ఫేస్‌బుక్‌లో సందడిచేయనున్న ప్రధాని మోడీ

|

ప్రపంచ చరిత్రలో తొలిసారిగా ఓ సరికొత్త అధ్యాయానికి తెరలేవబోతోంది. ఒక దేశప్రధాని తొలిసారిగా ఫేస్‌బుక్ కార్యాలయాన్ని సందర్శించనున్నారు.అది ఏ దేశమో కాదు..ఇండియా..అవును ఇండియా ప్రధాని నరేంద్రమోడీ తొలిసారిగా ఫేస్ బుక్ కార్యాలయానికి వెళ్లనున్నారు. ఫేస్ బుక్ సీఈఓ జుకర్ బర్గ్ ఆహ్వనం మేరకు కాలిఫోర్నియాలోని ఆ సంస్థ ప్రధాని కార్యాలయంలోకి మోడీ అడుగుపెట్టనున్నారు.ఈ నెల 27న మోడీ ఫేస్‌బుక్ కార్యాలయాన్ని సందర్శిస్తారని ప్రధాని కార్యాలయ వర్గం తెలిపింది. మరి అక్కడ ఎవరిని కలవనున్నారు. ఎవరితో ముఖాముఖీ చేయనున్నారు ఇటువంటి విషయాలపై ఓ స్మార్ట్ లుక్కేద్దాం.

 

Read more :మోడీ.. ఏమిటీ ఈ సెల్పీల దాడి

 రాత్రి పదిగంటలకు...

రాత్రి పదిగంటలకు...

అమెరికా పర్యటనలో ప్రధాని నరేంద్రమోడీ కాలిఫోర్నియాలోని సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్ ప్రధాన కార్యాలయాన్ని సెప్టెంబర్ 27న భారత కాలమానం ప్రకారం రాత్రి పదిగంటలకు వెళ్లనున్నారు. టౌన్‌హాల్‌లో నిర్వహించే ప్రశ్నోత్తరాల (క్యూ అండ్ ఏ) కార్యక్రమంలో పాల్గొనేందుకు ఫేస్‌బుక్ కార్యాలయాన్ని సందర్శించాలని జుకర్ బర్గ్ మోడీని ఆహ్వనించారు.

మార్క్ జుకర్‌బర్గ్‌కు కృతజ్ఞతలు

మార్క్ జుకర్‌బర్గ్‌కు కృతజ్ఞతలు

అయితే ఈ ఆహ్వనంపై ప్రధాని మోడీ మార్క్ జుకర్‌బర్గ్‌కు కృతజ్ఞతలు అని ట్విట్టర్ లో ట్వీట్ చేశారు.

చాలా సంతోషంగా ఉంది
 

చాలా సంతోషంగా ఉంది

ప్రధాని ట్వీట్‌పై స్పందిస్తూ ప్రధాని మోదీ ఫేస్‌బుక్ కార్యాలయానికి రానున్నారనే విషయాన్నతెలియజేయడం చాలా సంతోషంగా ఉంది అని ఆ సంస్థ వ్యవస్థాపకుడు మార్క్ జుకర్‌బర్గ్ ఫేస్‌బుక్‌లో పేర్కొన్నారు.

తమ ప్రశ్నలను పంపాలి

తమ ప్రశ్నలను పంపాలి

ఈ కార్యక్రమం కోసం తమ ప్రశ్నలను పంపాలని ఫేస్‌బుక్ యూజర్లను జుకర్‌బర్గ్ కోరారు. సాధ్యమైనంత వరకు ఎక్కువ ప్రశ్నలకు స్పందించే విధంగా చర్యలు తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు.

నరేంద్రమోడీ మొబైల్ యాప్‌లో...

నరేంద్రమోడీ మొబైల్ యాప్‌లో...

ఈ కార్యక్రమంలో అన్ని అంశాలపై దృష్టి సారిస్తామని, ఎంతో చిరస్మరణీయంగా నిర్వహించనున్న కార్యక్రమంలో నెటిజన్లు పాల్గొనకపోతే అసంపూర్తిగా ఉంటుందన్నారు. తమ ప్రశ్నలను ఫేస్‌బుక్‌లోగానీ, నరేంద్రమోడీ మొబైల్ యాప్‌లో గానీ పోస్ట్ చేయాలని సూచించారు.

ఎలా కలిసి పనిచేయాలనే అంశంపై..

ఎలా కలిసి పనిచేయాలనే అంశంపై..

సాంఘిక, ఆర్థిక సవాళ్లను ఎదుర్కోనేందుకు కమ్యూనిటీలు ఎలా కలిసి పనిచేయాలనే అంశంపై మోడీ, తాను చర్చిస్తామని ఆయన తెలిపారు.

గూగుల్ సందర్శన

గూగుల్ సందర్శన

ఈ పర్యటనలో సిలికాన్ వ్యాలీలోని ఫ్రెమెంట్‌లో ఉన్న గూగుల్ కార్యాలయాన్ని, ఆటో దిగ్గజం తెస్లా కార్యాలయాలను కూడా ప్రధాని సందర్శించనున్నట్లు తెలిసింది. అయితే ప్రభుత్వ వర్గాల నుంచి ఎలాంటి అధికారిక పర్యటన వెలువడలేదు.

అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాతో..

అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాతో..

ఈ నెల 28న అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాతోపాటు గూగుల్ సీఈవో సుందర్ పిచయ్, ఆపిల్ సీఈవో టిమ్‌కుక్, అడోబ్ సీఈవో శంతను నారాయణ్, తెస్లా ప్రతినిధులతో సమావేశమయ్యే అవకాశముంది.

నెల 23 నుంచి 29 వ తేదీ వరకు ఐర్లాండ్ అమెరికాలో పర్యటన

నెల 23 నుంచి 29 వ తేదీ వరకు ఐర్లాండ్ అమెరికాలో పర్యటన

భారత ప్రధాని ఈ నెల 23 నుంచి 29 వ తేదీ వరకు ఐర్లాండ్ అమెరికాలో పర్యటించనున్న మోడీ ఐక్యరాజ్యసమితిలో తన ప్రసంగాన్ని వినిపించనున్నారు.

ప్రశ్నలు పంపండి

ప్రశ్నలు పంపండి

మీరు ప్రశ్రలను నరేంద్రమోడీ మొబైల్ యాప్ కి గాని ఫేస్‌బుక్‌ లోగాని పంపవచ్చు.

కాలిఫో్ర్నియాలో ఫేస్‌బుక్‌ ఆపీసుకు వెళ్లే దారి

కాలిఫో్ర్నియాలో ఫేస్‌బుక్‌ ఆపీసుకు వెళ్లే దారి

కాలిఫో్ర్నియాలో ఫేస్‌బుక్‌ ఆపీసుకు వెళ్లే దారి 

Best Mobiles in India

English summary
Prime Minister Narendra Modi has accepted Facebook founder Mark Zuckerberg’s invite to visit the social media giant’s headquarters for a joint town hall Q&A during a visit to the US later this month.

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X