Poco డేస్ లో ఈ మొబైల్ పై తగ్గింపు చూస్తే ఆశ్చర్యపోతారు
Poco F1 ఇప్పుడు ఇండియాలో మరొక సారి ధర తగ్గింపును పొందింది. ఈ ధర తగ్గింపు కేవలం కొన్ని రోజులు మాత్రమే చెల్లుతుంది.ఈ ధర తగ్గింపు కేవలం 6GB + 64GB వేరియంట్ కు మాత్రమే.దీని అసలు ధర రూ.19,999లు కానీ Poco డేస్ సందర్బంగా ప్రస్తుతం దీని ధర రూ.17,999.

కొత్త ధర Mi.com మరియు Flipkart రెండింటిలో ప్రతిబింబిస్తుంది.ఈ తక్కువ ధర Poco డేస్ వేడుకలలో జూన్9 వరకూ చెల్లుతుంది. ఇటీవల Poco F1 6GB+128GB వేరియంట్ స్మార్ట్ ఫోన్ ధర రూ.20,999కు తగ్గింది.గతంలో ఇండియాలో దాని ధర రూ.22,999లుగా ఉండేది.

Poco F1 ధర తగ్గింపు:
Xiaomi సబ్ బ్రాండ్ Poco ట్వీట్ చేసినట్లు Poco F1 ₹19,999 6GB RAM + 64GBస్టోరేజ్ వేరియంట్ ప్రస్తుత ధర రూ.17,999.ఈ ఫోన్ యొక్క చివరి తగ్గింపు ధర రూ.19,999లు. మరియు ఈ మొబైల్ పై ఇప్పుడు Poco డేస్ సందర్బంగా రూ.2,000 డిస్కౌంట్ ను అందిస్తున్నారు. ఈ ధర తగ్గింపు Poco డేస్ విక్రయంలో భాగంగా జూన్ 9 తో ముగుస్తుంది.ఈ ఫోన్ Flipkart, Mi.com రెండింటిపై కొత్త ధరతో జాబితా చేయబడింది. ఫోన్ స్టీల్ బ్లూ మరియు రోసో రెడ్ రంగులలో లభిస్తుంది.

ఆఫర్లు:
ఫ్లిప్ కార్ట్ లో యాక్సిస్ బ్యాంక్ బజ్ క్రెడిట్ కార్డులపై నో-కాస్ట్ EMIఆప్షన్, ఎక్స్ఛేంజ్ ఆఫర్ మరియు 5 శాతం ఇన్స్టంట్ ఆఫ్ ఆఫర్లను అందిస్తోంది. Poco F1 యొక్క మరొక బ్రాండ్ 6GB RAM + 128GBస్టోరేజ్ వేరియంట్ Rs. 20,999లకు మరియు 6GB RAM + 256GBస్టోరేజ్ వేరియంట్ Rs. 27,999లకు అందుబాటులో ఉన్నాయి.

Xiomi Poco F1 స్పెసిఫికేషన్స్ :
6.18 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 2246 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్, ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 845 ప్రాసెసర్, 6/8 జీబీ ర్యామ్, 64/128/256 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో (అప్‌గ్రేడబుల్ టు ఆండ్రాయిడ్ 9.0 పై), హైబ్రిడ్ డ్యుయల్ సిమ్, 12, 5 మెగా పిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 20 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, ఐఆర్ ఫేస్ అన్‌లాక్, డ్యుయల్ 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0, యూఎస్‌బీ టైప్ సి, 4000 ఎంఏహెచ్ బ్యాటరీ, క్విక్ చార్జ్ 3.0, ఫాస్ట్ చార్జింగ్.ఇది 4000mAh బ్యాటరీ, మరియు లిక్విడ్ కూలింగ్ సాంకేతికతను కలిగి ఉంది.ఇది దీర్ఘ గేమింగ్ సెషన్ల సమయంలో CPU ను కూల్ గా ఉంచుతుంది. ఇందులో 256GB వరకు విస్తరించదగిన మైక్రో SD కార్డ్ స్లాట్ కూడా ఉంది.

కలర్ వేరియంట్:
ఈ మొబైల్ రోసా రెడ్, గ్రాఫైట్ బ్లాక్ మరియు స్టీల్ బ్లూ వంటి మూడు రంగులలో మార్కెట్లో అందుబాటులో ఉంది.స్నాప్ డ్రాగన్ 845 SoC ప్రాసెసర్ తో ఇండియన్ మార్కెట్లో చౌకైన ధరకు లబిస్తున్న స్మార్ట్ ఫోన్ Xiomi Poco F1.


Click it and Unblock the Notifications








