తగ్గింపు ధరలతో షియోమి పోకోF1

|

ప్రముఖ చైనా మొబైల్ కంపెనీలు కొత్త మొబైల్ ను ఇండియాలో లాంచ్ చేయడానికి ముందుగా అంతకు ముందు రిలీజ్ చేసిన మొబైల్ ఫోన్ ధరలను తగ్గిస్తున్నారు.ఇప్పుడు షియోమి సంస్థ కూడా ఇదే పద్ధతిని పాటిస్తోంది.ఇప్పుడు షియోమి రెడ్‌మిK20 సిరీస్‌ను ఇండియాలో లాంచ్ చేయడానికి షియోమి సన్నద్ధమవుతోంది. రెడ్‌మిK20 సిరీస్‌లోని ప్రో మోడల్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 855 ప్రాసెసర్‌తో చాలా చౌకైన ఫోన్‌గా సెట్ చేయబడి ఉంది.

 
poco f1 price dropped ahead of redmi k20 pro launch in india

షియోమి రెడ్‌మిK20 తన అధికారిక ప్రయోగానికి ముందు షియోమి యొక్క తన పాత మొబైల్ పోకోF1 ధరను తగ్గించింది. ఇది ఇండియాలో ప్రారంభించిన సమయంలో స్నాప్‌డ్రాగన్ 845 ప్రాసెసర్‌తో వచ్చిన చాలా చౌకైన మొబైల్ గా ఉండేది.

వేరియంట్ ధరలు:

వేరియంట్ ధరలు:

షియోమి పోకోF1 ఇప్పుడు ఇండియాలో దాని యొక్క బేస్ మోడల్ 17,999రూపాయల ప్రారంభ ధర వద్ద లభిస్తుంది.ఈ మొబైల్ యొక్క బేస్ మోడల్‌లో 6 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ గా ఉన్నాయి ఇవే కాకుండా 6 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్, 8 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్మోడల్స్ కూడా అందుబాటులో ఉన్నాయి.వీటి యొక్క ధరల విషయానికి వస్తే 6 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్, 8 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ మోడల్స్ ధరలు వరుసగా రూ .20,999 మరియు రూ .27,999.

 మిడ్-రేంజ్ ఫోన్స్:

మిడ్-రేంజ్ ఫోన్స్:

17,999రూపాయల వద్ద లభించే షియోమి పోకోF1 మొబైల్ ఇప్పుడు మార్కెట్ లో లభించే సామ్‌సంగ్ గెలాక్సీM40 మరియు మోటరోలా వన్ విజన్ వంటి కొన్ని మిడ్-రేంజ్ ఫోన్‌ల కంటే చాలా చౌకగా ఉంది. పోకో సిరీస్‌లో ఇప్పటివరకు పోకోF1 ఫోన్ మాత్రమే పవర్ యూజర్‌లను లక్ష్యంగా చేసుకుంది. మెరుగైన థర్మల్ పనితీరు కోసం ఫోన్ లిక్విడ్ కూలింగ్ టెక్నాలజీని కలిగి ఉంది. త్వరిత ఛార్జ్ 3.0 సపోర్ట్‌తో ఇది 4,000 ఎంఏహెచ్ బ్యాటరీని కలిగి ఉంది.

స్పెసిఫికేషన్స్ :
 

స్పెసిఫికేషన్స్ :

షియోమి పోకోF1 స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే ఇది 6.18-అంగుళాల ఫుల్ HD + డిస్ప్లేతో వస్తుంది. స్నాప్‌డ్రాగన్ 845 ప్రాసెసర్‌తో నడిచే ఈ మొబైల్ 8 జీబీ ర్యామ్ మరియు 256 జీబీ స్టోరేజ్‌తో వస్తుంది. కెమెరా విభాగంలో ఇది వెనుక వైపు 12 మెగాపిక్సెల్ మరియు 5 మెగాపిక్సెల్ AI డ్యూయల్ కెమెరాలను అందిస్తుంది. ముందు భాగంలో 20 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంది.

రెడ్‌మిK20 ప్రో:

రెడ్‌మిK20 ప్రో:

ఇండియాలో రెడ్‌మిK20 ప్రో మొబైల్ లాంచ్ కంటే ముందు షియోమి పోకోF1 మొబైల్ యొక్క ధర తగ్గుతుంది. సరికొత్త రెడ్‌మిK20 స్మార్ట్‌ఫోన్‌లో సరికొత్త క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 855తో వస్తుంది మరియు ఇది 8 జీబీ ర్యామ్ మరియు 256 జీబీ స్టోరేజ్ మోడల్ గా ఉంది. ఈ ఫోన్ యొక్క బేస్ మోడల్ ధర చైనాలో సుమారు CNY 2,499 ( రూ.25,200) కు లభిస్తుంది.

స్పెసిఫికేషన్స్:

స్పెసిఫికేషన్స్:

రెడ్‌మిK20ప్రో సరికొత్త గ్రేడియంట్ గ్లాస్ బ్యాక్ ప్యానెల్ ను కలిగి ఉన్నది.కెమెరా విషయానికి వస్తే ఇది వెనుక వైపు 48 మెగాపిక్సెల్ సోనీ IMX586 సెన్సార్ మరియు 13 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ లెన్స్ తో పాటు 20 మెగాపిక్సెల్ పాప్-అప్ సెల్ఫీ కెమెరాతో కలిపి రెడ్‌మిK20ప్రో మొబైల్ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ మద్దతుతో అందిస్తుంది.అంతే కాకుండా ఇది 27W ఫాస్ట్ ఛార్జింగ్ మద్దతు కలిగిన 4,000 ఎంఏహెచ్ బ్యాటరీ సహాయంతో వస్తుంది. AnTuTu బెంచ్ మార్కింగ్ పరీక్షల ప్రకారం షియోమి యొక్క రెడ్‌మిK20 ప్రో మొబైల్ వేగవంతమైన పనితీరును అందిస్తుందని పేర్కొంది.

Best Mobiles in India

English summary
poco f1 price dropped ahead of redmi k20 pro launch in india

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X