సిలికాన్ వ్యాలీలో ఏం జరగబోతోంది..?

Written By:

నరేంద్ర మోడీ సిలికాన్ వ్యాలీ పర్యటనలో ఏం జరగబోతోంది. సిలికాన్ వ్యాలీకే మోడీ రాక్ స్టార్ గా మారనున్నారా..లేక మోడీని అడ్డుకుని సిలికాన్ వ్యాలీలో ఎన్నారైలు రాక్ స్టార్లుగా మారనున్నారా..అసలేం జరగబోతోంది. ఎవరు అక్కడ హీరోలు కానున్నారు. టెక్ కంపెనీలతో ముందుకు దూసుకుపోతున్న సిలికాన్ వ్యాలీలో మోడీ ఎవరిని కలవబోతున్నారు. సిలికాన్ వ్యాలీ పర్యటన వెనుక నరేంద్ర మోడీ వ్యూహం ఏంటీ...వీటన్నింటిపై ఓ స్మార్ట్ లుక్కేద్దాం.

Read more: మోడీ.. నీవు ఫ్లాప్ అంటున్న ఎన్నారైలు

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

సిలికాన్ వ్యాలీది ఓ ప్రత్యేక స్థానం

యుఎస్ సెక్టార్ లో సిలికాన్ వ్యాలీది ఓ ప్రత్యేక స్థానం. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన టెక్ సంస్థలన్నీ అక్కడే ఉన్నాయి, గూగుల్ ఫేస్ బుక్, యాపిల్ వంటి దిగ్గజ కంపెనీలన్నీ అక్కడే ఉన్నాయి. అయితే అక్కడ ఉన్న అన్ని టెక్ కంపెనీల సీఈఓలతో మోడీ భేటీ కానున్నారు. అలాగే కొన్ని చోట్ల ప్రసంగించే అవకాశం ఉంది..ఫేస్ బుక్ ఇప్పటికే నరేంద్ర మోడీని ప్రశ్నలు అడగాల్సిన వారు ఫేస్ బుక్ లో అడగవచ్చు అని కూడా చెప్పింది.

సిలికాన్ వ్యాలీ పర్యటనను అడ్డుకుని తీరుతాం

అయితే ఎన్నారైలు మాత్రం నరేంద్ర మోడీ సిలికాన్ వ్యాలీ పర్యటనను అడ్డుకుని తీరుతామని చెబుతున్నారు. మాకు మోడీ చేసింది ఏమి లేదని బల్లగుద్ది చెబుతున్నారు. మోడీ ఫేస్ బుక్ సందర్శనలో ప్రధానంగా వీరు తమ నిరసనను వ్యక్తపరిచే అవకాశాలు మెండుగా ఉన్నాయి. మాకు న్యాయం చేయాలంటూ నినదించే అవకాశాలు కూడా మెండుగా ఉన్నాయి.

యాపిల్ సీఈఓని కలిసే అవకాశాలు

ఇక మోడీ ప్రధానంగా అక్కడ యాపిల్ సీఈఓని కలిసే అవకాశాలు ఎక్కువుగా ఉన్నాయి. యాపిల్ ని ఇండియాకి తీసుకురావాలనే నరేంద్ర మోడీ గట్టి కృషి చేయనున్నార.అందులో భాగంగా యాపిల్ ను ఇండియాలో పెట్టుబడులు పెట్టమని అడిగే అవకాశం కూడా ఉంది.

ఇండియా నుంచి 30 సంవత్సరాల తరువాత..

డిజిటల్ ఇండియాలో భాగంగా మోడీ ఈ ట్రిప్ వేశారని తెలుస్తోంది. ఇక యుఎస్ వెస్ట్ కోస్ట్ ని కూడా సందర్శించనున్నారు. ఇండియా నుంచి 30 సంవత్సరాల తరువాత యుఎస్ వెస్ట్ కోస్ట్ ని సందర్శించిన వ్యక్తిగా నరేంద్ర మోడీ చరిత్ర పుటలకెక్కనున్నారు.

బరాక్ ఒబామా తరువాత మోడీనే ..

సోషల్ మీడియాలో బరాక్ ఒబామా తరువాత మోడీనే అత్యంతఫాలోయింగ్ ఉన్న వ్యక్తి. నరేంద్ర మోడీకి దాదాపు ఫేస్ బుక్ లో 30 మిలియన్ల లైకులు అలాగే ట్విట్టర్ లో 15 మిలియన్ల మంది ఫాలోవర్స్ ఉన్నారు.

350 మంది బిజినెస్ డెలిగేట్స్ తో మోడీ డిన్నర్

ఈ రోజు 350 మంది బిజినెస్ డెలిగేట్స్ తో మోడీ డిన్నర్ చేస్తారని ప్రధాని వర్గాలు తెలిపాయి. డిన్నర్ కు ముందు సత్య నాదెళ్ల, సుందర్ పిచాయ్,శాంతా నారాయేన్ తో కూడా చర్చలు జరిగే అవకాశాలు ఉన్నాయి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
here Write PM Narendra Modi set to woo technology companies in Silicon Valley
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot