పోకెమాన్ గేమ్ ఆడితే మీకు జాబ్ వచ్చినట్లే..ఎలా ఆడాలంటే..

Written By:

ఇది ఓ కొత్త రకం ఉద్యోగ అవకాశం.. మీకు పోకెమాన్ 'మొబైల్ గేమ్ ఆడటమొస్తే ఉద్యోగమిచ్చేస్తామంటూ బెంగళూరుకు చెందిన' బాబాజాబ్స్ 'అనే వెబ్‌సైట్ ప్రకటించింది. ఈ ఆట ఆడటంలో ప్రావీణ్యం సంపాదించిన వారికి ఉద్యోగాలిస్తామని చెబుతూ, అదే వారి అర్హతగా పేర్కొంది. పోకెమాన్‌ను ఎలా పట్టుకోవాలనే విషయంలో పూర్తి అవగాహనతో పాటు శారీరక దృఢత్వం ఉన్నవారు తమ వెబ్‌సైట్ లో ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలని బాబా జాబ్స్ సీఈవో పేర్కొన్నారు. 'పోకెమాన్'లో క్లిష్టమైన దశలు చేరుకోలేనివారు తమ వద్ద ఉన్న ఉద్యోగుల సాయంతో వాటిని దాటవచ్చని చెప్పారు. ఉద్యోగ వేటలో ఉన్నవారు ఆ గేమ్ నేర్చుకుని వెంటనే అప్లయి చేయండి. ఎలా ఆడాలో మీరే చూడండి.

మనుషుల్ని చంపేస్తున్న పిచ్చి గేమ్ ఇదే

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

పోకెమాన్ గో. పట్టుకోండి చూద్దాం

పోకెమాన్ గేమ్ ఆడితే మీకు జాబ్ వచ్చినట్లే..ఎలా ఆడాలంటే..

పోకెమాన్ గో. పట్టుకోండి చూద్దాం అంటూ స్మార్ట్ యూజర్స్ ని పరుగులు పెట్టిస్తున్న కొత్త ఆన్ లైన్ గేమ్. ఇన్నాళ్లు ఇంట్లో, ఆఫీసుల్లో కూర్చుని ఆడిన క్యాండీ క్రష్ సాగా, ట్విల్ లైట్ సాగా, టెంపుల్ రన్ లాంటి గేమ్ కాదిది.

పోకెమాన్ ను వెతుక్కుంటూ

పోకెమాన్ గేమ్ ఆడితే మీకు జాబ్ వచ్చినట్లే..ఎలా ఆడాలంటే..

పోకెమాన్ ను వెతుక్కుంటూ ... చెట్లు, పుట్టలు, నదులు, సముద్రాలు, కొండలు, గుట్టలు ఎక్కించేస్తోంది. రిస్ట్రిక్టెడ్ ఏరియాస్ లోకి వెళ్లి అరెస్టైపోవడం, శవాలుగా తేలడం. ట్రాఫిక్ జాంలు, పబ్లిక్ న్యూసెన్స్ లు. ఒకటేమిటి చెప్పుకుంటూ పోతే పోకెమాన్ వింతలెన్నో.

పట్టుకోవడమే

పోకెమాన్ గేమ్ ఆడితే మీకు జాబ్ వచ్చినట్లే..ఎలా ఆడాలంటే..

రియాలిటీకి వర్చువల్ వరల్డ్ ని లింక్ చేసి ఆటాడించడం. పోకెమాన్ గో అగ్ మెంటెడ్ రియాలిటీ గేమ్. టెంపుల్, చర్చ్, మన దగ్గర్లోని జిమ్, బేకరీ, రెస్టారెంట్స్, మాల్స్, వాటర్ లేక్స్. మౌంటేన్స్. వాటిలో పోకెమాన్స్. వాటిని స్మార్ట్ ఫోన్ ద్వారా పట్టుకోవాలి.

పోకెమాన్స్ ని వెతుక్కుంటూ వెళ్లడంలో

పోకెమాన్ గేమ్ ఆడితే మీకు జాబ్ వచ్చినట్లే..ఎలా ఆడాలంటే..

పోకెమాన్స్ ని వెతుక్కుంటూ వెళ్లడంలో గూగుల్ సెర్చింజిన్ హెల్ప్ చేస్తుంది. దొరికాక పోకెబాల్ తో పోకెమాన్ ని హిట్ చేయాలి. అలా చేయాలంటే పోకెమాన్స్ ని వెతుక్కుంటూ వెళ్లాలి. అందుకే జనం రోడ్ల వెంట పరుగులు పెడుతున్నారు. పోకెమాన్స్ కోసం పిచ్చిపట్టినవాళ్లలా తిరుగుతున్నారు.

జీపీఎస్ కనెక్షన్

పోకెమాన్ గేమ్ ఆడితే మీకు జాబ్ వచ్చినట్లే..ఎలా ఆడాలంటే..

పోకెమాన్ ఆడాలంటే స్మార్ట్ ఫోన్ కావాలి. దానికి జీపీఎస్ కనెక్షన్ ఉండాలి. దాంతో పాటు ఇంటర్నెట్ ... వైఫై మస్ట్. అవి లేకపోతే గేమ్ ఆడలేరు. 

రియాల్టీ వరల్డ్ కు లింక్

పోకెమాన్ గేమ్ ఆడితే మీకు జాబ్ వచ్చినట్లే..ఎలా ఆడాలంటే..

రిలీజై 15 రోజులు కాలేదు. ఇప్పటికే సైట్ క్రాష్ అయ్యేంత హిట్స్ వస్తున్నాయి. స్మార్ట్ ఫోన్లో పోకెమాన్ యాప్ ఉండాలి. గేమ్ ఇంటర్ ఫేస్ లో కనిపించే పోకెమాన్లను రియాల్టీ వరల్డ్ కు లింక్ చేస్తారు. ఫోన్లోని జీపీఎస్, కెమెరా సాయంతో ఈ గేమ్ ఆడాల్సి ఉంటుంది.

మొబైల్ లో పోకెమాన్ ను వెతుక్కుంటూ

పోకెమాన్ గేమ్ ఆడితే మీకు జాబ్ వచ్చినట్లే..ఎలా ఆడాలంటే..

మొబైల్ లో పోకెమాన్ ను వెతుక్కుంటూ వెళ్లేందుకు గూగుల్ మ్యాప్స్, లొకేషన్స్ కనుక్కునేందుకు డైరెక్షన్ ఇస్తుంది. గూగుల్ డైరెక్షన్ చూపించిన ఏరియాకు మీరెళ్లగానే అక్కడ పోకెమాన్ కనిపిస్తుంది. రియల్ గా కాదు వర్చువల్ గా.

పోకెమాన్స్ కనిపించగానే

పోకెమాన్ గేమ్ ఆడితే మీకు జాబ్ వచ్చినట్లే..ఎలా ఆడాలంటే..

పోకెమాన్స్ కనిపించగానే ... మొబైల్లో కెమెరా ఆటోమెటిగ్ గా ఆన్ అవుతుంది. రియల్ వరల్డ్ లోని పొకెమాన్ యాడ్ అవుతుంది. దాన్ని మీ మొబైల్లోని పొకెబాల్ తో హిట్ చేయాలన్నమాట. ఒక్కోసారి పొకెమాన్ హోల్డ్ లోకి వస్తుంది. లేదంటే పారిపోతుంది.

పొకెమాన్ ని కొడితే పవర్

పోకెమాన్ గేమ్ ఆడితే మీకు జాబ్ వచ్చినట్లే..ఎలా ఆడాలంటే..

పొకెమాన్ ని కొడితే పవర్ వస్తుంది. అంటే మరిన్ని పొకెబాల్స్ మీకు యాడ్ అవుతాయన్నమాట. దాంతో మరిన్ని పొకెమాన్స్ కొట్టేంత పవర్ వస్తుంది. లేదంటే ఆన్ లైన్ లో పొకెబాల్స్ ని డబ్బులు పెట్టి కొనాల్సి ఉంటుంది.

పోకెమాన్ యాప్ లో

పోకెమాన్ గేమ్ ఆడితే మీకు జాబ్ వచ్చినట్లే..ఎలా ఆడాలంటే..

పోకెమాన్ యాప్ లో పొకెబాల్ .. పొకెస్టాప్, పొకె జిమ్స్ అని రకరకాల పేర్లుంటాయి. మీ మొబైల్లో చూపించే పొకెమాన్స్ ... కొన్ని ప్రాంతాల్లో లొకేట్ అయ్యుంటాయి. వాటిని పొకెస్టాప్స్ అంటారు .. మీరెళ్లి ఫైట్ చేసే ప్లేస్ ని పొకెజిమ్స్ అంటారు.

గెలిస్తే మీరే జిమ్ ఓనర్

పోకెమాన్ గేమ్ ఆడితే మీకు జాబ్ వచ్చినట్లే..ఎలా ఆడాలంటే..

అక్కడికెళ్లి జిమ్ బ్యాటిల్ చేయాలన్నమాట. గెలిస్తే మీరే జిమ్ ఓనర్. అక్కడో పొకెమాన్ ని వదిలేస్తే .. మీకు రెగ్యులర్ గా పవర్ బూస్ట్ నిస్తుందది. నిజానికది రియల్ జిమ్ కాదు. వర్చువల్ జిమ్ అన్నమాట.

మూడురకాల టీమ్స్

పోకెమాన్ గేమ్ ఆడితే మీకు జాబ్ వచ్చినట్లే..ఎలా ఆడాలంటే..

ఇక ఈ గేమ్ లో మూడురకాల టీమ్స్ ఉంటాయి. టీం ఇన్ స్టింక్ట్ (టీమ్ ఇన్స్టింక్ట్), టీం వాలోర్ (టీమ్ Vallore), టీం మిస్టిక్ (టీమ్ మిస్టిక్) అని. మూడు టీంలు మూడు రకాలుగా డివైడై ఆడాల్సి ఉంటుందట.

తర్వాత వెళ్లే వాళ్లకు నో ఛాన్స్

పోకెమాన్ గేమ్ ఆడితే మీకు జాబ్ వచ్చినట్లే..ఎలా ఆడాలంటే..

కేవలం మొదటి పది మందికి మాత్రమే పొకెమాన్స్ దొరుకుతాయి. తర్వాత వెళ్లే వాళ్లకు నో ఛాన్స్ అన్నట్టు. అందుకే తొందరగా పట్టుకునేందుకు పక్కనేం జరుగుతుందో పట్టించుకోకుండా .. పరుగులు పెడుతున్నారంతా. నడవలేని వాళ్లు, కార్లు, బైక్లు తీసుకుని వెళ్లిపోతున్నారు. దాంతో యాక్సిడెంట్లు, ట్రాఫిక్ జామ్ లు అన్నీ జరిగిపోతున్నాయి.

లెవెల్స్ కూడా వందల్లోనే

పోకెమాన్ గేమ్ ఆడితే మీకు జాబ్ వచ్చినట్లే..ఎలా ఆడాలంటే..

పోకెమాన్ గో గేమ్ లో లెవెల్స్ కూడా వందల్లోనే. 152 పోకెమాన్స్ ని కొట్టాలంటే .. ఎన్నో లెవెల్స్ దాటాల్సి ఉంటుంది. మొదటి వంద, 120, 150 లెవెల్స్ వరకు గేమ్ ఈజీగానే ఉంటుందంటున్నారు ఆడేవాళ్లు. ఆ తర్వాత రాక్ టైప్ ... ఓయింక్స్ లు, డెవిల్ టైప్ గ్యాస్టిల్ పొకెమాన్స్ వస్తుంటాయి.

వాటిని పట్టుకోవడం అంత ఈజీ

పోకెమాన్ గేమ్ ఆడితే మీకు జాబ్ వచ్చినట్లే..ఎలా ఆడాలంటే..

అవి ఎక్కడో కొండల్లో, గుట్టల్లో, గుహల్లో .. స్మశానాల్లో .. ఎక్కడెక్కడో ఉంటాయి. వాటిని పట్టుకోవడం అంత ఈజీ కాదంటారు పొకెమాన్ ఆటగాళ్లు. అందుకే ఈ గేమ్ ని డేంజర్ లెవెల్స్ ని దాటినవాళ్లంతా లక్షలు సంపాదిస్తున్నారు. ఇది మరోరకమైన బిజినెస్ లా మారింది. ఓ లెవెల్ ని దాటాక తమ అకౌంట్లను ఈబే, ఫ్లిప్ కార్ట్, అమెజాన్ లాంటి సైట్లలో అమ్మకానికి పెడుతున్నారు.

మనదేశంలో ఇప్పటిదాకా

పోకెమాన్ గేమ్ ఆడితే మీకు జాబ్ వచ్చినట్లే..ఎలా ఆడాలంటే..

మనదేశంలో ఇప్పటిదాకా పోకెమాన్ గోని అఫిషియల్ గా లాంఛ్ చేయలేదు. ఇండియాలో అడుగుపెట్టేందుకు మరో రెండు వారాలు టైం పడుతుందట. కానీ ఇప్పటికే హైదరాబాద్, చెన్నై, ముంబైలాంటి సిటీస్ లో పొకెమాన్ వాక్ జరిగింది. వరల్డ్ వైడ్ డౌన్ లోడ్స్ లో 6.5 శాతం భారత్ వాటా ఉన్నట్టు సిమిలర్ వెబ్ వెల్లడించింది.

వాటితో వైరస్ లు ఈజీగా అటాక్ అయ్యే ప్రమాదం

పోకెమాన్ గేమ్ ఆడితే మీకు జాబ్ వచ్చినట్లే..ఎలా ఆడాలంటే..

నిజానికి మనదేశంలో డౌన్ లోడ్ చేసుకుంటున్నవి ట్రయల్ వెర్షన్స్ మాత్రమేనట. వాటితో వైరస్ లు ఈజీగా అటాక్ అయ్యే ప్రమాదముందని వార్నింగ్స్ ఇస్తున్నా ... ఎవరూ చెవికెక్కించుకోవట్లేదు. ఆ వైరస్ తో పాకెట్ వాలెట్స్ కు ప్రమాదమని చెప్పినా ఎవరూ వినే పరిస్థితుల్లో లేరంటే ... పొకెమాన్ తిక్కేంటో తెలుస్తుంది.

 

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here Write Pokemon Go fans, there is a new job for you
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot