిల్ ఫోన్లు అంతర్జాతీయ మార్కెట్ లో రిలీజ్ చేసిన కొద్ది రోజులకే మళ్లీ యాపిల్ ఐ ఫోన్ 6ఎస్, 6ఎస్ ప్లస్ ను మార్కెట్ లోకి వదులుతోంది.

యాపిల్ ఫోన్ల అమ్మకాలు భారత్ లో డబుల్

ఈ ఫోన్లు దీపావళి నాటికి భారత మార్కెట్లో సందడి చేసే అవకాశం ఉంది. అదీగాక గత రెండు సంవత్సరాల్లో యాపిల్ ఫోన్ల అమ్మకాలు భారత్ లో డబుల్ అయ్యాయి.

మిగతా ఫోన్ల కంటే ఐ ఫోన్ ఓ సింబల్

మిగతా ఫోన్ల కంటే ఐ ఫోన్ ఓ సింబల్ గా మారింది. ఈ మధ్య రిలీజ్ చేసిన ఐఫోన్ 6ఎస్ భారత మార్కెట్లో దాదాపు లక్ష రూపాయల దాకా పలికే అవకాశాలు ఉన్నాయి.

సిలికాన్ వ్యాలీలో సందడి

యాపిల్ సీఈఓతో పాటు సిలికాన్ వ్యాలీలో ఫేస్ బుక్ సీఈఓ మార్క్ జుకర్ బర్గ్ ,గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్, అడోబ్ సీఈఓశాంతా నారాయేన్ లు భారత ప్రధానిని కలిస్తారు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
here write PM Modi to meet Apple CEO Tim Cook during US visit
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot